Diwali 2025: : నేడు.. దేశవ్యాప్తంగా దీపావళి పండగను భక్తితో జరుపుకుంటున్నారు. ఈ రోజు లక్ష్మీదేవి, వినాయకుడి పూజకు చాలా పవిత్రమైనదిగా భావిస్తారు. ఈ రోజున ఇంట్లో లక్ష్మీ పూజ సమయంలో లక్ష్మీ దేవికి ఆహారాన్ని నైవేద్యం పెట్టే సంప్రదాయం కూడా ఉంది.
లక్ష్మీదేవికి కొబ్బరి ఉత్పత్తులు అంటే చాలా ఇష్టమని చెబుతారు. కాబట్టి, ఈ దీపావళికి మీ ఇంట్లో శ్రేయస్సు, సంపద, శాంతి నెలకొనాలని మీరు కోరుకుంటే.. లక్ష్మీదేవికి కొబ్బరి బర్ఫీని సమర్పించడం మర్చిపోవద్దు. ఇది రుచికరమైనది మాత్రమే కాదు.. స్వచ్ఛత, శుభానికి చిహ్నంగా కూడా చెబుతారు. ఈ దీపావళికి లక్ష్మీదేవిని సంతోషపెట్టడానికి కొబ్బరి బర్ఫీ తయారు చేసే సులభమైన పద్ధతిని ఇప్పుడు నేర్చుకుందాం.
ఇంట్లో కొబ్బరి బర్ఫీ తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు:
తాజాగా తురిమిన కొబ్బరి – 2 కప్పులు
ఖోవా – 1 కప్పు
చక్కెర – 1 కప్పు
ఏలకుల పొడి – 1/2 స్పూన్
నెయ్యి – 1 టేబుల్ స్పూన్
జీడిపప్పు, బాదం (గార్నిష్ కోసం)
తయారీ విధానం:
కొబ్బరి బర్ఫీ తయారు చేయడం చాలా సులభం. దీన్ని తయారు చేయడానికి.. ముందుగా మందపాటి అడుగు ఉన్న పాన్‌లో నెయ్యి వేడి చేయండి. నెయ్యి వేడి అయిన తర్వాత.. తురిమిన కొబ్బరిని వేసి 2-3 నిమిషాలు తేలికగా వేయించాలి. దీని తరువాత..కోవా చక్కెర వేసి తక్కువ మంట మీద ఉడికించాలి. ఎక్కువ కలుపుతూ ఉండండి. అది చిక్కగా మారడం ప్రారంభించినప్పుడు.. ఏలకుల పొడిని వేయండి. గట్టిపడిన తర్వాత నెయ్యి రాసిన ప్లేట్ మీద వేయండి. చివరగా.. పైన డ్రైఫ్రూట్స్ చల్లి చల్లారనివ్వండి. చల్లబడిన తర్వాత.. కావలసిన ఆకారాలలో కట్ చేసి, దీపావళి పూజ సమయంలో లక్ష్మీ దేవికి ఈ బర్ఫీని సమర్పించండి. ఈ తీపి స్వచ్ఛమైనది, ఇంట్లో తయారుచేసింది కాబట్ట నైవేద్యంగా సమర్పించవచ్చు.