Dandruff Ayurvedic Mask| చుండ్రు లేదా డాండ్రఫ్ అనేది చాలామందిని ఇబ్బందిపెట్టే సాధారణమైన సమస్య. ఈ సమస్య ఒక్కసారి తగ్గినట్లే అనిపించినా.. కొంతకాలానికే మళ్లీ తిరిగి కనిపిస్తూ ఉంటుంది. డాండ్రఫ్ కు ప్రధాన కారణం ఒకరకమైన ఫంగస్ అని చాలామందికి తెలియకపోవచ్చు.
వాస్తవానికి, మనుషులందరి చర్మంపై చుండ్రు సహజంగా కొన్ని పరిమితుల్లో ఉంటూనే ఉంటుంది. కానీ, కొంత మందిలో ఈ సమస్య తీవ్రంగా ఉంటుంది. సమస్య తీవ్రంగా ఉన్నవారు బయటకు వెళ్లడానికే కూడా ఇబ్బందిగా ఫీల్ అవుతారు.
డాండ్రఫ్ అనేది జుట్టు కదుళ్ల వద్ద వద్ద చనిపోయిన చర్మ కణాలు పేరుకుపోవడం వల్ల ఏర్పడుతుంది. దీని వలన తలనొప్పి, దురద, అసౌకర్యం, అలాగే తెల్లటి పొలుసులు కనిపించడం జరుగుతుంది. చుండ్రు ఏర్పడటానికి అనేక కారణాలు ఉండొచ్చు. ముఖ్యంగా, పొడి చర్మం, అతి జిడ్డు చర్మం, మలాసేజియా అనే ఫంగస్, సోరియాసిస్, తామర వంటి చర్మ సంబంధిత వ్యాధులు, అలాగే కొన్ని రసాయనాల వాడకం వంటివి ఈ సమస్యకు దారితీయవచ్చు.
చుండ్రు సమస్య ఎక్కువైనప్పుడు, జుట్టు రాలడం కూడా పెరుగుతుంది. దీని వలన జుట్టు పెరుగుదల ప్రభావితమవుతుంది. చుండ్రు నివారణకు మార్కెట్లో ఎన్నో షాంపూలు లభిస్తాయి. అయితే, వాటిలో ఉన్న కెమికల్స్ కారణంగా, అవి జుట్టుకు మరింత నష్టం కలిగించే ప్రమాదం కూడా ఉంది. అందువల్ల, ఆయుర్వేదంలో డాండ్రఫ్ సమస్యకు కొన్ని సహజ, సురక్షితమైన పరిష్కారాలు అందుబాటులో ఉన్నాయి. వాటిలో ఒక హెయిర్ ప్యాక్ చిట్కా మీ కోసం.
వేప, పెరుగుని కలిపి ఒక హెయిర్ ప్యాక్ చేసుకొని జుట్టుపై అప్లై చేస్తే మంచి ఫలితాలు కనిపిస్తాయి. ఈ వేప, పెరుగు హెయిర్ ప్యాక్ ఎలా తయారు చేయాలో చూద్దాం..
తయారీ విధానం..
చేతినిండా వేపాకులు తీసుకొని వాటిని పేస్ట్‌లా మెత్తగా నూరండి. అందులో కప్పు పెరుగు, ఒక టీ స్పూన్ నిమ్మ రసం, 2 టీ స్పూన్లు అలో వేరా జెల్, 5 నుంచి 6 చుక్కల రోజ్ మేరీ ఆయిల్ వేసి బాగా కలపాలి. ఆ తరువాత ఈ మిశ్రమాన్ని జుట్టు కుదుళ్ల వరకు బాగా పట్టించండి. 30 నుంచి 40 నిమిషాలకు అలాగే ఉంచి.. ఆ తరువాత జుట్టుని గోరు వెచ్చిన నీరు, ఒక మైల్డ్ షాంపుతో కడిగేయండి. ఈ హెయిర్ ప్యాక్ ని వారంలో ఒకసారి జుట్టుకు పట్టించండి. దీని ప్రభావం వల్ల జుట్టు ఆరోగ్యంగా, బలంగా తయారవుతుంది.
Also Read: వేసవిలో చర్మం జిడ్డుగా ఉంటోందా?.. ఉదయాన్నే ఈ చిట్కాలు పాటించండి మెరిసిపోతారు
వేపాకు, పెరుగు హెయిర్ మాస్క్ వల్ల లాభాలు
ఈ హెయిర్ మాస్క్ తో చుండ్రు సమస్య తగ్గిపోతుంది. ఈ హెయిర్ మాస్క్ లోని యాంటి ఫంగల్, యాంటి బ్యాక్టీరియల్ గుణాలు చర్మంపై ఉన్న ఫంగల్ ఇన్‌ఫెక్షన్ తగ్గిస్తుంది. మళ్లీ రాకుండా నివారిస్తుంది.
జుట్టులో తేమని కాపాడుతుంది. పెరుగు, వేపాకు హెయిర్ మాస్క్ జుట్టుకు పట్టించడం వల్ల జుట్టు పూర్తిగా ఆరిపోకుండా.. అందులోని తేమను కట్టడి చేస్తుంది. ఇందులోని ఆలోవేరా జెల్, రోజ్ మేరీ ఆయిల్ జుట్టుని ప్రాకృతికంగా హైడ్రేట్ చేస్తాయి.
జుట్టు, కుదుళ్లకు పోషణ అందిస్తుంది. వేప, పెరుగు హెయిర్ మాస్క్ తల చర్మం కుదుళ్లను బాగా శుద్ది చేసి మంచి పోషణ ఇస్తుంది.
జుట్టు రాలే సమస్య ఉన్నవారికి ఈ హెయిర్ మాస్క్‌లోని పోషక తత్వాలు జుట్టుని ఆరోగ్యవంతంగా తయారు చేసి జుట్టు బాగా పెరింగేందుకు దోహద పడుతుంది. జుట్టుని మృదువుగా మెరిసే పోయే విధంగా తయారు చేస్తుంది.
హెచ్చరిక: నిమ్మ, పెరుగు హెయిర్ మాస్క్ ఉపయోగించే ముందు చర్మ అలర్జీ ఉంటే వారు ముందుగా చిన్న ప్యాచ్ టెస్ట్ చేయాలి. చర్మ ఇన్‌ఫెక్షన్ తీవ్రంగా ఉన్నవారు చర్మ వైద్య నిపుణులను సంప్రదించడం అవసరం.