BigTV English

UP Crime News: యూపీలో దారుణం.. కోడలికి హెచ్ఐవీ సోకేలా అత్తమామల స్కెచ్

UP Crime News:  యూపీలో దారుణం.. కోడలికి హెచ్ఐవీ సోకేలా అత్తమామల స్కెచ్

UP Crime News: ప్రస్తుతం అమ్మాయిల కొరత వెంటాడుతోంది. అమ్మాయిలు దొరక్క పెళ్లికాని ప్రసాద్‌ల సంఖ్య పెరుగుతోంది. దాదాపు నాలుగు పదుల వయస్సు వచ్చినా పెళ్లి కాని పరిస్థితి చాలామందిలో ఉంది. దేశంలో చాలా కులాల్లో ఇదే పరిస్థితి నెలకొంది. ఫలితంగా ప్రసాద్‌ల సంఖ్య క్రమంగా రెట్టింపు అవుతోంది. కానీ, యూపీలో రూటే సెపరేటు. అదనపు కట్నం కోడలు తేలేదని హెచ్ఐవీ సోకేలా చేశారు అత్తమామలు. అసలేం జరిగింది అన్న డీటేల్స్ లోకి ఒక్కసారి వెళ్దాం.


యూపీలో ఘోరం

బాధితురాలి పేరెంట్స్ కథనం ప్రకారం.. ఉత్తరప్రదేశ్ కు చెందిన ఓ యువతికి.. ఉత్తరాఖండ్‌లోని హరిద్వార్‌కు చెందిన అభిషేక్ అలియాస్ సచిన్‌తో వివాహం జరిగింది. సరిగ్గా రెండేళ్ల కిందట వాలంటైన్ డే మరసటి రోజు పెళ్లి జరిగింది. మ్యారేజ్ సందర్భంగా అల్లుడికి అత్తమామలు కట్నకానుకల కింద చాలానే ఇచ్చారు. వరుడికి 15 లక్షల కట్నంతోపాటు ఓ కారు కూడా ఇచ్చారు. ఉన్న కుటుంబం కావడంతో పెళ్లయిన కొత్తలో కొడలు పిల్లను అత్తమామలు బాగానే చూసుకునేవారు.


పెళ్లి సమయంలో కోడలు ఆస్తుల గురించి ఆరా తీసింది అత్తింటి కుటుంబం. పెళ్లిలో ఈ విధంగా ఇచ్చారంటే.. ఆ తర్వాత మరింతగా వస్తుందని ఆశపడ్డారు యువతి అత్తమామలు. ఏడాది తర్వాత భార్యభర్తల మధ్య చిన్న చిన్న కలతలు మొదలయ్యాయి. ఇలాంటి సహజమేనని కోడలు ఓపిక పట్టింది. ఈ సమస్య మరింత జఠిలమైంది. అదనపు కట్నం తేవాలని అత్తమామల నుంచి ఒత్తిళ్లు పెరిగాయి.

కారుతోపాటు అదనంగా కట్నం తేవాలని డిమాండ్ చేశారు. అందుకు లొంగకపోవడవంతో తమ కొడుక్కి రెండో పెళ్లి చేయాలని స్కెచ్ వేశారు. ఈ క్రమంలో కోడలు అత్తింటిలో జరుగుతున్న దురాగతాలను పేరెంట్స్ కు వివరించేది. చివరకు కోడల్ని ఇంటి నుంచి పంపాలని నిర్ణయానికి వచ్చేశారు.

ALSO READ: విశాఖ నాగేంద్రబాబు కేసులో కొత్త కోణం, ఫోన్‌లో ఏకాంత వీడియోలు, ఆపై అరెస్ట్

అదనపు కట్నం కోసం

ఈ వ్యవహారం హరిద్వార్ ప్రాంతంలో ఓ పంచాయితీకి వచ్చింది. చివరకు పెద్దలు జోక్యం చేసుకున్నారు. యువతికి నచ్చజెప్పి తిరిగి అత్తింటి పంపారు. అయినా కట్నం పిశాచులు ఏ మాత్రం కోడల్ని వదల్లేదు. మానసికంగా, శారీరంగా వేధించడం మొదలుపెట్టారు. అత్తింటివారు పెడుతున్న కష్టాలను ఓపిగ్గా భరించింది కూడా. చివరకు కోడల్ని చంపాలనే స్కెచ్ వేశారు. ఈ నేపథ్యంలో హెచ్ఐవీ వైరస్‌ను కోడలు శరీరంలోకి పంపించారు.

కోడలు శరీరంలోకి వెళ్లిన హెచ్ఐవీ వైరస్ కారణంగా ఆమె ఆరోగ్యం క్షీణించింది. చివరకు ఆసుపత్రికి తీసుకెళ్లగా ఆమెకు హెచ్ఐవీ సోకిందని నిర్ధారణ అయ్యింది. దీంతో యువతి పేరెంట్స్ షాకయ్యారు. అసలేం జరిగిందనే దానిపై తొలుత అల్లుడి అభిషేక్ సచిన్‌కు పరీక్షలు చేయించారు. అందులో నెగిటివ్ వచ్చింది. చివరకు అల్లుడు తల్లిదండ్రులపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే అభిషేక్ ఫ్యామిలీపై ఎలాంటి చర్యలు తీసుకోలేదు.

చివరకు బాధితురాలు స్థానిక న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. కోర్టు ఆదేశాల మేరకు అభిషేక్, అతడి తల్లిదండ్రులు, ఇందులో పంచుకున్న మరికొందరిపై వరకట్న వేధింపులు, దాడి, హత్యాయత్నం సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు మొదలుపెట్టారు పోలీసులు. మరి పోలీసుల విచారణలో ఇంకెన్ని విషయాలు వెలుగులోకి వస్తాయో చూడాలి.

Related News

Shamli News: భర్త వద్దన్నాడు.. అయినా భార్య వినలేదు, చివరకు ఏం జరిగిందంటే

Hyderabad incident: టిఫిన్ బాక్స్‌తో చిన్నారిపై టీచర్ దాడి.. తలకు 3 కుట్లు పడేలా కొట్టడమేంటి?

New Bride Incident: ఫ్రెండ్సే చంపేశారా? నవ వధువు కేసులో బిగ్ ట్విస్ట్!

Tamilnadu Crime: రాజకీయ నేత ఫామ్‌హౌస్.. ఎస్ఐని చంపేశారు, ఏం జరిగింది?

Karimnagar Crime: యూట్యూబ్ చూసి డైరెక్షన్ ఇచ్చింది.. పనంతా ప్రియుడు చేశాడు, చివరకు ఏమైంది?

Serial killer: అతడి ఇల్లంతా రక్తం.. ఎముకల గుట్ట.. కేరళలో ఒళ్లు గగూర్పాటు కలిగించే ఘటన!

Big Stories

×