BigTV English

Biscuits: పిల్లలకు బిస్కెట్లు ఇస్తున్నారా ? ఈ విషయం తెలిస్తే ఇప్పుడే మానేస్తారు !

Biscuits: పిల్లలకు బిస్కెట్లు ఇస్తున్నారా ? ఈ విషయం తెలిస్తే ఇప్పుడే మానేస్తారు !
Advertisement

Biscuits: బిస్కెట్లు.. చాలామందికి ఉదయం లేదా సాయంత్రం టీతో పాటు తప్పనిసరిగా తినే స్నాక్. పిల్లల నుంచి పెద్దల వరకు ఎంతో ఇష్టపడి బిస్కెట్లను తింటుంటారు. నిజానికి ఇవి మీ ఆరోగ్యానికి నిశ్శబ్దంగా హాని కలిగించే ప్రమాదకరమైన ‘సైలెంట్ కిల్లర్’ అని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ప్యాక్ చేసిన బిస్కెట్లు తినడం వల్ల అనేక ఆరోగ్య సమస్యలు వస్తాయి. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.


బిస్కెట్లు తినడం వల్ల కలిగే సైడ్ ఎఫెక్ట్స్:

1. మైదాతో ప్రమాదం: చాలా రకాల బిస్కెట్లలో ప్రధానంగా ఉపయోగించేది మైదా లేదా రిఫైన్డ్ గోధుమ పిండి. ఈ పిండి తయారీ ప్రక్రియలో ముఖ్యమైన పోషకాలు, ఫైబర్ పూర్తిగా తొలగిస్తారు. మైదాలో పీచు పదార్థం దాదాపు సున్నా ఉంటుంది. దీని వల్ల జీర్ణ వ్యవస్థపై భారం పడి, మలబద్ధకం, అజీర్ణం వంటి సమస్యలు వస్తాయి. అంతేకాకుండా.. మైదా రక్తంలో చక్కెర స్థాయిలను వేగంగా పెంచుతుంది. ఇది ఇన్సులిన్ నిరోధకతకు.. దీర్ఘకాలంలో టైప్-2 మధుమేహానికి దారి తీస్తుంది.


2. ట్రాన్స్ ఫ్యాట్స్, కొలెస్ట్రాల్ ముప్పు: బిస్కెట్లు ఎక్కువ కాలం తాజాగా ఉండడానికి.. రుచిగా ఉండటానికి తయారీ దారులు హైడ్రోజనేటెడ్ నూనెలు ఉపయోగిస్తారు. వీటిలో అధిక మొత్తంలో ట్రాన్స్ ఫ్యాట్స్ ఉంటాయి. ఈ ట్రాన్స్ ఫ్యాట్స్ శరీరంలోని చెడు కొలెస్ట్రాల్ స్థాయిలను పెంచి, మంచి కొలెస్ట్రాల్‌ ను తగ్గిస్తాయి. ఇది గుండె ధమనులలో అడ్డంకులు సృష్టించి.. గుండెపోటు, స్ట్రోక్ వంటి తీవ్రమైన వ్యాధుల ప్రమాదాన్ని 30% వరకు పెంచుతుందని అధ్యయనాలు చెబుతున్నాయి.

3. అధిక చక్కెర, ఊబకాయం సమస్య: చాలా బిస్కెట్లు.. ముఖ్యంగా క్రీమ్ బిస్కెట్లు, ఫ్లేవర్డ్ బిస్కెట్లలో చక్కెర శాతం విపరీతంగా ఉంటుంది. చక్కెర అధికంగా తీసుకోవడం వల్ల శరీరంలో కొవ్వు పేరుకుపోయి ఊబకాయం సమస్య వస్తుంది. ముఖ్యంగా కడుపు చుట్టూ కొవ్వు, ఫ్యాటీ లివర్ వంటి సమస్యలకు ఇది ప్రధాన కారణం. అధిక చక్కెర దంతాలపై ప్లాక్ ఏర్పడటానికి.. దంతక్షయానికి కూడా దారితీస్తుంది.

