BigTV English

OTT Movie : అమ్మాయిల మంచం కింద దూరి సైకో అరాచకం… నిమిషానికో ట్విస్ట్ ఉన్న కొరియన్ కిల్లర్ థ్రిల్లర్

OTT Movie : అమ్మాయిల మంచం కింద దూరి సైకో అరాచకం… నిమిషానికో ట్విస్ట్ ఉన్న కొరియన్ కిల్లర్ థ్రిల్లర్

OTT Movie : కొరియన్ సినిమాలు, సిరీస్ లు ఇండియన్ ఆడియన్స్ కి హాట్ కేకుల్లా మారాయి. మలయాళం సినిమాల తరువాత వీటిపై కూడా అభిమానం చూపిస్తున్నారు. మొదట రొమాంటిక్ స్టోరీలను, ఆతరువాత థ్రిల్లర్ స్టోరీలను చూడటానికి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఒక కొరియన్ థ్రిల్లర్ సినిమా ఊహించని ట్విస్టులతో మతి పోగొడుతోంది. ఒక ఒంటరి అమ్మాయిని వేధించే కిల్లర్ చుట్టూ ఈ స్టోరీ తిరుగుతుంది. చివరి వరకు సస్పెన్స్ తో టెన్షన్ పెట్టించే ఈ సినిమా ఓటీటీలో అందుబాటులో ఉంది. దీని పేరు ఏమిటి ? ఎందులో స్ట్రీమింగ్ అవుతుంది ? స్టోరీ ఏమిటి ? అనే వివరాల్లోకి వెళ్తే ..


కథలోకి వెళ్తే

సియోల్‌లోని ఒక అపార్ట్‌మెంట్‌లో ఒంటరిగా నివసించే జో క్యుంగ్-మిన్, బ్యాంక్‌లో తాత్కాలిక ఉద్యోగినిగా పనిచేస్తుంటుంది. ఒక రోజు రాత్రి ఇంటి డిజిటల్ డోర్ లాక్ కవర్ తెరిచి ఉన్నట్లు ఆమె గమనిస్తుంది. దాన్ని మార్చినప్పటికీ, ఎవరో రాత్రిపూట ఆమె డోర్ లాక్‌ను తెరవడానికి ప్రయత్నిస్తున్న శబ్దం వినిపిస్తుంది. భయపడిన క్యుంగ్-మిన్ పోలీసులకు ఫిర్యాదు చేస్తుంది. కానీ వాళ్ళు ఆమెను సీరియస్‌గా తీసుకోకుండా, తాగిన మత్తులో ఎవరో తప్పు డోర్ దగ్గరకు వచ్చి ఉంటారని అనుకుంటారు. ఆమె అపార్ట్‌మెంట్ బయట సిగరెట్ ముక్క, కీప్యాడ్‌పై తెలియని వేలిముద్రలు కనిపిస్తాయి. ఆమె ప్రతి ఉదయం తలతిరగడంతో మెళుకువలోకి వస్తుంటుంది. ఇది ఆమెను మరింత భయపెడుతుంది. ఆమె స్నేహితురాలు హ్యో-జూ ఈ సమయంలో తనకి సప్పోర్ట్ గా నిలుస్తుంది. కానీ ఒక రోజు క్యుంగ్ మిన్ అపార్ట్‌మెంట్‌లో ఒక సహోద్యోగి హత్యకు గురవుతుంది. పోలీసులు క్యుంగ్-మిన్‌పైనే అనుమానం వ్యక్తం చేస్తారు. ఈ ఘటన వెనుక అసలు రహస్యాలు తెలుసుకోవడానికి ఆమె సొంతంగా దర్యాప్తు ప్రారంభిస్తుంది.


క్యుంగ్-మిన్ దర్యాప్తులో, ఆమె బ్యాంక్ క్లయింట్, అపార్ట్‌మెంట్ సెక్యూరిటీ గార్డ్ హాన్ డాంగ్-హూన్ వంటి వ్యక్తులపై అనుమానం పడుతుంది. ఆమె నిద్రలో ఉన్నప్పుడు ఎవరో ఆమె గదిలోకి ప్రవేశించి, ఆమెపై మత్తులో ఉంచుతున్నట్లు తెలుస్తుంది. ఈ కారణంగానే ఆమెకు ఉదయం లేచినప్పుడు తలతిరగుతూ ఉంటుంది. డిటెక్టివ్ లీ ఈ కేసులో ఆమెకు సహాయం చేస్తాడు. కానీ అతని నిర్లక్ష్య వైఖరి క్యుంగ్-మిన్‌ను మరింత ఒంటరిగా చేస్తుంది. ఆమె నేరస్తున్ని గుర్తించే ప్రయత్నంలో, ఒక హోటల్‌లో ఉత్కంఠభరిత ఛేజ్ సీన్‌లో నిజమైన నేరస్థున్ని కనిపెడుతుంది. క్లైమాక్స్‌లో ఈ స్టోరీ ఒక షాకింగ్ ట్విస్ట్ తో ముగుస్తుంది. ఆ ట్విస్ట్ ఏమిటి ? ఆ నేరస్థుడు ఎవరు ? క్యుంగ్-మిన్ కు మత్తు ఇచ్చి ఏం చేసేవాడు ? అనే ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలనుకుంటే, ఈ సినిమాను మిస్ కాకుండా చుడండి.

రెండు ఓటీటీలలో స్ట్రీమింగ్

‘డోర్ లాక్'(Door lock) 2018లో విడుదలైన కొరియన్ సైకలాజికల్ థ్రిల్లర్ సినిమా. లీ క్వాన్ దర్శకత్వంలో, గొంగ్ హ్యో-జిన్ (జో క్యుంగ్-మిన్), కిమ్ యే-వోన్ (ఓ హ్యో-జూ), కిమ్ సుంగ్-ఓ (డిటెక్టివ్ లీ) ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ చిత్రం 2011 స్పానిష్ చిత్రం స్లీప్ టైట్ నుండి స్ఫూర్తి పొందింది. ఇది 2018 డిసెంబర్ 5న విడుదలై, 1 గంట 42 నిమిషాల రన్‌టైమ్‌తో IMDbలో 6.4/10 రేటింగ్ పొందింది. ఈ సినిమా నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్ వీడియోలో కొరియన్ ఆడియోతో, ఇంగ్లీష్, తెలుగు సబ్‌టైటిల్స్‌తో అందుబాటులో ఉంది.

Related News

OTT Movie: తండ్రి కోసం తన జీవితాన్ని త్యాగం చేసే కూతురు.. పెళ్లి కాకుండానే ప్రియుడితో అలా..

OTT Movie : కోట్లాది ప్రజల ప్రాణాలు గాల్లో… సీక్రెట్ ప్లేస్ లో దాక్కొని సినిమా చూసే దిక్కుమాలినోళ్లు… క్షణక్షణం ఉత్కంఠ

OTT Movie : బంగారం గొలుసు తీగ లాగితే మర్డర్ డొంక కదిలే… గ్రిప్పింగ్ స్టోరీ… ఇంటెన్స్ క్రైమ్ థ్రిల్లర్

OTT Movie : చావు ఇంట్లో ముసలావిడ చెవిదుద్దులు మిస్సింగ్… కట్ చేస్తే కళ్ళు తిరిగే ట్విస్టు… మస్ట్ వాచ్ తమిళ థ్రిల్లర్

Bakasura Restaurant OTT: నెల తిరగకుండానే ఓటీటీ స్ట్రీమింగ్ కి రాబోతున్న బకాసుర రెస్టారెంట్!

Big Stories

×