Train Accident: హైదరాబాద్‌లో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. కాచిగూడ రైల్వే స్టేషన్ పరిధిలో ఇద్దరు అన్నదమ్ములు పట్టాలు దాటుతుండగా.. రైలు ఢీకొనడంతో ప్రమాదం జరిగింది. ప్రమాదంలో ఇద్దరు అక్కడికక్కడే మృతిచెందారు.
రైల్వే ఇన్ స్పెక్టర్ ఎల్లప్ప చెప్పిన వివరాల ప్రకారం.. మహ్మద్ సాహెబుద్దీన్ (26), ఫైజాన్ (21) ఇద్దరు అన్నదమ్ములు. ఈ రోజు యాకత్‌పురా- ఉప్పుగూడ రైల్వే స్టేషన్ల మధ్య పట్టాలు దాటుతుండగా.. అటువైపుగా వచ్చిన రైలు ఢీకొంది. ప్రమాదంలో ఇద్దరు అక్కడిక్కడే ప్రాణాలు కోల్పోయారు.
ALSO READ: C-DAC Recruitment: సీడ్యాక్‌లో 848 ఉద్యోగాలు.. ఈ అర్హత ఉన్నవారు అప్లై చేసుకోవచ్చు..
సాహెబుద్దీన్ ఎలక్ట్రిక్ పనులు చేస్తుండగా.. ఫైజాన్ వెల్డింగ్ పని చేస్తూ కుటుంబానికి ఆసరాగా ఉండేవారని పోలీసులు తెలిపారు. చేతికి అందిని కుమారులు చనిపోవడంతో.. తల్లిదండ్రులు విలపిస్తున్న తీరు అక్కడున్న స్థానికుల గుండెల్ని మెలిపెట్టింది.
ALSO READ: Corona: 3900 కరోనా కేసులు, ఇప్పటివరకు 32మంది మృతి.. ఈ కొవిడ్ డేంజర్ భయ్యా