4. రసాయనాలు : బిస్కెట్ల షెల్ఫ్ లైఫ్ పెంచడానికి.. ఆకర్షణీయమైన రంగు, రుచి కోసం కృత్రిమ రసాయనాలు, ప్రిజర్వేటివ్‌లు కలుపుతారు. ఉదాహరణకు.. కొన్ని బిస్కెట్లలో ఉపయోగించే BHA, BHT వంటి రసాయనాలు కాలేయానికి హాని కలిగిస్తాయి. లేదా ఇవి క్యాన్సర్ కారకాలుగా మారతాయి. క్రీమ్ బిస్కెట్లలోని కృత్రిమ రంగులుపిల్లలలో హైపర్యాక్టివిటీ, చికాకు వంటి సమస్యలకు కారణమవుతాయి. ఈ రసాయనాలు పేగులలోని ఆరోగ్యకరమైన బ్యాక్టీరియాను కూడా దెబ్బతీసి.. రోగనిరోధక శక్తిని తగ్గిస్తాయి.

5. పోషక విలువలు లేని కేలరీలు: బిస్కెట్లు అధిక కేలరీలను అందిస్తాయి కానీ.. శరీరానికి అవసరమైన విటమిన్లు, మినరల్స్ లేదా ఫైబర్‌ను అందించలేవు. వీటిని ‘ఎంప్టీ కేలరీలు’ అని పిలుస్తారు. దీని అర్థం.. మీరు బిస్కెట్లు తిన్నప్పటికీ.. మీ శరీరం సరైన పోషకాలను కోల్పోతుంది. దీని వల్ల త్వరగా ఆకలి వేయడం, అతిగా తినడం జరిగి, బరువు మరింత పెరుగుతారు.

Also Read: హ్యాపీ దీపావళి సింపుల్‌గా.. విషెల్ ఇలా చెప్పేయండి

బిస్కెట్లు రుచికి బాగున్నప్పటికీ.. వాటిలో దాగి ఉన్న ట్రాన్స్ ఫ్యాట్స్, మైదా, అధిక చక్కెర, రసాయనాల వల్ల అవి మీ గుండె, జీర్ణవ్యవస్థ, మెటబాలిక్ ఆరోగ్యానికి తీవ్రమైన ముప్పుగా మారతాయి. ఆరోగ్యంగా ఉండాలనుకునేవారు.. ముఖ్యంగా పిల్లల విషయంలో, బిస్కెట్లను రోజువారీ ఆహారంలో భాగంగా చేయకుండా.. అప్పుడప్పుడు మాత్రమే ఇవ్వాలి. వాటికి బదులుగా పండ్లు, సీడ్స్, మొలకెత్తిన విత్తనాలు వంటి సహజమైన, పీచు పదార్థాలు అధికంగా ఉండే స్నాక్స్‌ తినిపించడం మంచిది. ఆరోగ్యకరమైన జీవనశైలి కోసం తినే ఆహారం విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. ఇలా చేయడం వల్ల మాత్రమే వ్యాధుల బారిన పడకుండా ఉంటారు.

Related News

White Onion Vs Red Onion: ఎరుపు, తెలుపు ఉల్లిపాయల మధ్య తేడా మీకు తెలుసా ? నిజం తెలిస్తే షాక్ అవుతారు !

Morning walk Or Evening walk: ఉదయం లేదా సాయంత్రం.. ఎప్పుడు నడిస్తే ఎక్కువ ప్రయోజనాలుంటాయ్ ?

Diwali 2025: లక్ష్మీదేవికి ఇష్టమైన ప్రసాదం.. ఇలా చేసి నైవేద్యం సమర్పించండి

Diwali Wishes 2025: హ్యాపీ దీపావళి సింపుల్‌గా.. విషెల్ ఇలా చెప్పేయండి

Bathing: స్నానం ఎంతసేపు చెయ్యాలి? స్నానానికి ఉన్న అసలు ప్రాముఖ్యం ఇదే!

Sleeping without pillow: దిండు లేకుండా నిద్రపోతే శరీరానికి జరిగే అద్భుత మార్పులు ! తెలుసుకుంటే ఇకపై దిండు వేసుకోరేమో!

Memory: జ్ఞాపకశక్తి పెరగాలంటే ఇవి తినండి..

Big Stories

×