Aloe Vera Juice: ఆయుర్వేదంలో కలబందను ఒక అద్భుత ఔషధంగా పరిగణిస్తారు. దీని గుజ్జు నుంచి తీసిన రసం అనేక వ్యాధులతో పోరాడటానికి, అంతే కాకుండా శరీరం లోపల నుండచి హాని కలిగించే పదార్థాలను తొలగించడానికి సహాయపడుతుంది. ఉదయం ఖాళీ కడుపుతో ఒక చిన్న గ్లాసు కలబంద జ్యూస్ తాగడం ఆరోగ్యానికి చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. ఇందులో విటమిన్లు ఎ, సి, ఇ, ఫోలేట్, కాల్షియం, మెగ్నీషియం, యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి.
కలబంద జ్యూస్ రోగనిరోధక శక్తిని బలోపేతం చేయడమే కాకుండా.. చర్మం, జుట్టు, జీర్ణక్రియ సంబంధిత సమస్యలను తగ్గించడంలో కూడా ప్రభావవంతంగా పనిచేస్తుంది. దీని యాంటీ బాక్టీరియల్, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు శరీరంలో మంటను తగ్గిస్తాయి. అంతే కాకుండా కణాలను మరమ్మతు చేయడంలో సహాయపడతాయి. కలబంద జ్యూస్ తాగడం వల్ల ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయనే విషయాలను గురించిన పూర్తి వివరాలతో పాటు.. దీనిని త్రాగడానికి సరైన మార్గాన్ని ఇప్పుడు తెలుసుకుందాం.
కలబంద జ్యూస్ ప్రయోజనాలు:
1. జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది:
కలబంద జ్యూస్‌లో ఉండే ఎంజైమ్‌లు జీర్ణక్రియను మెరుగుపరచడంలో సహాయపడతాయి. ఇది మలబద్ధకం, గ్యాస్ , ఆమ్లత్వం నుంచి ఉపశమనం కలిగిస్తుంది. దీనిలో ఉండే లేటెక్స్ కాలేయాన్ని డీటాక్స్ చేసి పేగులను శుభ్రపరుస్తుంది. ప్రతి రోజు ఉదయం దీనిని తీసుకోవడం వల్ల కడుపు తేలికగా అనిపిస్తుంది.
2. చర్మాన్ని మెరిసేలా చేస్తుంది:
కలబంద జ్యూస్ చర్మాన్ని లోపలి నుంచి తేమగా చేస్తుంది. అంతే కాకుండా అవసరం అయిన పోషణను అందిస్తుంది. ఇది మొటిమలు, మచ్చలు అంతే కాకుండా డ్రై స్కిన్ సమస్యల నుంచి బయటపడటానికి సహాయపడుతుంది. కలబందలో ఉండే విటమిన్ సి, ఇ చర్మ కణాలను మరమ్మతు చేసి, దానిని ప్రకాశవంతంగా మారుస్తుంది. అంతే కాకుండా ఇది డీహైడ్రేషన్‌కు కూడా బాగా పనిచేస్తుంది. దీని కారణంగా చర్మం మెరుస్తూ ఉంటుంది.
3. రోగనిరోధక వ్యవస్థను బలపరుస్తుంది:
కలబంద జ్యూస్‌లో యాంటీఆక్సిడెంట్లు, యాంటీ బాక్టీరియల్ అంశాలు ఉంటాయి. ఇవి శరీర రోగనిరోధక శక్తిని పెంచుతాయి. ఇది ఫ్రీ రాడికల్స్‌తో పోరాడటానికి అంతే కాకుండా కాలానుగుణ వ్యాధులను కూడా నివారిస్తుంది. ఇందులో ఉండే జింక్ , విటమిన్ సి శరీరాన్ని ఇన్ఫెక్షన్ల నుంచి రక్షించడంలో సహాయపడతాయి.
4. జుట్టుకు మేలు చేస్తుంది:
కలబంద జ్యూస్ జుట్టు మూలాలకు పోషణనిస్తుంది. అంతే కాకుండా జుట్టు రాలడాన్ని నివారిస్తుంది. దీనిలో ఉండే ఎంజైమ్‌లు చుండ్రు, తలపై దురదను తగ్గిస్తాయి. ఇది జుట్టును బలంగా, మెరిసేలా చేస్తుంది. దీనిని తరచుగా తాగడం వల్ల జుట్టు పెరుగుదల బాగుటుంది. అంతే కాకుండా కలబంద జ్యూస్ తెల్ల జుట్టు రాకుండా చేయడంలో కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది.
5. బరువు తగ్గడంలో సహాయపడుతుంది:
కలబంద జ్యూస్ జీవక్రియను వేగవంతం చేస్తుంది. అంతే కాకుండా శరీరంలో పేరుకుపోయిన వ్యర్థ పదార్థాలను కూడా తొలగిస్తుంది. ఇది ఆకలిని నియంత్రిస్తుంది. అంతే కాకుండా తరచుగా తినాలనే కోరికను కూడా తగ్గిస్తుంది. కలబంద జ్యూస్ తాగుతూ వ్యాయామం చేయడం వల్ల బరువు తగ్గడంలో మంచి ఫలితాలు లభిస్తాయి.
Also Read: డైలీ ఈ సీడ్స్ తింటే.. జుట్టు వద్దన్నా పెరుగుతుంది
కలబంద జ్యూస్ తాగడానికి సరైన మార్గం:
1.ప్రతి ఉదయం ఖాళీ కడుపుతో పావు కప్పు (20-30ml) కలబంద రసాన్ని గోరువెచ్చని నీటితో కలిపి తీసుకోండి.
2.రుచిని మెరుగుపరచడానికి దీనికి కాస్త నిమ్మరసం లేదా తేనె కలుపుకోవచ్చు.
3.ఎక్కువ మోతాదులో కలబంద జ్యూస్ తాగితే.. కడుపు నొప్పి లేదా విరేచనాలకు అయ్యే ప్రమాదం కూడా ఉంటుంది. కాబట్టి పరిమిత పరిమాణంలో మాత్రమే తీసుకోండి.