BigTV English

Weight Loss : లావు తగ్గాలంటే.. ఈ ఒక్కటి చేయండి చాలు..

Weight Loss : లావు తగ్గాలంటే.. ఈ ఒక్కటి చేయండి చాలు..

Weight Loss : బెల్లీ ఫ్యాట్. పెద్ద పొట్ట. భారతీయులకు అతిపెద్ద సమస్య. చేతులు, కాళ్లు సన్నగానే ఉంటాయి. కానీ, పొట్ట మాత్రం లావుగా ఉంటుంది. ముందుకు, పక్కలకు పొడుచుకు వస్తుంది. చూట్టానికి గలీజ్‌గా కనిపిస్తుంది. బాడీ షేప్ మొత్తం మారిపోతుంది. ఎంత డైటింగ్ చేసినా ఆ కొవ్వు కరగదు. ఎన్ని ఎక్సర్‌సైజులు చేసినా ఆ పొట్ట తగ్గదు. అందమంతా అక్కడే ఉంటుంది మరి. అది తగ్గితేనే పురుషులు సిక్స్ ప్యాక్స్‌తో ఫిట్‌గా కనిపిస్తారు. పొట్ట పోతేనే.. అమ్మాయిలు నాజుగ్గా, స్లిమ్‌గా, మంచి ఫిగర్‌తో ఉంటారు. ఇలా అందానికి కేరాఫ్ పొట్ట. రోగాలకు కూడా. అధికంగా లావు ఉండటం వల్ల అనేక రోగాలు కూడా వస్తాయి. గుండెపోటు కూడా వచ్చే ఛాన్స్ ఉంది. అందుకే, బొడ్డు చుట్టూ పేరుకుపోయే కొవ్వును.. పొట్టే కదా అని లైట్ తీసుకోవడానికి లేదని హెచ్చరిస్తున్నారు డాక్టర్లు, ఆరోగ్య నిపుణులు.


సెంట్రల్ ఒబేసిటీ..

చాలా మంది భారతీయ పురుషులు, స్త్రీలలో కనిపించే లక్షణం ఇది. చేతులు, కాళ్లు చాలా సన్నగా ఉండి.. బొడ్డు దగ్గర మాత్రమే పొట్ట లావుగా, బయటకు వచ్చి ఎబ్బెట్టుగా కనిపిస్తుంటుంది. ఈ సమస్యను వైద్య పరిభాషలో “సెంట్రల్ ఒబేసిటీ” అంటారు. ఆహారపు అలవాట్లు, జీవనశైలి విధానాలే సెంట్రల్ ఒబేసిటీకి కారణం. అధికంగా పిండిపదార్థాలు తీసుకోవడం, దీర్ఘకాలిక ఒత్తిడి, నిద్ర లేమి తదితర కారణాలతో వస్తుందని చెబుతున్నారు. ఇది ఎంతమాత్రం సాధారణ సమస్య కాదని అంటున్నారు.


హెవీ కార్బ్.. క్వాలిటీలెస్ ఫుడ్

మన ఆహారశైలిలోనే ప్రధాన లోపం ఉందంటున్నారు నిపుణులు. ఉదయాన్నే ఉప్మా, ఇడ్లీ, పూరీ, కిచిడీల్లాంటివి లాగిస్తుంటాం. మధ్యాహ్నం కంచెం నిండా తెల్లన్నం ఉండాల్సిందే. ఆలు కర్రీ చాలామందికి ఫేవరేట్. సాయంత్రం సమోసా, మిర్చీ, బోండాలు లాంటివి కుమ్మేస్తాం. రాత్రికి మళ్లీ అన్నం. మధ్య మధ్యలో టీ, కాఫీలకైతే లెక్కే ఉండదు. కేసులు, కూల్‌డ్రింక్స్, పిజ్లాల్లాంటివి వీటికి అధనం. ఇలా రోజంతా ఇండియన్స్ తినే ఫుడ్ చాలా వరకు ఒబేసిటీకి కారణమయ్యేవేనని చెబుతున్నారు. ఇవన్నీ అధిక కేలరీలు కలిగిన కార్బోహైడ్రేట్స్. ఇలా ఒక రోజులో అంతేసి పిండిపదార్థాలు ఆరగిస్తే.. బొడ్డు చుట్టూ కొవ్వు పేరుకుపోవడం ఖాయమంటున్నారు. లేట్ నైట్ తినడం.. తిన్న వెంటనే పడుకోవడం కూడా కరెక్ట్ కాదు. మరోవైపు.. కార్బ్, ప్రాసెస్డ్ ఫుడ్ బాగా తగ్గించి.. ఫైబర్ ఫుడ్ తీసుకోవడం పెంచాలని సూచిస్తున్నారు. తగిన మోతాదులో పండ్లు తీసుకోవాలి. మిల్లెట్స్ చాలా మంచివని చెబుతున్నారు. పాలు, పాల ఉత్పత్తులు పరిమితంగా తీసుకుంటేనే బెటర్.

