E-Paper
Advertisement

OTT Movie: తండ్రి కోసం తన జీవితాన్ని త్యాగం చేసే కూతురు.. పెళ్లి కాకుండానే ప్రియుడితో అలా..

OTT Movie: తండ్రి కోసం తన జీవితాన్ని త్యాగం చేసే కూతురు.. పెళ్లి కాకుండానే ప్రియుడితో అలా..
Advertisement

OTT Movie: కొన్ని బెంగాళీ సినిమాలు భలే కళాత్మకంగా.. వాస్తవానికి దగ్గరగా ఉంటాయి. చెప్పాల్సిన విషయాన్ని ఏ మాత్రం దాపరికం లేకుండా చాలా డేరింగ్‌గా చెబుతారు. అలాంటి సినిమానే ‘సాంఝ్‌బతీర్ రూప్‌కథారా’ (Saanjhbatir Rupkathara). 2002లో వచ్చిన ఈ మూవీ అప్పట్లో ఓ సంచలనం. సాధారణంగా ఫ్యామిలీ మూవీస్ అంటే.. పిల్లలతో కూడా చూడొచ్చని అనుకుంటాం. కానీ, ఈ బెంగాళీ ఫ్యామిలీ మూవీ మాత్రం పిల్లలతో చూడకూడదు.

Advertisement

ఇదీ కథ:

కోల్‌కతా నగరంలో సాంఝ్‌బతీ (ఇంద్రాణీ హల్దార్) అనే యువతి జీవిస్తుంది. కవిత్వాత్మకమైన ఆలోచనలతో ఎప్పుడూ కలల్లో విహరిస్తూ ఉంటుంది. సాంఝ్‌బతీ తనకి తండ్రి రాజు (సౌమిత్ర చటర్జీ) అంటే ప్రాణం. రాజు ఒక సాధారణ మధ్యతరగతి వ్యక్తి. ఒకప్పుడు ఆదర్శవాదిగా ఉండేవాడు. కానీ జీవితంలోని బాధ్యతలు, నిరాశలతో క్రమంగా మారిపోతాడు.

Advertisement

సాంఝ్‌బతీ తన చిన్ననాటి స్నేహితుడు అరుణ్ (పార్థసారథి దేబ్)ను ప్రేమిస్తుంది. అరుణ్ సాంఝ్‌బతీ కలలను అర్థం చేసుకుని సాకారం చేయాలని అనుకుంటాడు. సాంఝ్‌బతీ తల్లి (సుచిత్రా మిత్రా) ఒక సాంప్రదాయక మహిళ. కానీ ఆమె భర్త రాజు తనకంటే కూతురు సాంఝ్‌బతీకే ఎక్కువ ప్రాధాన్యమిస్తాడు. దానివల్ల ఇబ్బంది పడుతుంది. సాంఝ్‌బతీ తన తండ్రి గత జీవితం గురించి, అతని కలల గురించి తెలుసుకోవడానికి ఆసక్తి చూపిస్తుంది. ఆమె తండ్రి రాజు రాసిన కవితలు ఆమెను ఎంతగానో ఆకర్షిస్తాయి.

రాజు తన కూతురు స్వేచ్ఛగా జీవించాలని కోరుకుంటాడు. కానీ అదే సమయంలో సమాజం విధించే నియమాలు, కుటుంబ బాధ్యతలు అతన్ని కట్టిపడేస్తాయి. సాంఝ్‌బతీ తన ప్రేమికుడు అరుణ్‌తో తన భవిష్యత్తును ఊహించుకుంటుంది. కానీ ఆమె తండ్రి యొక్క అసంతృప్త జీవితం, అతని ఆరోగ్య సమస్యలు ఆమెను భావోద్వేగంగా కుంగదీస్తాయి. ఆమె తన కలలను అనుసరించాలా లేక తండ్రి కోసం తన జీవితాన్ని త్యాగం చేయాలా అనే ఆలోచనలో పడుతుంది. చివరికి, సాంఝ్‌బతీ తన జీవితంలో ఒక కీలకమైన నిర్ణయం తీసుకోవాల్సి వస్తుంది. కానీ, ఆ విషయాన్ని సినిమాలో అస్పష్టంగా చూపిస్తారు. ఈ మూవీలో సహజమైన రొమాంటిక్స్ సీన్స్ ఉంటాయి. ఈ మూవీ ప్రస్తుతం Amazon Prime Videoలో స్ట్రీమింగ్ అవుతోంది.

Also Read: OTT Movie: పెళ్లికాని అర్చన పాట్లు.. కడుపుబ్బా నవ్వించే ఈ మలయాళం మూవీ అస్సలు మిస్ కావద్దు!

Related News

Weekend OTT Movies: వీకెండ్ సినిమాల సందడి.. వీటిని అస్సలు మిస్ అవ్వొద్దు..

రెండు రోజుల్లో నలుగురి మర్డర్… నిమిషానికో ట్విస్ట్ ఉన్న సైకలాజికల్ క్రైమ్ థ్రిల్లర్

తల్లి టూర్లో, తండ్రికి చుక్కలు చూపించే పిల్లలు… పర్ఫెక్ట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్

క్రేజీ సిరీస్ కు సినిమాతో ఎండ్ కార్డు… లాంగ్-డిస్టెన్స్ రిలేషన్‌షిప్లో ఉన్నవాళ్ళు డోంట్ మిస్

చెరువులో బాలుడి శవం… దేవుడికి ఆచారాల పేరుతో గుండె జారిపోయే పనులు

తండ్రి చావుకు కారణమైన వాళ్ళను వేటాడే ఖతర్నాక్ లేడీ… యాక్షన్ తో పిచ్చెక్కించే మూవీ

తండ్రికి మించిన తనయుడు… కానీ తలనొప్పే… మిస్ అవ్వకుండా చూడాల్సిన స్పోర్ట్స్ కామెడీ సిరీస్

ఫ్రెండ్ లైఫ్ లోకి అమ్మాయి వచ్చిందనే ద్వేషంతో ఇదేం పని ? నిబ్బా నిబ్బీలు డోంట్ మిస్

Big Stories

Advertisement
×