BigTV English

Summer Oily Skin: వేసవిలో చర్మం జిడ్డుగా ఉంటోందా?.. ఉదయాన్నే ఈ చిట్కాలు పాటించండి మెరిసిపోతారు

Summer Oily Skin: వేసవిలో చర్మం జిడ్డుగా ఉంటోందా?.. ఉదయాన్నే ఈ చిట్కాలు పాటించండి మెరిసిపోతారు

Summer Oily Skin Solution| వేసవి రాగానే వాతావరణం వేడెక్కుతుంది. దోంత చర్మం కాంతి కోల్పోవడం. జిడ్డుగా ఉండడం ప్రారంభమవుతుంది. చర్మం నుంచి ఎండాకాలంలో ఎక్కువగా చెమట, సెబం వస్తూ ఉంటుంది. అయితే చర్మ పొరలు మరీ ఎక్కువగా ఓపెన్ కావడంతో వేసవిలో చర్మం పై భాగం జిడ్డుగా అనిపిస్తుంది. ఇలాంటి సమయంలో అందరూ తరుచూ ముఖాన్ని కడుగుతుంటారు. కొంత ఆ సమస్య తగ్గినా ఆ జిడ్డు పూర్తిగా తొలగిపోదు.


ఆ తరువాత క్రమంగా ఈ సిబం చర్మం రంధ్రాల్లో పేరుకుపోతూ ఉంటుంది. దీని వల్ల స్కిన్ ఇన్‌ఫెక్షన్స్, మొటిమలు, ఇతర చర్మ సమస్యలు రావచ్చు. దీనికి అదనంగా దుమ్ము, ధూళి, లేదా మేకప్ వేసుకుంటే అదంతా ఆ చర్మపొరల్లో పేరుకుపోయి వాటిని బ్లాక్ చేస్తాయి. దీని వల్ల చర్మ సమస్యలు తీవ్రమవుతాయి. ఫలితంగా చర్మం నల్లబడి పోయి, పేలవంగా కనిపిస్తుంది. ఈ సమస్యకు పరిష్కారం ఉదయాన్నే చర్మ సంరక్షణ కోసం కొన్ని టిప్స్ పాటించడం. ఆయిలీ స్కీన్ అంటే జిడ్డు చర్మం ఉన్నవారు ఇవి తప్పనిసరిగా పాటించాలి లేకపోతే సమస్య తీవ్రమై అందవిహీనంగా తయారవుతారు.

వేసవిలో జిడ్డు చర్మం ఉన్నవారు ఇవి పాటించండి.

1. ముఖాన్ని పాలతో కడగాలి. అవును పాలు వేడి చేయకుండా పచ్చిగా ఉన్నవాటినే తీసుకొని ముఖంపై పూసి డీప్ క్లీనింగ్ చేయండి. దీనివల్ల చర్మం ఎక్స్‌ఫోలియేట్ అవుతుంది. పైగా చర్మ రంధ్రాలు కూడా క్లీన్ అవుతాయి. ముఖంపై స్కిన ఇన్‌ఫెక్షన్ ప్రమాదం కూడా తగ్గుతుంది. పాలలో కాస్త ఉప్పు వేసుకొని ముఖానికి మసాజ్ చేసుకుంటే ఇంకా మంచిది. అలా 20 నుంచి 30 నిమిషాలు పాలతో మసాజ్ చేసుకున్న తరువాత వేడి (గోరు వెచ్చని) నీటితో ముఖం కడిగేసేయండి.


2. తేనెతో ముఖాన్ని మసాజ్ చేయండి. ముఖ చర్మంపై మొటిమలుండడానికి ముఖ్య కారణం ఆయిలీ స్కిన్. దీని వల్ల ముఖమంతా జిడ్డుగా ఉంటుంది. అందుకే తేనెతో ముఖాన్ని మసాజ్ చేసుకోవాలి. తేనెలో యాంటి సెప్టిక్, యాంటి బ్యాక్టీరియల్ గుణాలు మొటిమలు, ఇతర ఇన్‌ఫెక్షన్ల నుంచి ఉపశమనం కలిగిస్తాయి. తేనెతో మసాజ్ చేసుకున్న 20 నిమిసాల తరువాత గోరు వెచ్చని లేదా చల్లని నీటితో ముఖం కడిగేసుకోండి.

3.దోసెకాయ లేదా కీరతో కూడా ఆయిలీ స్కీన్ సమస్యకు పరిష్కరం లభిస్తుంది. కీర అంటే కుకుంబర్ ని పేస్ట్ లా చేసుకొని ముఖ్యంపై అప్లై చేయండి.. 20 నిమిషాల తరువాత ముఖాన్ని కడిగేయండి.

4.పెరుగుతో ముఖం ఎక్స్‌ఫోలియేషన్. అవును పెరుగు కూడా జిడ్డు చర్మ సమస్యకు ఓ పరిష్కారం. పెరుగలోని పోషకతత్వాలు చర్మానికి నిగారింపునిస్తాయి. అంతేకాదు దీన్ని ముఖంపై రాసుకుంటే చర్మాన్ని బాగా క్లీన్ చేసేస్తుంది. అందుకే పెరుగుని ప్రకృతి సిద్ధమైన ఎక్స్ ఫోలియేటర్ గా పేర్కొంటారు. ఇది ముఖ చర్మంపై పేరుకుపోయిన డెడ్ సెల్స్ ని కూడా తొలగించి మంచి నిగారింపునిస్తుంది.

Also Read: వేసవిలో మెరిసే చర్మం మీ సొంతం.. ఈ ఫ్రూట్స్ ప్రతిరోజు తింటే

5.టొమాటో పల్ప్‌తో ముఖానికి మసాజ్ చేయండి. టొమాటోలో పోషకాలు చర్మ ఇన్‌ఫెక్షన్లను తగ్గించి ముఖం కాంతివంతంగా మెరిసేందుకు తోడ్పడుతుంది. చర్మం నుంచి జిడ్డు తగ్గిస్తుంది.

గమనిక: పై తెలిపిన వివరాలన్నీ సాధారణ సమాచారం మాత్రమే. ఔషధాలకు ఎటువంటి ప్రత్యామ్నాయం కాదు. సమస్య తీవ్రంగా ఉంటే వైద్య నిపుణులను తప్పక సంప్రదించాలి.

Related News

Raksha Bandhan Wishes 2025: రాఖీ పండగ సందర్భంగా.. మీ తోబుట్టువులకు శుభాకాంక్షలు చెప్పండిలా !

Tan Removal Tips: ముఖం నల్లగా మారిందా ? ఇలా చేస్తే.. క్షణాల్లోనే గ్లోయింగ్ స్కిన్

Cinnamon water: ఖాళీ కడుపుతో దాల్చిన చెక్క నీరు తాగితే.. మతిపోయే లాభాలు !

Junk Food: పిజ్జా, బర్గర్‌లు తెగ తినేస్తున్నారా ? జాగ్రత్త !

Health Tips: ఒమేగా- 3 ఫ్యాటీ యాసిడ్స్‌తో చర్మం, జుట్టుకు బోలెడు లాభాలు !

Broccoli Benefits: బ్రోకలీ తింటున్నారా ? అయితే ఈ విషయాలు తెలుసుకోండి

Big Stories

×