Amaravati News: కల్తీ మద్యం వ్యవహారంపై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. ఎవడు.. ఎక్కడ.. తప్పుచేసినా శిక్ష తప్పదన్నారు. దోషి ఎక్కడున్నా, ఏ పార్టీ వాడైనా సరే యాక్షన్ తీసుకోవాల్సిందేనని అన్నారు. రాష్ట్రంలో ఎవరు చనిపోయినా కల్తీ మద్యం వల్లే చనిపోయారని దుష్ప్రచారం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసు వ్యవస్థ అప్రమత్తంగా ఉంటేనే ఇలాంటి వారి ఆటలు సాగవు తేల్చిచెప్పారు.
కల్తీ మద్యంపై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
ఆడబిడ్డలపై అఘాయిత్యం చేస్తే ఎంతటి వాడైనా చివరి రోజు కావాలన్నారు. లా అండ్ అర్డర్ కంటే ఏదీ ముఖ్యం కాదని, పోలీసులకు పూర్తి స్వేచ్ఛ ఇచ్చామన్నారు. ప్రభుత్వానికి, ప్రజలకు అండగా ఉండే పోలీసులకు మద్దతుగా ఉంటామన్నారు.
పోలీసు అమరవీరుల సంస్మరణ దినం సందర్భంగా మంగళవారం ఉదయం మంగళగిరిలోని 6వ బెటాలియన్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి సీఎం చంద్రబాబు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. పోలీసుల నుంచి గౌరవ వందనం స్వీకరించి, అమరులు వారు పుస్తకాన్ని ఆవిష్కరించారు సీఎం. ఈ సందర్భంగా మాట్లాడిన ముఖ్యమంత్రి, ఫ్యాక్షనిజం, నక్సలిజం, రౌడీయిజాన్ని అణచి వేయడంలో పోలీసులు మంచి పేరు ఉందన్నారు.
పెట్టుబడుల వెనుక నమ్మకం కీలకం
విశాఖ నగరానికి 15 బిలియన్ డాలర్ల గూగుల్ పెట్టుబడి వచ్చిందంటే అది ఓ నమ్మకం అని అన్నారు. రాష్ట్రంలో పెట్టే పెట్టుబడులకు భద్రత ఉంటుందనే విశ్వాసంతోనే ఇంత భారీ పెట్టుబడి వచ్చిందన్నారు. ప్రపంచానికే విశాఖ ఓ ఐటీ, ఏఐ హబ్‌గా తయారవుతుందని గుర్తు చేశారు.
పోలీసులు చేసిన త్యాగాలను గుర్తు చేశారు. పోలీసులంటే కఠినంగా ఉంటారని చాలామంది అనుకుంటారని, మానవత్వంతో వ్యవహరించేది వాళ్లేనని గుర్తు చేశారు. రీసెంట్‌గా విజయవాడలో పిల్లలు చెప్పులు లేకుండా వెళ్తుంటే.. పెనమలూరు హెడ్‌కానిస్టేబుల్ చెప్పులు కొనిచ్చిన విషయాన్ని వివరించారు.
ALSO READ: సీఎం చంద్రబాబు-జగన్ ఫ్యామిలీ దీపావళి సంబరాలు
నిత్యం విధి నిర్వహణ కారణంగా కుటుంబంతో సరిగా గడపలేని పరిస్థితి పోలీసులకు ఉందన్నారు. సమాజంలో అలజడులు ఉంటే పెట్టుబడులు రావని తేల్చి చెప్పేశారు. శాంతిభద్రతల విషయంలో రాజీపడకుండా పని చేస్తున్నామని, నేరరహిత సమాజం కోసం అందరూ పని చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. సాంకేతికంగా పోలీసు శాఖను బలోపేతం చేస్తున్నట్లు తెలియజేశారు.
ఇటీవలకాలంలో సైబర్ నేరాలు, వైట్ కాలర్ నేరాలు వివరీతంగా పెరిగాయని అన్నారు. సీసీ కెమెరాలు, డ్రోన్లు, గూగుల్ టేకౌట్‌లను విస్తృతంగా ఉపయోగించుకోవాలని సూచన చేశారు. పోలీసులకు సీసీ కెమెరాలు మూడో కన్నులా పని చేస్తాయని, ఏ తప్పు చేసినా ఆధారాలతో పట్టుకునే పరిస్థితి రావాలన్నారు.
ఈగల్-శక్తి బృందాల ఏర్పాటుతో రాష్ట్ర పోలీసు వ్యవస్థ ఆదర్శంగా నిలిచిందన్నారు. డ్రగ్స్, గంజాయి స్థావరాలను గుర్తించి ధ్వంసం చేస్తున్నట్లు చెప్పుకొచ్చారు. శాంతిభద్రతల విషయంలో ఎట్టి పరిస్థితుల్లో రాజీ పడవద్దని తేల్చిచెప్పారు. సైబర్ టెక్నాలజీతో క్రిమినల్స్ ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతున్నారని, వారి కంటే ముందు ఉండకపోతే నేరాలను కట్టడి చేయలేమన్నారు.
సమాజంలో అశాంతి సృష్టించడానికి రాజకీయ ముసుగులో కొత్త నేరాలు చేస్తున్నారని తెలిపారు. ఫేక్ ప్రచారాల ద్వారా కుల-మతాల మధ్య చిచ్చుపెట్టే ప్రయత్నం జరుగుతోందన్నారు. ప్రస్తుతం పోలీసులకు సోషల్ మీడియా పెద్ద ఛాలెంజ్‌గా మారిందన్నారు. వ్యక్తిత్వ హననానికి పాల్పడుతున్నారని, వీటివల్ల ఎంతో మంది ఇబ్బందిపడుతున్నారని వివరించారు.
పోలీసులకు పూర్తి స్వేచ్ఛ ఉందని, నేరస్థులపై కఠినంగా వ్యవహరించాలన్నారు. పోలీసులకు బీమా కల్పించి అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నట్లు తెలిపారు. హోంగార్డులకు హెల్త్ ఇన్సూరెన్స్ ఇస్తామని, పోలీసులకు డీఏలతో పాటు సరెండర్ సెలవులు ఇస్తున్నట్లు తెలియజేశారు. 2047 నాటికి దేశంలో ఏపీ నంబర్ 1గా ఉండాలండే అన్ని రకాల భద్రత ఉంటేనే ఇది సాధ్యమవుతుందని అన్నారు.
కల్తీ మద్యంపై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు..
ఎవడు ఎక్కడ తప్పుచేసినా, దోషి ఎక్కడున్నా, ఏ పార్టీ వాడైనా సరే యాక్షన్ తీసుకోవాలని స్పష్టంగా చెప్పాను
రాష్ట్రంలో ఎవరు చనిపోయినా కల్తీ మద్యం వల్లే చనిపోయారని దుష్ప్రచారం చేశారు
పోలీసు వ్యవస్థ అప్రమత్తంగా ఉంటేనే ఇలాంటి వారి ఆటలు సాగవు… pic.twitter.com/jUEekmEQPJ
— BIG TV Breaking News (@bigtvtelugu) October 21, 2025