BigTV English

Health Benefits: బిర్యాని ఆకుతో బోలెడు ప్రయోజనాలు.. ఒక్కసారి వాడితే మంచి ఫలితాలు

Health Benefits: బిర్యాని ఆకుతో బోలెడు ప్రయోజనాలు.. ఒక్కసారి వాడితే మంచి ఫలితాలు

Health Benefits: బిర్యానీ వంటకాలలో ఉపయోగించే ఆకులు, ఎక్కువగా మనం రుచి కోసం మాత్రమే వాడుతాము. కానీ ఆ చిన్న ఆకుల్లో ఆశ్చర్యకరమైన ఆరోగ్య లక్షణాలు ఉన్నాయి. ఈ ఆకులను నీటిలో వేసి మరిగించి, ఆ నీటిని తాగడం ద్వారా మన శరీరం అనేక రకాల ప్రయోజనాలు ఉంటాయని మీకు తెలుసా? దీనిపై ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాం.


బిర్యానీ ఆకులు నీరు కడుపులోని సమస్యలకు చాలా ఉపశమనం కలిగిస్తుంది. అజీర్ణం, గ్యాస్, కడుపులో మంట, ఉబ్బసం లాంటి సమస్యలు తగ్గుతాయి. ఈ నీరు తాగడం వలన కడుపు సౌకర్యంగా మారి, జీర్ణక్రియ సులభంగా జరుగుతుంది. అంతే కాక, బరువు నియంత్రణలో కూడా సహాయపడుతుంది. జలుబు, ఫ్లూ వంటి సమస్యల నుంచి బయటపడటంలో ఈ నీరు సహాయపడుతుంది. ఆకులలోని సహజ సమ్మేళనాలు రోగనిరోధక శక్తిని పెంచి, శరీరంలో వైరస్‌లను ఎదుర్కోవడానికి శక్తిని ఇస్తాయి. దీంతో శరీరం త్వరగా కోలుకోవడం, అలసట తగ్గడం, శ్వాసకోశాలు సరిగ్గా పనిచేయడానికి ఈ నీరు తాగడం వల్ల సాధ్యమతుంది.

Also Read: Hyderabad Metro: హైదరాబాదీలకు భారీ గుడ్ న్యూస్.. ఆ రోజు అర్ధరాత్రి ఒంటి గంట వరకు మెట్రో సేవలు


ఈ నీరు రోజూ తాగితే రక్త కణాల బలహీనత తగ్గించి, క్యాన్సర్ కణాల వృద్ధిని అడ్డుకోవడానికి సహాయపడుతుంది. ఇది పూర్తి స్థాయిలో సహజ మైన మార్గం, ఎలాంటి రసాయనాలు అవసరం లేకుండా, శరీరానికి హాని కలిగించకుండా ఆరోగ్యాన్ని రక్షిస్తుంది. ఈ చిన్న బిర్యానీ ఆకులు మన ఆరోగ్యానికి మంచి టానిక్ లా పనిచేసి అనారోగ్యం నుంచి కాపాడతాయి. అలసట, అనారోగ్యం సమస్యలు ఉన్నవారు రోజూ ఈ నీటిని అలవాటుగా చేసుకుంటే, శరీరానికి శక్తి, రక్షణ అందించే ఒక శక్తివంతమైన మార్గంగా ఉపయోగపడుతుంది. ఈ నీరు మరిగించి తాగడం వలన డిప్రెషన్‌ని దూరం అవుతుంది. అంతే కాకుండా రాత్రి పూట ఈ నీటిని తాగితే మంచి నిద్రను మీ సొంతం చేసుకోవచ్చు. ఇది బిర్యానీలో వేసి తినడమే కాదు.. ఈ ఆకును నీటిలో కాసేపు మరిగించి తాగితే మన ఆరోగ్యానికి మంచిదని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.

Related News

Skin Glow: నేచురల్‌గానే.. ముఖం మెరిసిపోవాలంటే ?

Curd vs Buttermilk:పెరుగు Vs మజ్జిగ.. రెండిట్లో ఏది బెటర్ ?

Mustard infusion: ఆవాల కషాయం అంత మంచిదా? దీని తయారీ చాలా సింపుల్!

Kidney Disease: కిడ్నీలు పాడయ్యాయని తెలిపే.. సంకేతాలు ఇవే !

Watermelon Seeds: రోజుకో స్పూన్ పుచ్చకాయ గింజలు.. ఇన్ని ప్రయోజనాలా ?

Big Stories

×