BigTV English

Alcohol: మందుబాబులు.. మందు తాగే ముందు కాసింత జాగ్రత్త..

Alcohol: మందుబాబులు.. మందు తాగే ముందు కాసింత జాగ్రత్త..

Alcohol: మీరు మద్యం సేవిస్తున్నారా? అయితే ఇది మీ కోసమే.. మందబాబులు మందు తాగి మేమే మహారాజులం అనుకుంటారు. కానీ మందు తాగితే కలిగే ఆరోగ్య నష్టాల గురించి తెలుకోవడం వారికి అనివార్యం. మందు తాగవద్దు తాగితు చనిపోతారు అని ఆ బాటిల్ పైనా రాసి ఉన్న వినకుండా అందరు తాగుతుంటారు. మందు తాగడం వల్ల కాలేయం, గుండె, మెదడు మరియు ఇతర అవయవాలకు నష్టం కలిగిస్తుంది, అలాగే మానసిక ఆరోగ్య సమస్యలు మరియు ఇతర ప్రమాదాలకు దారితీస్తుందంటున్నారు.


మద్యం సేవించే వారికి ముఖ్య అంశాలు.

ప్రస్తుత రోజుల్లో మద్యం తాగడం అంటే ఫ్యాషన్ అయిపోయంది. దాని వాల్ల కలిగే అనర్థాలు తెలుసుకోలేకపోతున్నారు. కొంత కాలం క్రితం మగవారు మాత్రమే మందు తాగేవారు, కానీ ఇప్పడు ఆడవాళ్లు, చిన్న చిన్న పిల్లలు కూడా తాగుతున్నారు. మందు తాగితే నేను ఏదో సాధించినట్టు ఫీల్ అవుతున్నారు ప్రజలు. కానీ దానిని తాగిన తర్వాత వచ్చే పరిణామాలు మాత్రం తెలుసుకోలేక పోతున్నారు.


శరీరానికి కలిగించే హాని..

మీరు ఆల్కహాల్‌ను తాగినప్పుడు ఆహారాన్ని జీర్ణం చేసుకోలేరు. ఇది త్వరగా మీ రక్తప్రవాహంలోకి వెళ్లి మీ శరీరంలోని ప్రతి భాగానికి వ్యాపిస్తుంది. దీనిని తాగడం వల్ల మీ రక్తంలో షుగర్ లెవల్స్ పెరుగుతాయి. రోజూ మద్యం తాగడం వల్ల కాలేయానికి నష్టం కలుగుతుంది. అలాగే గుండె జబ్బులు, అధిక రక్తపోటు మరియు స్ట్రోక్ వచ్చే ప్రమాదాన్ని పెంచుతుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. దీంతో పాటుగా మెదడె పనితీరును దెబ్బతీసి, జ్ఞాపకశక్తి నష్టం మరియు శ్రద్ధ లోపానికి దారితీస్తుంది. రోజూ మద్యపానం సేవించడం వల్ల డిప్రెషన్, ఆందోళన మరియు మానసిక ఆరోగ్య సమస్యలకు దారితీస్తుంది.

Also Read: అయ్యబాబోయ్..! మండే ఎండలకు కూల్ డ్రింక్స్ తాగుతున్నారా..

బరువు పెరగడం..

మద్యం సేవించడం వల్ల ముఖ్యంగా బరువు ఎక్కువగా పెరిగే అవకాశాలు ఉన్నాయి. అలాగే మీరు మద్యం సేవించిన తర్వాత మీకు హ్యంగోవర్ రావచ్చు.. అంటే తలనొప్పి, తలతిరగడం, దాహం, వికారం, వాంతులు, కడుపు నొప్పి, అస్థిరత, అలసట వంటి అనేక రకాలు లక్షణాలు కనిపిస్తాయి. స్త్రీలు మద్యం సేవించడం వల్ల బుుతుచక్రం పై ప్రభావితం చూపుతుంది. అలాగే సంతానోత్పత్తి తగ్గుతుంది. మానసిక ఆరోగ్య పరిస్థితులు ఉన్నవారు మద్యపానంపై ఆధారపడటం వల్ల ప్రమాదం ఎక్కువగా ఉంటుందని వైద్యులు తెలిపుతున్నారు. మానసిక అనారోగ్యాల ప్రమాదం వారిలో ఆత్మహత్య ప్రమాదాన్ని కూడా పెంచుతుందంటున్నారు.

మద్యం వల్ల కలిగే అనర్థాలు..

ప్రస్తుతం మద్యం తాగే వారు బాగానే ఉంటారు కానీ.. దాని వల్ల వారు కుటుంబ సభ్యులు మరియు స్నేహితులకు చాలా పరిణామాలకు దారీ తీస్తుంది. వీరు మందు తాగి డ్రైవింగ్ చేస్తున్నప్పుడు, వారికి ఏదేని జరగని అనర్ధాం జరిగితే వారి కుటుంబ సభ్యులకు తీవ్రమైన నష్టం జరుగుతుంది. అలాగే మందు తాగే వారికి క్యాన్సర్ ప్రమాదం ప్రమాదం కూడా పెరుగుతుందని అధ్యయనంలో తెలింది. కావున వీలైనంత వరకు మద్యం సేవించడం తగ్గించి ఆరోగ్యంగా ఉండటం చాలా మంచిది. మీరు మద్యం తాగాలని అనుకున్న సమయంలో మీరు మీ పిల్లలను మీ తల్లదండ్రులను గుర్తు చేసుకోని తాగాలా వద్దా అని ఒక్క సారి ఆలోచించుకోవడం చాలా మంచిది.

గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘బిగ్ టీవీ’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.

 

 

Related News

Raksha Bandhan Wishes 2025: రాఖీ పండగ సందర్భంగా.. మీ తోబుట్టువులకు శుభాకాంక్షలు చెప్పండిలా !

Tan Removal Tips: ముఖం నల్లగా మారిందా ? ఇలా చేస్తే.. క్షణాల్లోనే గ్లోయింగ్ స్కిన్

Cinnamon water: ఖాళీ కడుపుతో దాల్చిన చెక్క నీరు తాగితే.. మతిపోయే లాభాలు !

Junk Food: పిజ్జా, బర్గర్‌లు తెగ తినేస్తున్నారా ? జాగ్రత్త !

Health Tips: ఒమేగా- 3 ఫ్యాటీ యాసిడ్స్‌తో చర్మం, జుట్టుకు బోలెడు లాభాలు !

Broccoli Benefits: బ్రోకలీ తింటున్నారా ? అయితే ఈ విషయాలు తెలుసుకోండి

Big Stories

×