Bollywood: ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవరు ఊహించలేరు. అనుకోని విధంగా కొంతమంది మనుషులకు దూరం అవుతూ అనంత లోకాలకు చేరిపోతారు. ఈ మధ్య ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో వరుసగా చాలామంది శివైక్యం చెందుతున్నారు. ఒకరి తర్వాత ఒకరు లోకానికి దూరం అవుతూనే ఉన్నారు. కానీ నటుల ప్రత్యేకత ఏమిటంటే వాళ్ళు లేకపోయినా వాళ్ళు సినిమాల మాత్రం శాశ్వతం ఉంటాయి. ప్రస్తుతం బాలీవుడ్ లో విషాదఛాయలు అలుముకున్నాయి. బాలీవుడ్ పరిశ్రమ ఒక గొప్ప నటుడిని కోల్పోయింది.
ప్రముఖ బాలీవుడ్ నటుడు ఆశిష్ వారంగ్ కన్నుమూశారు. ఆశిష్.. సూర్యవంశి, దృశ్యం, మర్దానీ వంటి చిత్రాల్లో సహాయ పాత్రలతో గుర్తింపు పొందారు. హిందీతో పాటు మరాఠీ, దక్షిణాది చిత్రాల్లోనూ నటించారు. ఆయన అకస్మాత్తుగా మృతిచెందడం చిత్ర పరిశ్రమను విషాదంలో ముంచెత్తింది. ఆయన మృతి పట్ల పలువురు బాలీవుడ్ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు.
Also Read: Ar Muragadoss: ఇంక రిటైర్మెంట్ ఇచ్చేయండి బాసు, పెద్ద డైరెక్టర్లు వరుస ఫెయిల్యూర్స్