BigTV English

Water Cans : వాటర్ క్యాన్స్‌లో నీరు తాగుతున్నారా..?

Water Cans : వాటర్ క్యాన్స్‌లో నీరు తాగుతున్నారా..?
Plastic
Plastic Water Cans

Plastic Water Cans : ఈ రోజుల్లో ప్టాస్టిక్ వినియోగం ఎలా ఉందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఉదయం లేచినప్పటి నుంచి రాత్రి పడుకునే వరకు మనం వాడే ప్రతి దానిలో ప్లాస్టిక్ ఉంటుంది. అలానే తాగే వాటర్ బాటిల్ నుంచి వాటర్ క్యాన్‌ల వరకు ప్రతీది ప్లాస్టిక్ మయం. సాంకేతిక యుగంలో తాగునీటి అవసరాలకోసం 20 లీటర్ వాటర్ క్యాన్‌‌లపై పల్లెల నుంచి పట్టణాల వరకు ప్రజలు ఆధారపడుతున్నారు.


అయితే రోజువారీ తాగునీటి అవసరాల కోసం వాటర్ క్యాన్‌లను ఉపయోగించేవారిని నిపుణులు హెచ్చిరిస్తున్నారు. దీర్ఘకాలంలో వాటర్ క్యాన్‌లలో నీరు తాగడమనేది ఆరోగ్యానికి హానికరం, పర్యవరణానికి ముప్పు కలిగే ప్రమాదం ఉందని నిపుణులు ఆందోళన చెందుతున్నారు.

Read More : మీ చేతిలో ప్లాస్టిక్ బాటిల్ ఉందా..? అయితే మీరు ప్రమాదంలో ఉన్నట్లే..!


ప్లాస్టిక్ శతాబ్దాలుగా విచ్ఛిన్నం కాకుండా ఉండే లక్షణం కలిగి ఉంటుంది. దీనివల్ల పర్యావరణానికి హానికరంగా మారుతున్నాయి. వాటర్ క్యాన్‌లు పాతవిగా మారటం వల్ల వ్యర్ధాలుగా పారేస్తున్నారు. ఇవన్నీ జల జీవావరణ వ్యవస్థలను కాలుష్యం చేస్తున్నాయి. అంతేకాకుండా వన్యప్రాణులు, సహజ సమతుల్యతకు ముప్పుగా మారుతున్నాయి.

ప్లాస్టిక్ పై శాస్త్రవేత్తలు పరిశోధనలు జరపగా.. ఒక్కో లీటర్ ప్లాస్టిక్ బాటిల్లో పదివేల ప్లాస్టిక్ అవశేషాలు ఉన్నట్లు తెలింది. ఇక ప్లాస్టిక్ వాటర్ క్యాన్‌లో ఈ అవశేషాల సంఖ్య ఏ స్థాయిలో ఉంటుందో అర్థం చేసుకోవాలి. కొళాయి నీటితో పోల్చితే ప్లాస్టిక్ బాటిల్, క్యాన్‌లలో ప్లాస్టిక్ ఎక్కువగా ఉన్నట్లు గుర్తించారు.

ప్లాస్టిక్ వాటర్ క్యాన్లను వినియోగించడం వల్ల తీవ్రమైన అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి. ముఖ్యంగా
జీర్ణ సమస్యలు , హార్మోన్లలో అసమతుల్యత, క్యాన్సర్ వంటి వ్యాధులు వచ్చే ప్రమాదం ఉంది. ప్లాస్టిక్ నుంచి వెలువడే రసాయనాలు రోగనిరోధక వ్యవస్థకు అంతరాయం కలిగిస్తాయి.

Read More : క్యాన్సర్‌ కణితలు పెరగడానికి అసలు కారణం.. నిజాలు తెలిస్తే షాక్ అవుతారు..?

ప్లాస్టిక్ వాటర్ క్యాన్‌లకు సూర్యుని వేడి తగలడం వల్ల డయాక్సిన్ అనే హానికరమైన టాక్సిన్ విడుదల అవుతుంది. ఈ టాక్సిన్ వల్ల రొమ్ము క్యాన్సర్ ప్రమాదం పెరుగుతుంది.ప్లాస్టిక్ వాటర్ క్యాన్‌లు బిస్ఫినాల్ అనే రసాయనాన్ని కూడా ఉత్పత్తి చేస్తాయి. దీనివల్ల సంతానోత్పత్తి, డయాబెటిస్ సమస్యలు వస్తాయి.

ప్లాస్టిక్ బాటిల్స్‌లో స్టోర్ చేసిన నీటిని తాగినట్లయితే క్యాన్సర్ కి దారితీసే అవకాశాలు ఉన్నాయని చెబుతున్నారు. రాగి గ్లాసులోని రాగి బాటిల్స్‌ని వాడాలని నిపుణులు సూచిస్తున్నారు. నీళ్లని స్టోర్ చేయడానికి మట్టి పాత్రలు లేదా స్టీల్ బిందెలను వాడటం మంచిది. ఇలా చేయడం మీ ఆరోగ్యానికి ఎంతో మేలు చేయడంతో పాటు ఎన్నో రకాల సమస్యలను దరిచేరకుండా చేస్తుంది. అందుకే ప్లాస్టిక్ వాటర్ క్యాన్లలో స్టోర్ చేసిన నీళ్లను త్రాగడం మానుకోండి.

Disclaimer : ఈ కథనాన్ని ఆరోగ్య నిపుణుల సలహాలు , పలు వైద్య పరిశోధనలు ఆధారంగా రూపొందించాము.

Related News

Parenting Tips: పిల్లల అరుపులు ఎలా అర్థం చేసుకోవాలి? తల్లిదండ్రులకు అవసరమైన సమాచారం

Chapati: నిజమా.. చపాతి అలా తింటే ఆరోగ్యానికి ప్రమాదమా..?

Hair Loss: ఈ విటమిన్ లోపమే.. జుట్టు రాలడానికి కారణమట !

Ajwain Water Benefits: వాము నీరు తాగితే.. ఈ ఆరోగ్య సమస్యలు పరార్ !

Fact Check: నవ్వితే కళ్ల నుంచి నీరు వస్తుందా? అయితే కారణం ఇదీ?

Skin Whitening Tips: ఛాలెంజ్, ఈ టిప్స్ పాటిస్తే.. 7 రోజుల్లోనే నిగనిగలాడే చర్మం

Big Stories

×