CM Revanth Reddy: తెలంగాణలో కేబినెట్ విస్తరణ ఉంటుందా? మళ్లీ ఊహాగానాలే కంటిన్యూ అవుతాయా? త్వరలో వీటికి హైకమాండ్ ఫుల్‌స్టాప్ పెట్టనుందా? ఉగాదికి కాబినెట్ విస్తరణ ఉంటుందనే చర్చ నేపథ్యంలో సీఎం టూర్‌పై ఆసక్తి నెలకొంది. హైకమాండ్ పిలుపుతో సీఎంతోపాటు మరో ముగ్గురు నేతలు హస్తినకు వెళ్తున్నారు. సోమవారం మధ్యాహ్నం హైదరాబాద్ నుంచి ఢిల్లీకి వెళ్లనున్నారు.
గడిచిన ఆరునెలలుగా రేవంత్ కేబినెట్ విస్తరణ ఉంటుందని రకరకాలుగా వార్తలు వస్తున్నాయి. సీఎం రేవంత్ రెడ్డి హస్తినకు వెళ్లిన ప్రతీసారి ఇలాంటి చర్చ జరుగుతుంది. పలుమార్లు సీఎం రేవంత్ క్లారిటీ ఇచ్చినప్పటికీ, ఊహాగానాలు మాత్రం ఆగలేదు.. కంటిన్యూ అవుతున్నాయి. తాజాగా తెలంగాణ కాంగ్రెస్ పెద్దలకు ఏఐసీసీ నుంచి పిలుపు వచ్చింది.
ఏఐసీసీ జనరల్ సెక్రటరీ కేసి వేణుగోపాల్ సీఎం రేవంత్ తోపాటు డిప్యూటీ సీఎం భట్టి, పీసీసీ చీఫ్ మహేష్‌కుమార్, మంత్రి ఉత్తమ్ కుమార్‌కు పిలుపు వచ్చినట్టు గాంధీభవన్ వర్గాలు చెబుతున్నాయి. సోమవారం, మంగళవారం అందుబాటులో ఉండాలన్నది దాని సారాంశం.
ముఖ్యంగా కాబినెట్ విస్తరణ, నామినేటెడ్ పదవుల సెకండ్ లిస్ట్‌పై చర్చించే అవకాశము న్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో మధ్యాహ్నం శంషాబాద్ ఎయిర్‌పోర్ట్ నుండి ఢిల్లీకి వెళ్ళనున్నారు సిఎం రేవంత్ రెడ్డి. సోమవారం రాత్రి లేదా మంగళవారం ఉదయం పార్టీ పెద్దలతో సమావేశం కానున్నారు.
ALSO READ: ఫ్యామిలీ ప్లానింగ్‌లో తెలంగాణ టాప్
ఆరుగుర్ని కేబినెట్‌లోకి తీసుకుంటారా? లేదంటే ఐదుగుర్ని కేబినెట్ లోకి తీసుకుని ఒక దానిని పెండింగ్‌లో పెడతారా? అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. అయితే ఎవరికి ఛాన్స్ ఇవ్వాలనే దానిపై చాన్నాళ్లుగా కసరత్తు జరుగుతోంది. ఇప్పటివరకు కొన్ని ఉమ్మడి జిల్లాలు, సామాజిక వర్గాలకు కేబినెట్‌లో అవకాశం లేదు. దీన్ని పరిగణనలోకి తీసుకున్నట్లు తెలుస్తోంది.
ఇప్పటికే ఓ లిస్టు కూడా రెడీ అయినట్టు అంతర్గత సమాచారం. సోమవారం రాత్రి లేదా మంగళవారం ఉదయం పార్టీ పెద్దలు తెలంగాణ ముఖ్యనేతలతో చర్చించనున్నారు. ఆ తర్వాత దీనిపై ప్రకటన చేస్తారా? ఉగాదికి చేస్తారా? అనేది తేలాల్చివుంది. చాలామంది ఆశావహులు ఢిల్లీ చుట్టూ చక్కర్లు కొడుతున్నారు. తమవంతు పైరవీలు చేస్తున్నారు.
మంత్రివర్గంలో పదవులు రాని నేతలు పార్టీ పదవులు ఇవ్వాలి ఆలోచన చేస్తున్నట్లు ఢిల్లీ సమాచారం. అధికారంలోకి వస్తే మంత్రి పదవులు ఇస్తామని ఎన్నికల ముందు కొందరి నేతలకు హామీ ఇచ్చారు హైకమాండ్ పెద్దలు. వాళ్లలో కొందరికి ఇచ్చే అవకాశమున్నట్లు సమాచారం.
ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్, రంగారెడ్డి జిల్లాల నేతలకు ప్రాతినిధ్యం లేదు. బీసీ కులగణన నేపథ్యంలో మున్నారు కాపు కమ్యూనిటీకి ప్రయార్టీ ఇవ్వాలన్నది ఆలోచనగా చెబుతున్నారు. సామాజిక సమీకరణాలు వర్కవుట్ అయితే.. ఉమ్మడి జిల్లాల ప్రాధాన్యత సెట్ కావడం లేదు. దీనికి సంబంధించి పలుమార్లు విస్తరణ వాయిదా పడుతూ వచ్చింది.
రంగారెడ్డి నుంచి మల్‌రెడ్డి రంగారెడ్డి, కరీంనగర్ లక్ష్మణ్, వివేక్‌కు ఛాన్స్ ఇచ్చే అవకాశమున్నట్లు తెలుస్తోంది. నిజామాబాద్ నుంచి ఆది శ్రీనివాస్, సుదర్శన్ రెడ్డి ఛాన్స్ దక్కడ ఖాయమని అంటున్నారు. మహబూబ్‌నగర్- శ్రీహరి ఇవ్వడం ఖాయమనే ప్రచారం జోరుగా సాగుతోంది. మొత్తానికి తెలంగాణ కాంగ్రెస్ పెద్దలు ఢిల్లీ వెళ్లిన ప్రతీసారి పదవులపై చర్చ జరుగుతోంది. పదవుల ఉత్కంఠకు తెరపడాలంటే ఆశావహులు కొన్ని గంటలు వెయిట్ చేయక తప్పదు.
నేడు సాయంత్రం ఢిల్లీకి సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క
అధిష్టానం పెద్దలతో కీలక సమావేశం
రాత్రి జరిగే సమావేశానికి హాజరు కానున్న ఇరువురు
కేబినెట్ విస్తరణపై చర్చించే అవకాశం
ఉగాదికి కేబినెట్ విస్తరణ ఉండే ఛాన్స్ pic.twitter.com/Ub2vrJQiRE
— BIG TV Breaking News (@bigtvtelugu) March 24, 2025