దీర్ఘకాలిక ఒత్తిడి.. నిద్ర లేమి..

ఇప్పుడంతా ఉరుకులు పరుగులు జీవితాలే. ఉదయం లేచినప్పటి నుంచీ నైట్ నిద్రపోయే వరకూ.. అంతా బిజీ బిజీ. ఉద్యోగం, వ్యాపారాల్లో ఎనలేని ఒత్తిడి. ఆ ప్రెజర్ తట్టుకోలేక పోతున్నారు చాలామంది. ఎంత తిన్నా ఆకలి తీరట్లేదంటారే.. అది ఇదే. మానసిక ఒత్తిడి అధికంగా ఉంటే అన్నీ రోగాలే. అందులో ఊబకాయం కూడా ఒకటి. టెన్షన్‌ లేకుండా ఉంటేనే మెరుగైన ఆరోగ్యం. ఒత్తిడి ఒక్కటే కాదు మంచి నిద్ర కూడా చాలా ముఖ్యం. కంటినిండా నిద్రపోయి చాలా రోజులే అవుతోంది అంటూ చాలామంది అంటుంటారు. పడుకునే ముందు మొబైల్ ఫోన్లు చూస్తుంటే నిద్ర పట్టకపోవచ్చు. రోజుకు 8 గంటల డీప్ స్లీప్ లేకపోతే ఒబేసిటీ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ. ఎందుకంటే నిద్రలోనే మన శరీరం తనకు తాను స్వతహాగా రిపేర్ చేసుకుంటుంది. సరైన, మంచి నిద్ర లేకపోతే బాడీ అడ్డదిడ్డంగా తయారవుతోంది.

శారీరక శ్రమ.. వ్యాయామం..

బద్దకస్తులకు బొజ్జ రావడం ఖాయం. కాయకష్టం చేసే వాళ్లు సన్నగా ధృఢంగా ఉండటం కామన్. ఇప్పుడంతా కూర్చొని ఉద్యోగ, వ్యాపారాలు చేసే వాళ్లే కాబట్టి.. చాలామందిలో పొట్ట పెరుగుతోంది. వ్యాయామం చేయడం అన్నిరకాలుగా మంచిదని తెలిసినా బద్ధకం చేయనివ్వదు. ఉదయం లేచి కాసేపు వాకింగ్ చేస్తే సరిపోతుంది అనుకుంటారు కొందరు. అది కొంచమే నిజం. పార్కులో సరదాగా కబుర్లు చెప్పుకుంటూ టైంపాస్‌కు వాకింగ్ చేస్తే ఎలాంటి యూజ్ ఉండదంటున్నారు వైద్యులు. నిదానంగా నడవడం కాకుండా.. వేగంగా చేతులు ఊపుతూ.. చెమట పట్టేలా స్పీడ్‌ వాకింగ్ చేయాలని చెబుతున్నారు. కనీసం 40 నిమిషాల నడక.. మీ గుండెకు, ఒబేసిటీ తగ్గుదలకు మంచిది. జాగింగ్, రన్నింగ్ లాంటివి బెటరే కానీ.. మరీ లావుగా ఉన్నవాళ్లు రన్నింగ్ చేయడం వారి మొకాళ్లకు అంత మంచిది కాదు. డాక్టర్ సలహా తప్పనిసరి.

Related News

Hair Care Tips: వర్షంలో జుట్టు తడిస్తే..… వెంటనే ఇలా చేయండి?

Paneer Effects: దే…వుడా.. పన్నీరు తింటే ప్రమాదమా?

Hair Growth Tips: ఈ టిప్స్ పాటిస్తే.. వారం రోజుల్లోనే ఒత్తైన జుట్టు !

Gut Health: గట్ హెల్త్ కోసం.. ఎలాంటి ఆహారం తినాలి ?

Cucumber Benefits: దోసకాయ తింటే.. నమ్మలేనన్ని లాభాలు !

Mint Leaves: తులసి ఆకులు నేరుగా తింటే ప్రమాదమా? ఏమవుతుంది?

Big Stories

×