Rice Water For Hair: పూర్వం రోజుల్లో మేము గంజి అన్నం తినడం వల్లే.. ఇప్పటికీ ఆరోగ్యంగా ఉన్నాం అని మన పెద్దేళ్లు చెబుతూ ఉంటారు. ఆ మాటలను ఖచ్చితంగా నమ్మి తీరాల్సిందే.. ఎందుకంటే.. బియ్యం కడిగిన వాటర్ లేదా, బియ్యం ఉడికించిన నీటి(గంజి)లో బోలెడు ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. వీటిలో అనేక రకాల విటమిన్స్, పోషకాలు పుష్కలంగా లభిస్తాయి. రైస్ వాటర్ ఆరోగ్యానికి, అందానికే కాదు, జుట్టు పెరుగుదలకు, తెల్లజుట్టును నివారించేందుకు అద్భుతంగా పనిచేస్తుంది. రైస్ వాటర్‌లో వీటిని కలిపి హెయిర్‌కి అప్లై చేయండి. మీకు ఖచ్చితంగా మంచి రిజల్ట్ కనిపిస్తాయి. రైస్ వాటర్‌ను రెగ్యులర్‌గా వాడటం వల్ల.. తెల్లజుట్టు రావడం ఆగిపోవడంతో పాటు, జుట్టు ఒత్తుగా, పొడవుగా పెరుగుతుంది. ఇంకెందుకు ఆలస్యం ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
కావాల్సిన పదార్ధాలు..
రైస్ వాటర్
మందారం పువ్వులు
కలబంద
విటమిన్ ఇ క్యాప్సూల్స్
గోరింటాకు పొడి
తయారు చేసుకునే విధానం..
ముందుగా స్టవ్ వెలిగించి కడాయి పెట్టి.. అందులో కప్పు రైస్ వాటర్, రెండు మందార పువ్వులు, కలబంద ముక్కలు వేసి బాగా నల్లగా వచ్చేంత వరకు 10 నిమిషాలు మరిగించండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ఈ మిశ్రమాన్ని వేరే గిన్నెలోకి వడకట్టుకోవాలి. తయారు చేసుకున్న వాటర్‌లో రెండు విటమిన్ ఇ క్యాప్సూల్స్, గోరింటాకు పొడి వేసి, చిక్కగా కలుపుకోవాలి. దీన్ని జుట్టు చివర్ల వరకు అప్లై చేసి, 40 నిమిషాల తర్వాత సాధారణ షాంపూతో తలస్నానం చెయ్యండి. క్రమంగా తెల్లజుట్టు రావడం ఆగిపోవడంతో పాటు.. జుట్టు ఒత్గుగా పొడవుగా పెరుగుతుంది కూడా.
Also Read: శరీరానికి రాసే మాయిశ్చరైజర్లను చలికాలంలో ముఖానికి రాయవచ్చా? లేక ప్రత్యేకంగా ఫేస్ క్రీమ్ వాడాలా?
తెల్లజుట్టు సమస్యలతో బాధపడుతున్నారా.. అయితే ఈ చిట్కా కూడా ఫాలో అవ్వండి. మీకు ఖచ్చితంగా ఉపయోగపడుతుంది. ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం..
కావాల్సిన పదార్ధాలు
బ్లాక్ సీడ్స్
అలోవెరా జెల్
కొబ్బరి నూనె
వాటర్
తయారు చేసుకునే విధానం..
ముందుగా ఐదు టేబుల్ స్పూన్ బ్లాక్ సీడ్స్ తీసుకుని, 10 నిమిషాల పాటు వేయించి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు బ్లాక్ సీడ్స్‌ను మిక్సీజార్‌లోకి వేసి.. మెత్తగా పొడి చేసుకోవాలి. దీన్ని చిన్న బౌల్‌లో తీసుకుని అందులో టేబుల్ స్పూన్ అలోవెరా జెల్, రెండు టేబుల్ స్పూన్ కొబ్బరి నూనె, చిటికెడు వాటర్ పోసి బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని తలకు అప్లై చేసి అరగంట తర్వాత తలస్నానం చెయ్యండి. ఇలా వారానికి రెండు, మూడు సార్లు చేస్తే.. క్రమంగా తెల్లజుట్టు రావడం ఆగిపోతుంది. బ్లాక్ సీడ్స్‌లో ఉండే పోషకాలు జుట్టుకు తగినంత పోషణను అందిస్తాయి. జుట్టు పెరుగుదలకు, చుండ్రు సమస్యలను నివారించేందుకు అద్భుతంగా పనిచేస్తుంది. మీరు కూడా ఈ చిట్కా ట్రై చేసి చూడండి.
గమనిక: వీటిని పాటించే ముందు తప్పకుండా నిపుణుల సలహా తీసుకోవాలి. ఈ వివరాలు కేవలం మీ అవగాహనకు మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘బిగ్ టీవీ’ బాధ్యత వహించదని గమనించగలరు.