Pookie: జనరేషన్ మారేకొద్దీ ప్రేక్షకుల తీరు మారుతూ ఉంటుంది. అప్పటి కథలను ఇప్పటి ప్రేక్షకులు ఆదరించడం తగ్గించారు. ఇప్పటి యువతలో చాలా మార్పులు వచ్చాయి. జెన్ జెడ్ జనరేషన్ కు తెలుగు పదాలు కూడా తెలియడం లేదు. ఇక ఈ మధ్యకాలంలో వచ్చే టైటిల్స్ ను అర్ధం చేసుకోవడం చాలా కష్టంగా మారింది. అర్ధం పర్థం లేని టైటిల్స్ పెట్టినా ఓకే కానీ, మరీ బూతు అర్దాలు వచ్చే టైటిల్స్ తో పిచ్చెక్కిస్తున్నారు.
ఒకప్పుడు డబ్బింగ్ సినిమాలకు అయినా కూడా భాషను బట్టి టైటిల్స్ మార్చేవారు. ఆ సినిమాలోని కథను బట్టి, ఏ టైటిల్ ఐతే సెట్ అవుతుందో దాన్ని పెట్టేవారు. తమిళ్ లో ఒక టైటిల్.. తెలుగులో ఒక టైటిల్.. హిందీలో ఒక టైటిల్ అని ఉండేది. కానీ, ఇప్పుడు అలా లేదు. పాన్ ఇండియా కు సెట్ అయ్యే టైటిల్ అని.. మా భాషలో టైటిల్ ను ఇతర భాషల్లో కూడా పెట్టేస్తాం. చూస్తే చూడండి.. లేకపోతే మానేయండి అన్నట్లు మారిపోయారు.
తాజాగా తమిళ్ నుంచి బూతు టైటిల్ తో ఒక సినిమా రిలీజ్ కు సిద్దమవుతుంది. కోలీవుడ్ హీరో విజయ్ ఆంటోనీ మేనల్లుడు అజయ్ దిశాన్ హీరోగా తెరకెక్కుతున్న చిత్రం పూకి. గణేష్ చంద్ర దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను విజయ్ ఆంటోనీ నిర్మిస్తున్నాడు. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన పోస్టర్ ను రిలీజ్ చేస్తూ టైటిల్ ను రివీల్ చేశారు. తమిళ్ లో పూకి అర్ధం ఏంటో తెలియదు కానీ, తెలుగులో మాత్రం అదో పెద్ద బూతు. ఈమధ్యనే సోషల్ మీడియాలో ఈ పదం పెద్ద సెన్సేషన్ సృష్టించిందో అందరికీ తెల్సిందే.
బహుశా సెన్సేషన్ సృష్టించొచ్చు అనే ఉద్ద్యేశంతోనే మేకర్స్ ఈ టైటిల్ ను ఎంచుకున్నారు అనుకోవచ్చు. టైటిల్ కి తగ్గట్లే పోస్టర్ లో కూడా బీర్లు, సిగరెట్స్ తో నిండిన చెయ్యి.. అందులోనూ మిడిల్ ఫింగర్ తో అమ్మాయి బొమ్మను పట్టుకోవడం.. అడల్ట్ కంటెంట్ ను సూచించే ప్రతిదీ ఇందులో ఉంది అని చెప్పొచ్చు. ఇక పోస్టర్ చూసిన ప్రతి ఒక్కరు ఛీఛీ.. ఇదెక్కడి దిక్కుమాలిన టైటిల్ రా.. కొంచెం కూడా సిగ్గు లేదా.. అని మండిపడుతున్నారు. మరి ఈ విమర్శలపై విజయ్ ఆంటోనీ స్పందిస్తాడేమో చూడాలి.