Karthika Deepam: ప్రముఖ తెలుగు ఛానల్ స్టార్ మా లో సక్సెస్ఫుల్ టాక్ తో ప్రసారమవుతున్న సీరియల్స్లలో ముందుగా వినిపించేది కార్తీకదీపం.. గతంలో ప్రసారమైన ఈ సీరియల్ మంచి రెస్పాన్స్ని అందుకుంది. అభిమానుల డిమాండ్ మేరకు ఈ సీరియల్ను సీజన్ 2 గా మళ్లీ ప్రసారం చేస్తున్నారు. అయితే గతంలో వచ్చిన మొదటి పార్ట్ కన్నా రెండో పార్ట్ పై విమర్శలు సోషల్ మీడియాలో ఎక్కువగా వినిపిస్తున్నాయి. అందుకు ఉదాహరణలు చాలానే ఉన్నాయి. కార్తీక్ తో వంటలక్క పెళ్లి జరిగినప్పుడు వేసిన మేకప్ పై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ జరిగిన విషయం తెలిసిందే. ఇప్పుడు మరోసారి వంటలక్క మేకప్ విషయంపై నెట్టింట హాట్ టాపిక్ గా మారింది. ఇది కార్తీకదీపం సీరియల్ టీం కి పెద్ద షాక్ అనే చెప్పాలి. అసలు మ్యాటర్ ఏంటో వివరంగా తెలుసుకుందాం..
తెలుగు సీరియల్స్లలో వేరే భాషల ముద్దుగుమ్మలు హీరోయిన్గా నటిస్తున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం స్టార్ మా లో ప్రసారమవుతున్న టాప్ టెన్ సీరియల్స్లలో హీరోయిన్లు వేరే రాష్ట్రాల వాళ్ళే.. కార్తీకదీపం సీరియల్ లో కూడా వంటలక్క పాత్రలో నటిస్తున్న దీప కేరళకు చెందిన నటి.. ఈమె మలయాళం లో ఎన్నో సీరియల్స్లలో నటించి ఫేమస్ అయ్యింది. సీరియల్ ద్వారా తెలుగులోకి అడుగుపెట్టి ఇక్కడ ప్రేక్షకుల అభిమానాన్ని పొందింది. ఈమె అసలు పేరు ప్రేమి విశ్వనాథ్.. ఈమధ్య ఈమె గురించి సోషల్ మీడియాలో రోజుకో వార్త బయటకు వస్తుంది. తాజాగా ఆమె నెట్టింట గ్లామర్ మెరుపులు మెరిపిస్తుంది.. మొన్న వైట్ షర్ట్ లో ఉన్న హాట్ లుక్ ఫోటోలను షేర్ చేసింది. అవి చూసిన అభిమానులు కార్తీక దీపం టీమ్ ను ట్యాగ్ చేస్తూ కామెంట్స్ చేస్తుండటంతో ఇది హాట్ టాపిక్ గా మారింది.
Also Read:‘బ్రహ్మముడి ‘ అప్పు రియల్ లైఫ్ లో అన్నీ కష్టాలే.. కన్నీళ్లు ఆగవు..!
కార్తీకదీపం 2 సీరియల్ లో ప్రస్తుతం కార్తీక్ కు, వంటలక్క కు మరోసారి పెళ్లి చేయబోతారు కుటుంబ సభ్యులు.. ఇందులో దీపకు పెళ్లికూతురు లాగా ముస్తాబు చేస్తారు.. మొదటగా వీరిద్దరికీ పెళ్లి జరిగింది. కొన్ని కారణాలవల్ల ఈ సీరియల్లో మళ్లీ వీళ్ళిద్దరికీ పెళ్లి జరగుతుంది. అయితే ఆ పెళ్లిలో దీపకు వేసిన మేకప్ పెళ్లికూతురుకి సెట్ అవ్వలేదని ఆ మధ్య ట్రోల్స్ వినిపించాయి. ఇప్పుడు మళ్లీ ఇవే ట్రోల్స్ మేకప్ పై వినిపిస్తున్నాయి. పెళ్లికి ఎలాగో మార్చలేదు కనీసం శోభనానికైనా దీప మేకప్ ని మార్చండి అంటూ కార్తీకదీపం టీం కి నెటిజెన్లు కామెంట్లు చేస్తున్నారు. దీనిపై టీం ఎలా రియాక్ట్ అవుతుందో చూడాలి.. ప్రస్తుతం స్టార్ మా లో ప్రసారమవుతున్న టాప్ టెన్ సీరియల్స్లలో కార్తీకదీపం 2 మొదటి స్థానంలో ఉంది.. ప్రస్తుతం ప్రేమీ విశ్వనాథ్ ఈ సీరియల్ లో మాత్రమే నటిస్తున్నారు. అలాగే బుల్లితెరపై ప్రసారమవుతున్న పలు టీవీ కార్యక్రమాలలో పాల్గొంటూ తెలుగు ప్రేక్షకులను అలరిస్తున్నారు..