Fast Hair Growth Tips: ఈ రోజుల్లో ప్రతి ఒక్కరూ జుట్టు సంబంధిత సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు. ప్రతి స్త్రీ తన జుట్టు పెరుగుదల చాలా బాగా ఉండాలని కోరుకుంటుంది. ఈ రోజుల్లో పొడవాటి జుట్టు ఒక ట్రెండ్ . అమ్మాయిలు తమ జుట్టు నడుము వరకు పొడవుగా ఉండాలని కోరుకుంటారు.
కానీ నేటి జీవనశైలి, రసాయనాలతో తయారు చేసిన హెయిర్ ప్రొడక్ట్స్ కారణంగా, ఈ కల నెరవేరడం లేదు. ఇదిలా ఉంటే.. జుట్టు పొడవుగా పెరగడానికి చాలా మంది రకరకాల ఆయిల్స్ ఉపయోగిస్తారు. కానీ వీటికి బదులుగా కొన్ని హోం రెమెడీస్ వాడటం వల్ల మంచి ఫలితం ఉంటుంది.
మీరు కూడా మీ జుట్టును వేగంగా పెంచుకోవాలనుకుంటే.. ఒక హోం రెమెడీ వాడాలి. తర్వాత మీరు మీ జుట్టులో తేడాను చూస్తారు. రోజ్మేరీ, ఉసిరితో తయారు చేసిన హెర్బల్ షాంపూను కూడా మీరు ఇంట్లోనే తయారు చేసుకుని ఉపయోగించవచ్చు. దీనిని వాడటం వల్ల మీ జుట్టు రాలకుండా ఉంటుంది. అంతే కాకుండా ఇందులో మనం వాడిన పదార్థాలు జుట్టుకు అవసరమైన పోషణను అందిస్తాయి. ఫలితంగా కొత్త జుట్టు కూడా వస్తుంది. అంతే కాకుండా తెల్ల జుట్టు కూడా నల్లగా మారుతుంది.
షాంపూ తయారీకి కావలసిన పదార్థాలు:
రోజ్మేరీ పొడి – 2 టీస్పూన్లు
ఆమ్లా ఉసిరి – 2 టీస్పూన్లు
షీకాకై పౌడర్ – 2 టీస్పూన్లు
నీరు – అవసరాన్ని బట్టి
కుంకుడు కాయ పౌడర్ – 2 టీ స్పూన్లు
ముల్తానీ మట్టి – 2 టీస్పూన్లు
మందార పొడి – 2 టీస్పూన్లు
జుట్టు పెరుగుదలకు ఈ మిశ్రమాన్ని తయారు చేసుకోవాలి:
జుట్టు పొడవును పెంచే ఈ షాంపూను సిద్ధం చేయడానికి.. ముందుగా మీరు ఒక గిన్నెలో రోజ్మేరీ పౌడర్, కుంకుడు కాయ పౌడర్ , ముల్తానీ మిట్టి పౌడర్, శికాకై పౌడర్ , మందార పౌడర్‌లను వేసి బాగా కలపాలి. ఇప్పుడు మీరు రోజ్మేరీ ఆకులను గ్రైండ్ చేసి దాని పొడిని తయారు చేసుకోవాలి. ఇప్పుడు అన్ని పొడులను కలిపి స్టోర్ చేసుకోండి. అవసరం అయినప్పుడు కొంత ఈ పౌడర్ మిక్స్ తీసుకుని నీరు కలిపి వాడవచ్చు.
ఎలా ఉపయోగించాలి ?
మీరు తలస్నానం చేయాలని అనుకున్న రోజు రెండు నుండి మూడు చెంచాల పౌడర్ పాత్రలో తీసుకోండి.
ఇప్పుడు ఈ మిశ్రమానికి నీరు కలపండి. చాలా పలుచగా కాకుండా పేస్ట్ .. మందంగా ఉండేలా చూసుకోండి. ఈ మిశ్రమం తయారు అయిన తర్వాత, దానిని జుట్టుకు బాగా పట్టించండి. మీరు దీన్ని మీ జుట్టు మూలాలకు మాత్రమే అప్లై చేయాలి. అనంతరం 20 నిమిషాలు అలాగే ఉంచిన తర్వాత.. జుట్టును గోరువెచ్చని నీటితో వాష్ చేయాలి. కొన్ని రోజులు జుట్టుకు వేరే ఏ షాంపూను ఉపయోగించండి.
Also Read: చర్మ సౌందర్యం కోసం.. రోజ్ వాటర్ ఇలా కూడా వాడొచ్చు తెలుసా ?
వారానికి ఎన్నిసార్లు వాడాలి ?
మీరు ఈ పొడిని వారానికి రెండుసార్లు ఉపయోగించవచ్చు. దీని వల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ రావు. దీనిలో ఉపయోగించే అన్ని మూలికలు జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తాయి. జుట్టుకు అప్లై చేయడానికి ముందు మీరు ప్యాచ్ టెస్ట్ చేసుకోండి.