Avocado Hair Mask: జుట్టు పొడిగా, నిర్జీవంగా, చివర్లు చిట్లినట్లు కనిపిస్తోందా? రోజువారీ కాలుష్యం, స్టైలింగ్ టూల్స్ వాడకం, రసాయనాలతో కూడిన ఉత్పత్తులు జుట్టు ఆరోగ్యానికి తీవ్రమైన నష్టం కలిగిస్తాయి. ఇలాంటి సమయంలో జుట్టుకు తగిన పోషణ అవసరం. లేదంటే జుట్టు రాలడం ఎక్కువయ్యే ప్రమాదం కూడా ఉంటుంది. ఇదిలా ఉంటే జుట్టు సంబంధిత సమస్యల కోసం మార్కెట్లో లభించే ఖరీదైన హెయిర్ మాస్క్‌లు కాకుండా.. ఇంట్లోనే లభించే సహజసిద్ధమైన పదార్థాలతో మీ జుట్టుకు అద్భుతమైన పోషణ ఇవ్వవచ్చు. అందులో ముఖ్యమైంది అవొకాడో.
అవకాడోలో విటమిన్ ఇ, బి, ఆరోగ్యకరమైన కొవ్వులు, పొటాషియం వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి జుట్టు కుదుళ్లను బలోపేతం చేసి.. డ్యామేజ్ అయిన జుట్టును పునరుద్ధరిస్తాయి. పొడి జుట్టుకు ఇది ఒక అద్భుతమైన మాయిశ్చరైజర్ లా పనిచేస్తుంది. అవకాడోతో జుట్టుకు మేలు చేసే కొన్ని సులభమైన హెయిర్ మాస్క్‌లను ఎలా తయారు చేసి వాడాలనే విషయాలను గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
1. అవకాడో, ఆలివ్ ఆయిల్ హెయిర్ మాస్క్:
ఇది చాలా సులభమైన, శక్తివంతమైన మాస్క్. ఇది జుట్టుకు లోతైన మాయిశ్చరైజింగ్ అందిస్తుంది. అంతే కాకుండా జుట్టు రాలకుండా చేయడంలో కూడా ప్రభావవంతంగా పనిచేస్తుంది.
కావలసినవి:
బాగా పండిన ఒక అవకాడో
2 టేబుల్ స్పూన్ల ఆలివ్ ఆయిల్
తయారీ విధానం:
ఒక గిన్నెలో పండిన అవకాడో గుజ్జును తీసుకుని, దాన్ని మెత్తగా పేస్ట్ చేయండి. అందులో ఆలివ్ ఆయిల్ కలిపి.. ఉండలు లేకుండా బాగా కలపండి. ఈ మిశ్రమాన్ని తడి జుట్టుకు పట్టించి.. ముఖ్యంగా జుట్టు చివర్లకు ఎక్కువగా అప్లై చేయండి. 30 నిమిషాల తర్వాత షాంపూతో తలస్నానం చేయండి.
2. అవకాడో, తేనె, అరటిపండుతో హెయిర్ మాస్క్:
ఈ మాస్క్ జుట్టును మృదువుగా.. మెరిసేలా చేస్తుంది. తేనె ఒక సహజమైన హ్యుమెక్టెంట్, ఇది తేమను బంధిస్తుంది.
కావాల్సినవి:
బాగా పండిన ఒక అవకాడో
సగం పండిన అరటిపండు
1 టేబుల్ స్పూన్ తేనె
తయారీ విధానం:
అవకాడో, అరటిపండును మెత్తగా పేస్ట్ చేసి, అందులో తేనె కలపండి. ఈ మిశ్రమాన్ని మీ జుట్టుకు బాగా పట్టించండి. 20-25 నిమిషాల తర్వాత గోరువెచ్చని నీటితో కడిగేసి, షాంపూతో తలస్నానం చేయండి.
3. అవకాడో, పెరుగు హెయిర్ మాస్క్:
ఈ మాస్క్ జుట్టుకు బలాన్ని ఇస్తుంది. పెరుగులో ఉండే ప్రోటీన్లు జుట్టు కుదుళ్లను బలపరుస్తాయి.
కావలసినవి:
సగం అవకాడో
2 టేబుల్ స్పూన్ల పెరుగు
Also Read: జీర్ణ సమస్యలా ? ఈ టిప్స్‌తో.. చెక్ పెట్టండి !
తయారీ విధానం:
అవకాడో గుజ్జులో పెరుగు కలిపి, మెత్తని పేస్ట్ లా చేయండి. ఈ పేస్ట్‌ను మీ తల చర్మానికి, జుట్టుకు పట్టించండి. 30 నిమిషాల తర్వాత షాంపూతో తలస్నానం చేయండి.
ఈ హెయిర్ మాస్క్‌లను వారానికి ఒకటి లేదా రెండుసార్లు వాడితే, మీ జుట్టు ఆరోగ్యం మెరుగుపడుతుంది. మీ జుట్టు సహజసిద్ధంగా ఆరోగ్యంగా, మెరిసేలా మారడానికి ఈ అవకాడో హెయిర్ మాస్క్‌లు ఒక అద్భుతమైన మార్గం. మీ జుట్టుకు ఎలాంటి రసాయనాలు లేని పోషణను అందించడానికి ఈ మాస్క్‌లను ప్రయత్నించండి.