Soaked Raisins: ఎండుద్రాక్షలు రుచికరమైనవి మాత్రమే కాదు.. వాటిలో అనేక విలువైన ఆరోగ్య ప్రయోజనాలు కూడా దాగి ఉన్నాయి. ముఖ్యంగా ఎండు ద్రాక్ష నానబెట్టిన తర్వాత తింటే.. వాటి పోషకాలు మరింత ప్రభావవంతంగా మారతాయి. నానబెట్టిన ఎండుద్రాక్షలలో ఫైబర్, ఐరన్, కాల్షియం ,యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీరంలోని వివిధ భాగాలను బలోపేతం చేయడంలో సహాయపడతాయి.
మీరు బలహీనంగా ఉన్న.. అంతే కాకుండా జీర్ణ సమస్యలు ఉన్నా లేదా మీ ముఖంపై మెరుపు తీసుకురావాలనుకున్నా, నానబెట్టిన ఎండుద్రాక్షలు ఇందుకు సహజమైన పరిష్కారం. ఇవి శరీరం లోపలి నుంచి వ్యర్థ పదార్థాలను తొలగించడమే కాకుండా రోగనిరోధక శక్తిని కూడా పెంచుతాయి. నానబెట్టిన ఎండు ద్రాక్షలు తినడం వల్ల ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయనే విషయాలను గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
రక్తహీనతను నయం చేస్తుంది:
నానబెట్టిన ఎండుద్రాక్షల్లో ఐరన్ పుష్కలంగా ఉంటుంది. దీనిని క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల శరీరంలో ఎర్ర రక్త కణాలు పెరుగుతాయి. అంతే కాకుండా హిమోగ్లోబిన్ స్థాయి కూడా పెరుగుతుంది. ఇది ముఖ్యంగా మహిళలు, రక్తహీనతతో ఇబ్బంది పడే వారికి చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. ప్రతి రోజు ఉదయం ఖాళీ కడుపుతో నానబెట్టిన ఎండుద్రాక్షలు తినడం వల్ల రక్తహీనత తొలగిపోతుంది. అంతే కాకుండా ఇది శరీరానికి కూడా బలాన్ని కూడా ఇస్తుంది.
జీర్ణక్రియను బలపరుస్తుంది:
ఎండుద్రాక్షలో కరిగే ఫైబర్ ఉంటుంది. ఇవి జీర్ణక్రియను మెరుగుపరుస్తాయి. అంతే కాకుండా నానబెట్టిన ఎండుద్రాక్ష మలబద్ధకం, గ్యాస్ , ఆమ్లత్వం వంటి సమస్యలను తగ్గించడంలో సహాయపడతాయి. ఇది ప్రేగులను కూడా శుభ్రపరుస్తుంది. అంతే కాకుండా జీర్ణవ్యవస్థను చురుకుగా కూడా ఉంచుతుంది.
చర్మాన్ని మెరిసేలా చేస్తుంది:
నానబెట్టిన ఎండుద్రాక్షలో యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి చర్మం నుంచి వ్యర్థ పదార్థాలను తొలగిస్తాయి. అంతే కాకుండా ఇవి చర్మాన్ని స్పష్టంగా, మెరిసేలా, యవ్వనంగా కనిపించేలా చేస్తాయి. అలాగే, ఇందులో ఉండే విటమిన్లు సి , ఇ చర్మ కణాలను రిపేర్ చేయడంలో సహాయపడతాయి. వీటిని రోజూ తినడం వల్ల ముఖంపై సహజమైన మెరుపు వస్తుంది.
రోగనిరోధక శక్తిని పెంచుతుంది:
నానబెట్టిన ఎండుద్రాక్షలో ఉండే యాంటీ బాక్టీరియల్ గుణాలు, పోషకాలు శరీర రోగనిరోధక శక్తిని బలోపేతం చేస్తాయి. ఇవి వైరల్, ఫ్లూ, జలుబు ,దగ్గు వంటి ఇన్ఫెక్షన్లతో పోరాడే సామర్థ్యాన్ని పెంచుతాయి. సీజనల్ వ్యాధుల నుంచి రక్షించడానికి పిల్లలు వృద్ధులకు ఇవ్వాడం మంచిది.
గుండె ఆరోగ్యానికి మేలు చేస్తుంది:
ఎండుద్రాక్షలో పొటాషియం, యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి రక్తపోటును నియంత్రిస్తాయి. అంతే కాకుండా కొలెస్ట్రాల్‌ను తగ్గించడంలో సహాయపడతాయి. ఇది గుండె ధమనులను శుభ్రంగా ఉంచుతుంది. అంతే కాకుండా గుండెపోటు ప్రమాదాన్ని కూడా తగ్గిస్తుంది. గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి.. మీ దినచర్యలో నానబెట్టిన ఎండుద్రాక్షను చేర్చుకోండి.
Also Read: కలబంద జ్యూస్ తాగితే.. ఈ రోగాలన్నీ పరార్ !
నానబెట్టిన ఎండుద్రాక్షలను ఎలా తినాలి ?
రాత్రిపూట ఒక గిన్నె నీటిలో 8-10 ఎండుద్రాక్షలను నానబెట్టండి. ఉదయం ఖాళీ కడుపుతో వాటిని నమిలి మిగిలిన నీటిని తాగండి. ఐరన్, ఫైబర్ బాగా గ్రహించడానికి దీనిని క్రమం తప్పకుండా తీసుకోవాలి. గుర్తుంచుకోండి. డయాబెటిక్ రోగులు డాక్టర్ సలహా మేరకు మాత్రమే వీటిని తినాలి.