Vijay Deverakonda.. టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్న విజయ్ దేవరకొండ (Vijay Deverakonda) గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. తన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈయన రౌడీ హీరోగా పేరు దక్కించుకోవడమే కాకుండా ఎంతో మంది అమ్మాయిల కలల రాకుమారుడిగా కూడా పేరు సొంతం చేసుకున్నారు. ఒకప్పుడు క్యారెక్టర్ ఆర్టిస్ట్ పాత్రలతో ప్రేక్షకులను అలరించిన ఈయన.. ఇప్పుడు స్టార్ హీరోగా చలామణి అవ్వడమే కాకుండా అటు అభిమానులతో కూడా ఎప్పటికప్పుడు ఇంట్రాక్ట్ అవుతూ ఉంటాడు. ఇలా భారీ పేరు సొంతం చేసుకున్న విజయ్ దేవరకొండ బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసి ఇప్పుడు చిక్కుల్లో పడ్డ విషయం తెలిసిందే. ఇదిలా ఉండగా గత కొన్ని రోజులుగా రెండు తెలుగు రాష్ట్రాలలో బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ ఏ రేంజ్ లో సంచలనం సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ముఖ్యంగా సెలబ్రిటీలను నమ్ముకున్న ఎంతోమంది ఈ బెట్టింగ్ యాప్ లో పెట్టుబడి పెట్టి ఆర్థికంగా నష్టపోయి ఆత్మహత్యలు కూడా చేసుకున్నారు. ఈ నేపథ్యంలోనే రంగంలోకి దిగిన వీసీ సజ్జనార్ పోలీసుల సహాయంతో బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసిన వారికి తాహతు చూడకుండా ప్రతి ఒక్కరికి నోటీసులు జారీ చేయడం జరిగింది.
విజయ్ దేవరకొండపై మండిపడుతున్న కేఏ పాల్..
అయితే అందులో కొంతమంది విచారణకు హాజరుకాగా.. మరికొంతమంది తప్పించుకు తిరుగుతున్నారు. ఇంకొంతమంది వారు స్పందించకుండా.. వారి టీం చేత స్పందిస్తూ సైడ్ ఇచ్చే ప్రయత్నాలు చేస్తుండగా.. ఈ నేపథ్యంలోనే రంగంలోకి దిగిన కేఏ పాల్ (KA Paul).. టాప్ సెలబ్రిటీలపై మండిపడుతూ ఓపెన్ అపాలజీ చెప్పేవరకు వదిలిపెట్టనని , ఒకవేళ పోలీసులు.. రాజకీయ నేతలను సెలబ్రిటీలను లంచం సహాయంతో వదిలేసినా.. నేను మాత్రం వారిని సుప్రీంకోర్టు వరకు నడిపిస్తాను అంటూ ఒక వీడియో రిలీజ్ చేశారు.
Bollywood:షాప్ ఓపెనింగ్ వచ్చిన బాలీవుడ్ నటిపై దాడి… ఒక్కసారిగా ఉలిక్కిపడ్డ ఇండస్ట్రీ..!
టాప్ సెలబ్రిటీలకు కేఏ పాల్ మాస్ వార్నింగ్..
ఆ వీడియోలో కేఏ పాల్ మాట్లాడుతూ.. “ఇటీవల విజయ్ దేవరకొండ పోస్టులో ఒక మేటర్ చదివాను. చదివి షాక్ అయిపోయాను. అరే మన అన్న విజయ్ దేవరకొండ చెప్పాడు.. వెంటనే నేను ఈ యాప్ ను డౌన్లోడ్ చేసుకుంటాను అని ఎంతోమంది వీరిని నమ్మి నష్టపోతున్నారు. ముఖ్యంగా విజయ్ దేవరకొండ మాత్రమే కాదు బాలకృష్ణ (Balakrishna ), మంచు లక్ష్మి(Manchu Lakshmi) ఇలా మొత్తం 25 మంది సెలబ్రిటీలు ఇప్పుడు అరెస్ట్ అవబోతున్నారు. ఒకవేళ పోలీసులు డబ్బులు తీసుకొని వీరిని అరెస్టు చేయకపోతే.. వారందరినీ నేనే సుప్రీంకోర్టుకి నడిపిస్తాను. ప్రకాష్ రాజ్ (Prakash Raj) లాగా మీరంతా కూడా తప్పు అయింది అని ఓపెన్ అపాలజీ చెప్పనంతవరకు సుప్రీంకోర్టుకు నేనే వీరిని నడిపిస్తాను. ఈ బెట్టింగ్ యాప్స్ వల్ల 980 మంది ఆత్మహత్య చేసుకున్నారు. ఒకరకంగా నరహత్య చేసి మీరు ఆ బెట్టింగ్ యాప్స్ ద్వారా డబ్బు సంపాదించారు. మీకు మానవత్వం లేదా? దైవత్వం లేదా ?అంటూ సెలబ్రిటీలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇకపోతే బహిరంగంగా క్షమాపణ చెప్పేవరకు వదిలిపెట్టనని కూడా మాస్ వార్నింగ్ ఇచ్చారు. ఇక ప్రస్తుతం ఈ విషయాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.
బాలకృష్ణ, విజయ్ దేవరకొండ, మంచు లక్ష్మీలకు కేఏ పాల్ వార్నింగ్
ఒకవేళ పోలీసులు వీళ్లని అరెస్ట్ చేయకపోతే.. స్వయంగా నేనే సుప్రీంకోర్టుకు నడిపిస్తానంటూ వ్యాఖ్య
బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేసిన ప్రతి ఒక్కరూ ప్రకాశ్ రాజ్ లాగా తప్పును ఒప్పుకోవాలని హితవు
మీకు మానవత్వం లేదా?.. దైవత్వం… https://t.co/DCWmRCAWpH pic.twitter.com/t91gA9GxC1
— BIG TV Breaking News (@bigtvtelugu) March 24, 2025