ICC Champions Trophy: చాంపియన్స్ ట్రోఫీ 2025 టోర్నమెంట్ ( ICC Champions Trophy 2025) మరో మూడు రోజుల్లోనే ప్రారంభం కానుంది. ఫిబ్రవరి 19 వ తేదీ నుంచి మార్చి 9వ తేదీ వరకు ఈ మెగా చాంపియన్స్ ట్రోఫీ 2025 టోర్నమెంట్ నిర్వహించనున్నారు. ఈ టోర్నమెంట్ నేపథ్యంలో ఇప్పటికే అన్ని ఏర్పాట్లు జరిగాయి. చాంపియన్స్ ట్రోఫీ 2025 టోర్నమెంట్… హైబ్రిడ్ మోడల్ లో నిర్వహిస్తున్నారు. కాబట్టి.. టీమిండియా ( Team India ) ఆడే మ్యాచ్ లన్ని దుబాయ్ లో ( Dubai) జరుగుతాయి. మిగతా మ్యాచ్ లన్ని పాకిస్తాన్ లో ( Pakisthan ) నిర్వహించనున్నారు.
Also Read: Telugu Warriors: పప్పులో కాలేసిన అయ్యగారు..12 మంది ప్లేయర్లతో ఆడించాడు..!
ఇందులో భాగంగానే పాకిస్తాన్ దేశంలో గడాఫీ, లాహూర్ లాంటి స్టేడియాలను రెడీ చేశారు. అయితే.. దాదాపు 8 సంవత్సరాల తర్వాత.. ఛాంపియన్ ట్రోఫీ 2025 టోర్నమెంట్ జరుగుతోంది. వాస్తవానికి ఈ టోర్నమెంట్ రెండూ లేదా మూడు సంవత్సరాల కు ఒకసారి జరగాలి. కానీ ఇన్ని రోజుల గ్యాప్ ఎందుకు వచ్చిందనే ప్రశ్న అందరిలోనూ మెదులుతోంది. చివరి సారిగా 2017 సంవత్సరంలో.. ఛాంపియన్స్ ట్రోఫీ జరిగింది. ఆ తర్వాత టోర్నమెంట్ నిర్వహించలేదు. 1998 సంవత్సరంలో…. ఛాంపియన్ ట్రోఫీ ప్రారంభమైంది. వరల్డ్ కప్ ఉండగానే వన్డే.. ఫార్మాట్ ప్రాధాన్యత పెంచేందుకు అప్పట్లో ఈ ఛాంపియన్స్ ట్రోఫీ తీసుకువచ్చారు. అయితే ఈ టోర్నమెంట్ ప్రారంభం చేసినప్పుడు… రెండు సంవత్సరాలకు ఒకసారి నిర్వహించాలని అనుకున్నారు. అలా 2002…. సంవత్సరం నాటికి చాంపియన్స్ ట్రోఫీగా దీనికి నామకరణం కూడా చేశారు.
ఐసీసీ ( ICC ) నాకౌట్ ట్రోఫీగా కూడా దీన్ని పిలుస్తారు. ఇప్పటి వరకు ఈ ఛాంపియన్ ట్రోఫీలో రెండుసార్లు ఇండియా ఛాంపియన్ గా నిలిచింది. పాకిస్తాన్ 2017 సంవత్సరం ఎడిషన్ లో.. చివరిసారిగా గెలిచి ఛాంపియన్ గా నిలిచింది. అప్పుడు టీమిండియా పైన గెలిచి విజయం సాధించింది. ఇక టీమ్ ఇండియాకు మహేంద్ర సింగ్ ధోని ( MS DHONI) సారథ్యంలో ఒకసారి కప్ వచ్చింది. అయితే 2006 సంవత్సరం నుంచి రెండు సంవత్సరాల వరకు ఒకసారి నిర్వహించాల్సిన ఈ టోర్నమెంటు మూడు ఆ తర్వాత నాలుగేళ్లకు ఒకసారి మారిపోయింది. ఇక 2017 సంవత్సరం తర్వాత… 2019 వన్డే ప్రపంచ కప్ కారణంగా దీన్ని వాయిదా వేశారు. అనంతరం కరోనా మహమ్మారి వచ్చింది. ఆ తర్వాత.. ఇండియన్ ప్రీమియర్ లీగ్ టోర్నమెంటు లాంటివి… విపరీతంగా పెరిగిపోయాయి.
ఆటగాళ్లంతా బిజీ అవుతున్నారు. దీంతో చాంపియన్ ట్రోఫీని ఐసిసి కూడా పక్కకు పెట్టింది. కానీ ఇప్పుడు మళ్లీ వన్డే క్రికెట్ కు ప్రాధాన్యత తీసుకువచ్చేందుకు… తెరపైకి తీసుకువచ్చారు. దీంతో 2017 తర్వాత ఇప్పుడు అంటే 8 సంవత్సరాల తర్వాత చాంపియన్స్ ట్రోఫీ2025 టోర్నమెంట్ జరుగుతుంది. ఇక ఈ టోర్నమెంట్ లో భాగంగా… ఫిబ్రవరి 20 వ తేదీ నుంచే లీగ్ దశ మ్యాచ్ లు ఆడనుంది టీమిండియా. మొదటి మ్యాచ్ లో బంగ్లాతో ఆ తర్వాత్ పాకిస్థాన్ తో తలపడనుంది టీమిండియా.
Also Read: Shoaib Akhtar on Laxmipati Balaji: అక్తర్ ను నరకం చూపించిన బౌలర్..కోపంతో బ్యాట్లు కూడా విరగొట్టాడు ?