మహిళల పట్ల ముస్లీం సమాజంలో మగాళ్లు ఎంత దారుణంగా ఉంటారో అఫ్ఘనిస్తాన్ లో ప్రత్యేక్షంగా కనిపిస్తోంది. మహిళలు అంటే ఎంత చులకన, ఎంత చిన్నచూపు అనేది అర్థం అవుతుంది. తాజాగా సంభవించిన భారీ భూకంపం నేపథ్యంలో అప్ఘనిస్తాన్ అతలాకుతలం అయ్యింది. వేలాది ఇళ్లు కూలిపోయాయి. ఎక్కడ చూసినా శిథిలాల కింద శవాల దిబ్బలే కనిపిస్తున్నాయి. ఇప్పటి వరకు ఏకంగా 2,200 మంది చనిపోయారు. ఎంతో మంది గాయపడ్డారు. రాత్రిపూట భూకంపం రావడంతో అందరూ ఇళ్లలోనే ఉన్నారు. ఫలితంగా ఇళ్లు కూలి చాలా మంది సజీవ సమాధి అయ్యారు. శిథిలాల తొలిగింపు ప్రక్రియ ఇప్పటికీ కొనసాగుతోంది.
శిథిలాల తొలిగింపు ప్రక్రియ కొనసాగుతున్న నేపథ్యంలో పలు చోట్ల మహిళలు కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతున్నా, చాలా మంది మగాళ్లు వాళ్లను కాపాడే ప్రయత్నం చేయడం లేదు. వారిని అలాగే వదిలేస్తున్నారు. ముస్లీం సంప్రదాయం ప్రకారం మగాళ్లు మహిళలను తాకకూడదు. దానిని దృష్టిలో పెట్టుకుని శిథిలాల కింద ఉన్న వారిని కూడా బయటకు తీయడం లేదు. చనిపోయిన వారి మృతదేహాలను కూడా వారి దుస్తులతో బయటకు లాగుతున్నారు. అత్యంత అమానుషంగా ప్రవర్తిస్తున్నారు. నిజానికి తాలిబన్ల పాలనలో మహిళలపై కఠిన ఆంక్షలు ఉన్నాయి. వారు ఇతర మగాళ్లను చూడకూడదు. ఇతర మగాళ్లు మహిళలను తాకకూడదు అనే నియమాలు ఉన్నాయి. ఈ లింగ నియమాలు సహాయక చర్యలు అడ్డంకులుగా మారాయి.
ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ లు గాయపడిన పురుషులు, పిల్లలను వెంటనే బయటకు తీసినప్పటికీ, మహిళలు, యువతులను పట్టించుకోవడం లేదు. చాలా మంది మహిళలు, యువతులు గాయాలతో అరిగోసపడుతున్నారు. గాయపడిన మహిళలకు చికిత్స అందించే విషయంలోనూ వివక్ష చూపిస్తున్నారు. పురుషులు, పిల్లలకు చికిత్స అందించిన తర్వాతే మహిళలకు అందిస్తున్నారు. మహిళలను వేరుగా కూర్చోబెడుతున్నారు. కుటుంబ సభ్యులు లేని సమయంలో రెస్క్యూ బృందాలు చనిపోయిన మహిళలను తాకకుండా వారి దుస్తులను పట్టుకుని బయటకు లాగుతున్నారు.
గత నాలుగు సంవత్సరాలుగా అప్షన్ లో ప్రభుత్వాన్ని నడుపుతున్న తాలిబన్లు, మహిళల మీద తీవ్ర ఆంక్షలు విధిస్తున్నారు. వారి ప్రాథమిక హక్కులను కూడా కాలరాస్తున్నారు. ఆరవ తరగతి తర్వాత పాఠశాల విద్యపై నిషేధం విధించారు. ఆఫ్ఘనిస్తాన్‌లో మహిళలు పురుష సహచరుడు లేకుండా చాలా దూరం ప్రయాణించడానికి కూడా అనుమతించారు. వారికి ఉద్యోగం చేసే అవకాశం కూడా లేదు. దీని ప్రభావం ప్రస్తుత భూకంపం తరువాత మరింత స్పష్టంగా కనిపిస్తోంది. ఐక్యరాజ్యసమితికి సంబంధించిన ఏజెన్సీలలో పనిచేస్తున్న ఆఫ్ఘన్ మహిళలు గతంలో అనేకసార్లు వేధింపులను ఎదుర్కొన్నారు. మహిళా ఉద్యోగులను తాత్కాలికంగా ఇంటి నుండి పని చేయడానికి పంపమని బెదిరింపులు వచ్చాయి.
ఇక ఆదివారం నాడు తెల్లవారుజామున భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై తీవ్రత 6గా నమోదయ్యింది. ఈ ప్రకృతి విపత్తులో ఇప్పటి వరకు 2,200 మంది చనిపోయినట్లు అప్ఘన్ ప్రభుత్వం వెల్లడించింది. మరో 3,600 మంది గాయపడినట్లు తెలిపింది. అయితే, వీరిలో మహిళలు ఎంత మంది, పురుషులు ఎంత మంది, పిల్లలు ఎంత మంది అనే విషయాన్ని వెల్లడించలేదు.
Read Also: ఆ ముగ్గురు కలిస్తే తట్టుకోవడం కష్టమే.. భయంలో ట్రంప్