Belly Fat In Men: క్యాన్సర్‌పై ప్రతిరోజూ పరిశోధనలు జరుగుతున్నాయి. దీనికి సంబంధించిన అనేక కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఇటీవల క్యాన్సర్ పై జరిపిన ఒక అధ్యయనంలో పురుషుల నడుము వెడల్పు (మందం) క్యాన్సర్ ప్రమాదాన్ని పెంచుతుందని వెల్లడైంది. ఈ అధ్యయనం 3 లక్షలకు పైగా పురుషులపై నిర్వహించబడింది. బెల్లీ ఫ్యాట్ పురుషుల్లో క్యాన్సర్ ప్రమాదానికి సంకేతం అని వెల్లడైంది. ఈ అధ్యయనంలోని మరిన్ని విషయాలను గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
భారతదేశం తాజా నివేదిక:
భారత ప్రభుత్వం ఇటీవల నిర్వహించిన జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే ప్రకారం.. పురుషులలో దాదాపు 23% , స్త్రీలలో 24% మంది అధిక బరువుతో ఇబ్బంది పడుతున్నారు. దీని అర్థం భారతదేశం స్థూలకాయ సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. 2050 నాటికి 45 కోట్ల మంది ఊబకాయంతో బాధపడే అవకాశం ఉంది. అందుకే ప్రధాని నరేంద్ర మోడీ కూడా నిరంతరం ప్రజలకు స్థూలకాయంపై అవగాహన కల్పిస్తున్నారు.
ఇదిలా ఉంటే ఊబకాయం ప్రమాదాన్ని పరిగణనలోకి తీసుకుంటే.. మాత్రం మగవారు ఈ అధ్యయనం గురించి తప్పనిసరిగా తెలుసుకోవాలి. పురుషులతో పోలిస్తే మహిళల్లో బెల్లీ ఫ్యాట్ వల్ల క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఎక్కువగా లేదు. మందపాటి నడుము ఉన్న పురుషులకు క్యాన్సర్ వచ్చే ప్రమాదం అధికంగా ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇదిలా ఉంటే బెల్లీ ఫ్యాట్ వల్ల మహిలకు క్యాన్సర్ ప్రమాదం లేకపోవడం ఉపశమనం కలిగించే విషయం అనే చెప్పాలి.
BMI కంటే బెల్లీ ఫ్యాట్ ఎందుకు ప్రమాదకరం ?
ఈ అధ్యయనంలో బాడీ మాస్ ఇండెక్స్ (BMI) సాధారణంగా శరీర పరిమాణాన్ని కొలుస్తుంది. కానీ ఈ కొవ్వు శరీరంలో ఎక్కడ వ్యాపిస్తుందో తెలియదు. దీనికి విరుద్ధంగా, నడుము వెడల్పు బెల్లీ ఫ్యాట్ తో ఎక్కువగా సంబంధం కలిగి ఉంటుంది.
పొట్ట భాగంలోని అవయవాల చుట్టూ పేరుకుపోయే కొవ్వును విసెరల్ ఫ్యాట్ అని పిలుస్తారు. ఇది శరీరంలో జీవక్రియపై ప్రభావం చూపుతుంది. అంతే కాకుండా ఇన్సులిన్ నిరోధకత, వాపు , రక్తంలో అసాధారణ కొవ్వు స్థాయిలు వంటి ఆరోగ్య సమస్యలను కలిగిస్తుంది. ఇది క్యాన్సర్ ప్రమాదంగా మారవచ్చు.
3 లక్షలకు పైగా పురుషులపై క్యాన్సర్ అధ్యయనం:
ఈ అధ్యయనం స్వీడన్‌లో జరిగింది. అధ్యయనం కోసం.. 1981 నుండి 2019 వరకు సుమారు 3,39,190 మంది ఆరోగ్య డేటాను శాస్త్రవేత్తలు విశ్లేషించారు. వారి BMI , నడుము చుట్టుకొలతను కొలిచారు. వీరిలో 61 శాతం కొలతలు వైద్యులు తీసుకోగా.. 39 శాతం మంది వారి సమాచారాన్ని స్వయంగా ఇచ్చారు. ఈ వ్యక్తుల సగటు వయస్సు 51.4 సంవత్సరాలు. పరిశోధకులు వీరి BMI, నడుము చుట్టుకొలత ఆధారంగా ఊబకాయం, సంబంధిత క్యాన్సర్ ప్రమాదాన్ని పోల్చారు. ఈ పరిశోధనలో సదరు వ్యక్తుల వయస్సు, ధూమపాన అలవాట్లు, విద్య, ఆదాయం, జన్మస్థలం, వైవాహిక స్థితి వంటి అనేక అంశాలను కూడా పరిణనలోకి తీసుకున్నారు.
కడుపులో కొవ్వు పేరుకుపోవడం వల్ల క్యాన్సర్ వస్తుందా ?
దాదాపు 14 సంవత్సరాల సగటు అధ్యయన కాలంలో.. 18,185 ఊబకాయ సంబంధిత క్యాన్సర్ కేసులు నమోదయ్యాయి. విశ్లేషణలు BMIని పరిగణనలోకి తీసుకున్నప్పటికీ.. బెల్లీ ఫ్యాట్ ఉన్న పురుషుల ఆరోగ్యం క్యాన్సర్ ప్రమాదంతో ముడిపడి ఉంది.
Also Read: ఇది వాడితే.. తల మోయలేనంత జుట్టు
బెల్లీ ఫ్యాట్ ఉన్న స్త్రీలకు క్యాన్సర్ ప్రమాదం తక్కువగా ఉంటుందా ?
పురుషులలో.. ఊబకాయం వల్ల వచ్చే క్యాన్సర్‌కు బెల్లీ ఫ్యాట్ ప్రమాద కారకంగా మిగిలిపోయింది. దీని అర్థం, ఒక వ్యక్తి బరువు లేదా శరీర కొవ్వుతో సంబంధం లేకుండా.. బెల్లీ ఫ్యాట్ ఒక ప్రత్యేకమైన ప్రమాదాన్ని కలిగిస్తుంది.
మహిళల్లో.. బెల్లీ ఫ్యాట్ కొవ్వు , శరీర బరువు రెండింటి వల్ల క్యాన్సర్ ప్రమాదం తక్కువగా ఉంటుంది. పరిశోధకుల అభిప్రాయం ప్రకారం.. పురుషుల శరీరంలో కొవ్వు ఎక్కువగా కడుపు లోపల నిల్వ ఉంటుంది. అయితే స్త్రీలలో ఇది చర్మం కింద , శరీరంలోని ఇతర భాగాలలో ఎక్కువగా నిల్వ ఉంటుంది. అధ్యయనంలో తుంటి వెడల్పును కూడా చేర్చినట్లయితే.. మహిళల్లో నడుము వెడల్పు మరియు క్యాన్సర్ మధ్య సంబంధాన్ని బాగా అర్థం చేసుకోవచ్చని అధ్యయనం సూచించింది.