Spinach: వేసవి కాలంలో మన శరీరాన్ని చల్లగా ఉంచుకోవడం చాలా ముఖ్యం. వేసవిలో వేడి చేస్తే ఆ బాధ చాలా చెప్పుకోలేని పరిస్థితిగా ఉంటుంది. ఎండలో తిరిగితు ఎండ దెబ్బ తిగిలి ఎక్కువగా యూరిన్ మంట వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అయితే బచ్చలికూర మనకు చలువ చేస్తుంది. వేసవిలో ఏ ఆకుకూర తినాలా అని చూసే వారికి బచ్చలి కూర మంచి ఆహారం అని చెప్పవచ్చు. ఇది శరీరంలోని వేడిని తగ్గిస్తుంది. వేసవి తాపం నుంచి ఉపశమనాన్ని అందిస్తుంది.
బచ్చలి కూర ఉపయోగాలు..
ముఖ్యంగా బచ్చలి కూర శరీరానికి చాలా మంచిది. రక్తహీనత సమస్యతో బాధపడేవారికి బచ్చలి కూర దివ్య ఔషదంలా పని చేస్తుందని నిపుణులు చెబుతున్నారు. శరీరంలో రక్తం తక్కువగా ఉన్నవారు తమ రోజు వారి ఆహారంలో బచ్చలికూరను చేర్చుకుంటే ఈ సమస్య నుంచి త్వరగా బయటపడతారని సూచిస్తున్నారు. అధిక రక్తపోటు సమస్య ఉన్నవారికి బచ్చలికూర దివ్యౌషధంలా పనిచేస్తుంది. హైబీపీ పేషెంట్లు తమ రోజు వారి ఆహారంలో బచ్చలికూరను చేర్చుకుంటే రక్తపోటు నియంత్రణలో ఉంటుంది. బచ్చలి ఆకులను రసంగా కూడా చేసుకుని తాగుతుంటే.. రక్తపోటు అదుపులో ఉంటుంది. అంతేకాదు.. బచ్చలి కూర గుండెపోటు ప్రమాదాన్ని తగ్గిస్తుంది.
కొలెస్ట్రాల్ లెవెల్స్‌ను తగ్గిస్తుంది..
బచ్చలికూర ప్రతిరోజూ తీపుకోవడం వల్ల శరీరంలో అదనంగా పేరుకుపోయిన కొలెస్ట్రాల్ కరుగుతుంది. అలాగే శరీరంలోని కొలెస్ట్రాల్ లెవెల్స్‌ను కంట్రోల్లో ఉంచుతుంది. బచ్చలి కూరలో ఉండే కాల్షియం వల్ల ఎముకలను బలంగా మారుస్తుంది. అంతే కాకుండా దీనిలో విటమిన్ ఎ పుష్కలంగా ఉంటుంది. ఇది కంటి చూపును మెరుగుపరుస్తుంది. దీనిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు కంటి శుక్లం, వయస్సు సంబంధిత మచ్చల క్షీణత వంటి కంటి సమస్యల నుండి రక్షిస్తాయని సూచిస్తున్నారు.
Also Read:మందుబాబులు.. మందు తాగే ముందు కాసింత జాగ్రత్త..
మూత్రాశయ సమస్యలకు చెక్..
వేసవిలో ఏ ఆకుకూర తినాలి అని చూసే వారికి బచ్చలికూర మంచి ఆహారం అని చెప్పవచ్చు. ఇది శరీరంలో వేడిని తగ్గిస్తుంది. వేసవి తాపం నుంచి ఉపశమనం ఇస్తు్ంది. దీనిని కూరగా చేసుకొని తినవచ్చు లేదా రసంగా అయిన చేసుకొని తాగవచ్చు. బచ్చలికూరను తింటే యూరిన్ మంట, ఇన్ఫేక్షన్ వంట సమస్యలతో బాధపడేవారు దీనిని తీసుకోవచ్చని వైద్యులు తెలిపారు. అలాగే పైల్స్, కీళ్ల నొప్పులు వంటి సమస్యలతో బాధపడేవారు తప్పకుండా దీనిని తినాలని వైద్యులు హెచ్చరిస్తున్నారు.
రోగ నిరోధక శక్తిని పెంచుతుంది..
బచ్చలికూరలో సి విటమిన్ కూడా ఉంటుంది. ఇది రోగనిరోధక శక్తిన పెంచుతుంది. అలాగే చర్మాన్ని రక్షిస్తుంది. దీంతో రోగాలు రాకుండా మనల్ని రక్షిస్తుందంటున్నారు. ఈ ఆకుల్లో ఉండే కాల్షియం ఎముకలు, దంతాలను దృఢంగా, ఆరోగ్యంగా ఉంచుతుంది. అలాగే బీపీని అదుపులో ఉంచుతుంది, నీరసం, అలసటను తగ్గించి యాక్టివ్‌గా ఆరోగ్యంగా ఉంచుతుంది. అంతేకాకుండా బచ్చలికూరలో ఐరన్ ఎక్కువగా ఉండటం వల్ల కొత్త రక్తాన్ని తయారు చేయడంలో సహాయపడుతుంది. అందుకే తరచుగా బచ్చలికూరను తినడం వల్ల ఆరోగ్యంగా ఉంటారని వైద్యులు చెబుతున్నారు.
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘బిగ్ టీవీ’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.