Hair Colour: తెల్ల జుట్టు సమస్యతో ఇబ్బంది పడే వారి సంఖ్య రోజు రోజుకు పెరుగుతోంది. ఈ సమస్య నుండి బయట పడటానికి చాలా మంది బయట మార్కెట్‌లో దొరికే హెయిర్ కలర్స్ వాడుతుంటారు. వీటి తయారీలో రసాయనాలను ఎక్కువగా ఉపయోగిస్తే అది జుట్టు రాలడం, దురద వంటి అనేక జుట్టు సమస్యలను కలిగిస్తుంది. అంతే కాకుండా ఇది మీ ఆరోగ్యానికి కూడా హాని కలిగిస్తుంది. అందుకే నేచురల్ హెయిర్ కలర్స్ వాడటం అలవాటు చేసుకోవాలి. ఇంట్లోనే మనం హెయిర్ కలర్ తయారు చేసుకుని వాడటం వల్ల తెల్ల జుట్టు నల్లగా మారుతుంది. అంతే కాకుండా జుట్టు రాలే సమస్యలు కూడా తగ్గుతాయి.
నేచురల్ హెయిర్ కలర్:
కావాల్సినవి:
దానిమ్మ తొక్కలు- 5 – 6
బ్రూ కాఫీ – చిన్న ప్యాకెట్
కాటేచు పౌడర్- ఒక టీస్పూన్
ఉసిరి పౌడర్- ఒక టీస్పూన్
నేచురల్ హెన్నా పౌడర్- 5 టేబుల్ స్పూన్లు
నీరు- తగినంత
ఇంట్లోనే హెయిర్ డై తయారు చేసుకోవడం ఎలా ?
ఇంట్లోనే సహజమైన హెయిర్ డై తయారు చేసుకోవడానికి, ముందుగా ఒక పాన్ తీసుకోండి. అందులో ఒక గ్లాసు నీళ్లు పోసి వేడి చేయండి. దీని తరువాత పైన తెలిపిన మోతాదులో దానిమ్మ తొక్క, కాటేచు పొడి, ఆమ్లా పొడి, బ్రూ కాఫీ కలపండి. ఈ పదార్థాలన్నింటినీ 15 నిమిషాలు బాగా ఉడికించాలి. తర్వాత గ్యాస్ ఆపివేసి, రాత్రంతా మూతపెట్టి ఉంచండి.
మరుసటి రోజు ఉదయం ఈ మిశ్రమాన్ని వడకట్టండి . ఇప్పుడు ఒక ఇనుప పాన్ లో హెన్నా పౌడర్ వేసి, పైన పేర్కొన్న మిశ్రమాన్ని అందులో వేసి బాగా కలపండి.
దీని తరువాత ఈ మిశ్రమాన్ని పాన్‌లో 6 గంటలు అలాగే ఉంచండి. తర్వాత దానిని జుట్టుకు అప్లై చేసి 2 గంటలు ఆరనివ్వండి. తర్వాత మీ జుట్టును వాష్ చేయండి. ఇలా చేయడం వల్ల హెయిర్ కలర్ వాడుతుంది.
హెర్బల్ హెయిర్ కలర్ :
హెర్బల్ హెయిర్ కలర్స్ కూడా మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. సాధారణంగా ఇవి చాలా ఖరీదైనవి. అందుకే మీరు ఇంట్లో కూడా హెర్బల్ హెయిర్ కలర్ తయారు చేసుకోవచ్చు. ఇది జుట్టు నల్లగా మారేలా చేస్తుంది. అంతే కాకుండా ఇది 100 శాతం రసాయన రహితమైనది . పూర్తిగా సహజమైనది. ఇందులో హెన్నా, ఇండిగో , కాటేచు వంటి సహజ రంగులు ఉంటాయి. వీటిలో ఉండే పోషకాలు జుట్టుకు మేలు చేస్తాయి.
తెల్ల జుట్టును తగ్గించడానికి ఉసిరి పౌడర్ ఆమ్లా ఉత్తమమైంది. ప్రతిరోజూ ఒక గ్లాసు నీటిలో ఒక ఉసిరి రసం కలిపి తాగడం వల్ల తెల్ల జుట్టును నియంత్రించడంలో సహాయపడుతుంది. ఉసిరి పౌడర్ నీటితో కరిగించి త్రాగాలి.
Also Read: మొటిమలు వేధిస్తున్నాయా ? ఈ ఫేస్ ప్యాక్స్ ట్రై చేయండి
హెన్నా తెల్ల జుట్టుకు ఎరుపు రంగును ఇచ్చినప్పటికీ అది నల్ల జుట్టుకు రంగును ఇవ్వదు. హెన్నాతో మీ జుట్టుకు రంగు వేయాలనుకుంటే మాత్రం 3-4 ఉసిరి కాయలను నీటిలో నానట్టండి. తర్వాత మరుసటి రోజు ఉదయం ఉసిరికాయను నీటి నుండి తీసివేయండి. తర్వాత వీటిని పేస్ట్ చేయండి. ఉసిరి పేస్ట్‌ను హెన్నా పౌడర్, 4 టీస్పూన్ల నిమ్మరసం , కాస్త కాఫీ పౌడర్, 2 టీస్పూన్ల ఆయిల్ నీటితో కలపండి. ఈ పేస్ట్ ను రెండు నుండి మూడు గంటలు పక్కన పెట్టి, ఆపై జుట్టు అంతా అప్లై చేయండి. కనీసం రెండు గంటలు అలాగే ఉంచి సాధారణ నీటితో శుభ్రం చేసుకోండి.