Pulasa Fish: వర్షాకాలం సీజన్ వస్తేచాలు పులస చేప సందడి అంతా ఇంతా కాదు. పులస చేపల రుచి వేరు. అరుదుగా లభించే ఈ చేపలకు మార్కెట్లో డిమాండ్ ఓ రేంజ్ లో ఉంటుంది. వాటిని కొనుగోలు చేసేందుకు చేపల ప్రియులు ఎగబడతారు. తాజాగా ఆదివారం యానాం మార్కెట్లో కిలో పులస చేప వేలంలో 22 వేల రూపాయల వరకు వెళ్లింది. చేప రుచి ఏమోగానీ, ఈ సీజన్‌లో ఇదొక రికార్డుగా చెబుతున్నారు.
పుస్తెలు అమ్మైనా సరే పులస చేప తినాలని కోరుకుంటారు చాలామంది చేపల ప్రియులు. వర్షాకాలం వస్తేచాలు ఉభయగోదావరి జిల్లాల్లో ఎర్ర నీటికి పులస సముద్రం నుంచి గోదావరిలోకి ఎంట్రీ ఇస్తుంది. పులస చేపను తిన్నవాళ్లు రోజుల తరబడి ఊరంతా దాని గురించే చెప్పుకుంటారు. గోదావరి ప్రజలకు ఇష్టమైన పులసల చేప సీజన్ మొదలైంది.
భారీ వర్షాలతో గోదావరికి వరద పోటెత్తుతోంది. ఈ క్రమంలో వలలకు చిక్కుతున్నాయి పులసలు. యానాంలో అక్కడక్కడా పులసలు దొరుకుతున్నాయి. అక్కడి మార్కెట్‌లోకి పలువురు వ్యాపారులు పులసలను తెచ్చి విక్రయిస్తున్నారు. నదీ ప్రవాహానికి వేగంగా ఎదురీదడం ఈ చేప స్పెషల్. పులస చనిపోయినా రెండు రోజుల వరకు పాడవకుండా ఉంటుంది.
వేలం పాటలో పాల్గొన్న వ్యక్తుల ఆధారంగా రేటు హెచ్చుతగ్గులుంటాయి. సముద్రాని కి దగ్గరగా ఉండే యానాంతోపాటు మిగతా ప్రాంతాల్లో ఈసారి కిలో చేప 22 వేల వరకు వెళ్లింది. ఈ సీజన్‌లో ఇదే అత్యధిక ధర. ఈ చేపను మత్స్యకార మహిళ కొనుగోలు చేసింది. ఆ తర్వాత పులసను మరింత లాభానికి అమ్మినట్టు తెలుస్తోంది.
ALSO READ: విచారణలో మిథున్ రెడ్డి ఏం చెప్పారు? షాక్‌లో మాజీ మంత్రి పెద్దిరెడ్డి
ఈ సీజన్‌లో తొలి పులస చేప యానాం మార్కెట్‌లో 4 వేలు ధర పలికింది. చేపల ప్రియులు పోటీ పడడంతో మరో చేప 15 వేల వరకు వెళ్లింది. గతవారం దొరికిన రెండు పులస చేపలు ఒకటి 13 వేలు, మరొకటి 18 వేలలకు అమ్ముడుపోయాయి. ఈసారి ఏకంగా 22 వేలుకు వెళ్లికింది. మరో రెండునెలలపాటు యానాంలో పులసల సందడి కొనసాగనుంది.
వేర్వేరు రాష్ట్రాల్లో రకరకాల చేపలను ఇష్టంగా తింటుంటారు. ఆ మధ్య ఒడిషాలో ‘తెలియా భోలా’ చేపలు వలకు చిక్కాయి. ఈ చేపకు మార్కెట్‌లో డిమాండ్ అంతా ఇంతా కాదు. సాధారణంగా సముద్రంలో కనిపించే ఈ చేప.. ఆ మధ్య సముద్రానికి దగ్గరలో ఉన్న ఓ నదిలోకి వెళ్లడం మత్య్సకారులకు చిక్కడ జరిగిపోయింది.
బంగారు రంగులో కనిపించే ఈ చేప కిలో ఖరీదు 25 వేల నుంచి మొదలవుతుంది. బాలాసోర్‌లో ఓ మత్స్యకారుడికి 29 తెలియా భోలా చేపలు దొరికాయి. ఒక్కో చేప 20 కిలోలకు పైగా ఉంటుంది. వాటిని మార్కెట్లో అమ్మగా భారీగా డబ్బు సంపాదించాడు. దీంతో ఆ మత్య్సకారుడి జీవితం ఒక్కసారిగా మారిపోయింది.