ODI WORLD CUP 2027 : సాధారణంగా క్రికెట్ లో ఎప్పుడూ ఏం జరుగుతుందో మనం ఊహించడం కష్టంతో కూడుకున్నపనే. ఎందుకు అంటే..? ఎప్పుడూ ఏ ఆటగాడు రాణిస్తాడో.. ఎప్పుడూ ఏ ఆటగాడు పేలవ ప్రదర్శన కనబరుస్తాడో చెప్పడం రిస్క్ తో కూడుకున్న పనే. అలాగే ప్రపంచ వ్యాప్తంగా పలువురు ఆటగాళ్లతో పాటు పలు జట్లు కూడా ఎప్పుడూ ఏ జట్టు రాణిస్తుందో..ఎప్పుడు ఏ జట్టు ఓటమి పాలవుతుందో చెప్పలేము. ముఖ్యంగా ఆటగాళ్లు రాణిస్తే.. ఆ జట్టు విజయం సాధిస్తుంది. ఆటగాళ్లు బౌలింగ్, బ్యాటింగ్ రెండింటిలో ప్రతిభ కనబరిచినప్పుడే ఆ టీమ్ విజయంలో కీలక పాత్ర పోషిస్తుంది. ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్ ఇంగ్లాండ్ జట్టును వెనక్కి నెట్టి టాప్ 7లో కొనసాగుతోంది అప్గానిస్తాన్ జట్టు. దీంతో ప్రపంచ కప్ 2027 నుంచి ఇంగ్లాండ్ ఔట్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.
Also Read : Team India Jersey : భారీగా పెరిగిన టీమిండియా జెర్సీ వ్యాల్యూ… ఒక్కో మ్యాచ్ కు ఎంత అంటే
ఇప్పటికే సోషల్ మీడియాలో ఇంగ్లాండ్ జట్టు ఔట్ అనే వార్తలే ఎక్కువగా వినిపిస్తున్నాయి. అయితే వన్డే క్రికెట్ లో ఒకప్పుడు తిరుగులేని ఆధిపత్యం చూపించిన ఇంగ్లాండ్ జట్టు ఇప్పుడు పీకల్లోతు కష్టాల్లో పడిందనే చెప్పవచ్చు. ముఖ్యంగా 2019 వన్డే వరల్డ్ కప్ విజయం సాధించిన తరువాత కూడా ఆ జట్టు 2027లో జరిగే ప్రపంచ కప్ కి అర్హత సాధించలేని పరిస్థితిలో ఉందంటేనే అర్థం చేసుకోవచ్చు. ఇంగ్లాండ్ జట్టు వరల్డ్ కప్ కి నేరుగా అర్హత సాధించలేని ప్రమాదంలో చిక్కుకుంది. ఇందుకు ఐసీసీ ర్యాంకింగ్స్ లో ఇంగ్లండ్ జట్టు వెనక్కి పడిపోవడమే ప్రధాన కారణం అని బలంగా చెప్పవచ్చు. 2019 తరువాత ఆడిన డిఫెండింగ్ ఛాంపియన్ 2023 పేలవ ప్రదర్శన కనబరిచింది. ముఖ్యంగా లీగ్ దశలోనే నిష్క్రమించడం గమనార్హం. ఇక తరువాత కూడా వన్డే క్రికెట్ లో చెత్త ప్రదర్శన కనబరుస్తూ వస్తోంది. దీంతో వన్డే వార్షిక ర్యాంకింగ్స్ లో ఇంగ్లండ్ జట్టు 8వ స్థానానికి పడిపోయింది.
అప్పుడు నెంబర్ వన్.. ఇప్పుడు చీకటి అధ్యాయం..!
2027లో వరల్డ్ కప్ ఆతిథ్య దేశాలు సౌతాఫ్రికా, జింబాబ్వే జట్లు నేరుగా అర్హత సాధిస్తాయి. వాటితో పాటు ఐసీసీ ర్యాంకింగ్స్ లో టాప్ 8 లో నిలిచిన జట్లు అన్ని నేరుగా క్వాలిఫై అవుతాయి. ఇంగ్లండ్ ప్రస్తుతం 8వ స్థానంలో ఉన్నప్పటికీ.. సౌతాఫ్రికా, జింబాబ్వే జట్లు ఆతిథ్య హోదాలో స్థానం కల్పిస్తే.. ఇంగ్లాండ్ 9వ స్థానానికి పరిమితం అవుతుంది. దీంతో వరల్డ్ కప్ 2027 కి నేరుగా అర్హత సాధించే అవకాశం లేకుండా పోయింది. ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్ లో ప్రస్తుతం అప్గానిస్తాన్ జట్టు 7వ స్థానంలో కొనసాగుతుండగా.. ఇంగ్లాండ్ జట్టు 8వ స్థానంలో కొనసాగుతోంది. ఇక అప్గానిస్తాన్ జట్టు 25 మ్యాచ్ లు ఆడి 2279 పాయింట్లతో పాటు 91 రేటింగ్ తో 7వ స్థానానికి దూసుకెళ్లింది. ఇంగ్లాండ్ జట్టు 35 మ్యాచ్ లు ఆడి 3051 పాయింట్లతో పాటు 87 రేటింగ్ తో 8 వ స్థానంలో కొనసాగుతోంది. ఒకప్పుడు వరల్డ్ క్రికెట్ లోనే నెంబర్ వన్ గా కొనసాగిన ఇంగ్లాండ్ జట్టు.. ప్రస్తుతం క్రికెట్ చరిత్రలో చీకటి అధ్యాయంగా మిగిలిపోయే ప్రమాదం పొంచి ఉంది. యాజమాన్యం స్పందించి ఆటగాళ్లను గాడిన పెట్టకపోతే ఇంగ్లాండ్ జట్టుకు ఇబ్బందులు తప్పవని పలువురు క్రీడా విశ్లేషకులు పేర్కొంటున్నారు.