Banana Peel For Skin: చాలా మంది అరటిపండు తిన్న తర్వాత తొక్కను చెత్త బుట్టలో వేస్తారు. మరి ఏం చేయాలి అనుకుంటాన్నారా ? మీరు తెలుసుకోవాల్సిన ముఖ్యమైన విషయాలు ఏంటంటే.. అరటి తొక్కలో యాంటీఆక్సిడెంట్లతో సమృద్ధిగా ఉంటాయి. వీటిని మీరు మీ చర్మ కాంతిని పెంచడానికి, వృద్ధాప్యాన్ని తగ్గించడానికి ఉపయోగించవచ్చు . అంతే కాకుండా వీటిని ఉపయోగించడం వల్ల మీ చర్మంపై రక్త ప్రసరణ మెరుగుపడుతుంది. అంతే కాకుండా నల్ల మచ్చలను వదిలించుకోవడానికి కూడా ఇవి మీకు సహాయపడతాయి. గ్లోయింగ్ స్కిన్ కోసం మీరు అరటి తొక్కలను ఎలా ఉపయోగించాలో ఇప్పుడు తెలుసుకుందాం.
ముఖంపై మచ్చలు:
మీరు అరటి తొక్క లోపలి భాగాన్ని మీ ముఖం మీద రుద్దడం వల్ల అనేక ప్రయోజనాలు ఉంటాయి. ఇది మీ చర్మంపై ఉన్న రంధ్రాలను తెరుచుకునేకలా చేస్తుంది. అంతే కాకుండా చర్మ రంధ్రాలు ఆక్సిజన్‌ను అందుకున్నప్పుడు చర్మం కాంతి వంతగా మారుతుంది. అంతే కాకుండా ఇది మచ్చలు తగ్గడానికి సహాయపడుతుంది. అరటి తొక్కను దాదాపు 10 నిమిషాల పాటు సున్నితంగా ముఖానికి మసాజ్ చేసిన తర్వాత మీరు మీ ముఖాన్ని నీటితో కడుక్కోవచ్చు. ఇలా చేయడం ద్వారా మీ ముఖం మీద పేరుకుపోయిన మృత చర్మాన్ని తొలగించుకోవచ్చు.
మొటిమలు:
మొటిమలతో మీరు ఇబ్బంది పడుతుంటే, లేదా బ్లాక్ హెడ్స్ తో బాధ పడుతుంటే మాత్రం మీరు అరటి తొక్కను ఉపయోగించవచ్చు . వీటిని ఉపయోగం మీకు చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. దీని కోసం అరటిపండు తొక్కను మెత్తగా చేసి, దానికి సరిపడా పెరుగు ,రోజ్ వాటర్ కలపండి. తర్వాత మీరు దీన్ని మీ ముఖం మీద ఫేస్ ప్యాక్ లాగా ఉపయోగించవచ్చు. 15 నిమిషాల తర్వాత వాష్ చేయండి. ఇది మొటిమలు వదిలించడానికి మాత్రమే కాదు. మీ చర్మాన్ని బిగుతుగా ,ప్రకాశవంతంగా మారుస్తుంది.
ముడతలు మాయమవుతాయి:
వయసు పెరిగే కొద్దీ ముఖంపై ముడతలు రావడం సహజం. అటువంటి పరిస్థితిలో చాలా రకాల స్కిన్ కేర్ ప్రొడక్ట్స్ ఉపయోగిస్తారు. కానీ ఎటువంటి ప్రయోజనం లభించదు. ఇలాంటి సమయంలోనే మీరు అరటి తొక్కను వాడటం వల్ల మంచి ఫలితం ఉంటుంది. అరటి తొక్క లోపలి భాగాన్ని మీ ముఖం మీద కొన్ని నిమిషాలు రుద్దండి. తర్వాత రోజ్ వాటర్ రాయండి. 15 నిమిషాల తర్వాత మీ ముఖాన్ని శుభ్రం చేయండి.
డార్క్ సర్కిల్స్ :
మీరు డార్క్ సర్కిల్స్ సమస్యతో ఇబ్బంది పడుతుంటే అరటి తొక్కను వాడండి. అరటిపండు తిన్న తర్వాత దాని తొక్కను పారవేయకండి. అరటి తొక్కను పేస్ట్ లాగా చేసి అందులో ఒక చెంచా కలబంద జెల్ వేసి మిక్స్ చేయండి. ఇప్పుడు ఈ పేస్ట్ ని కళ్ళ చుట్టూ అప్లై చేయండి. పది నిమిషాల తర్వాత చల్లటి నీటితో ముఖం శుభ్రం చేయండి . ఈ పేస్ట్‌ను వారానికి మూడు రోజులు అప్లై చేయడం వల్ల కళ్ళ కింద నల్లటి వలయాలు మాయమవుతాయి.
Also Read: ఈ నేచురల్ హెయిర్ కలర్‌తో.. క్షణాల్లోనే తెల్ల జుట్టు నల్లగా మారడం ఖాయం
జిడ్డు చర్మం:
మీ చర్మం జిడ్డుగా ఉంటే అరటి తొక్కను వాడండి. అరటి తొక్క ముఖంపై ఉన్న లోపలి పొరను తీసి దానికి ఒక టీ స్పూన్ తేనె , నిమ్మరసం కలపండి. ఈ పేస్ట్ ని ముఖం మీద స్క్రబ్ లాగా రుద్దండి. ఇలా చేయడం వల్ల ముఖంపై ఉన్న జిడ్డు తొలగిపోతుంది. అంతే కాకుండా గ్లోయింగ్ స్కిన్ మీ సొంతం అవుతుంది.