Game Changer Story : గేమ్ ఛేంజర్… గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గేమ్ ఛేంజ్ చేసే మూవీ అవుతుందని మెగా ఫ్యాన్స్ గట్టిగా నమ్ముతున్నారు. అయితే ఈ సినిమా పై కేవలం నార్మల్ ఫ్యాన్స్‌కు మాత్రమే కాదు, మెగా ఫ్యాన్స్‌కి కూడా ఉన్న ఓ చిన్న అనుమానం… అదే నిజంగానే హిట్ అవుతుందా..? దీనికి కారణం మితిమీరిన బడ్జెట్.. దాని ఫలితంగా వచ్చిన భారీ టార్గెట్. అలాగే డైరెక్టర్ శంకర్ పనితనంపై విమర్శలు. ఇండియన్ 2 ఫలితం. వీటి వల్ల గేమ్ ఛేంజర్ ఫలితంపై ఫ్యాన్స్ ఎన్నో డౌట్స్ పుట్టుకొస్తున్నాయి. ఈ టైంలో గేమ్ ఛేంజర్ మూవీ స్టోరీ గురించి కొన్ని విషయాలు బయటికి వచ్చాయి. ఈ మూవీలో ఓ కట్టప్ప ఉన్నాడని, అలాగే మరి కొన్ని థ్రిల్లింగ్ విషయాలు ఉన్నాయని తెలుస్తుంది. అవి ఏంటో ఇప్పుడు చూద్దాం…
మెగా ఫ్యాన్స్ దాదాపు మూడేళ్ల నుంచి ఎదురుచూస్తున్న గేమ్ ఛేంజర్ మూవీ మరి కొన్ని గంటల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం ఇచ్చిన అనుమతితో అక్కడ బెనిఫెట్ షో ద్వారా గేమ్ ఛేంజర్ మూవీ అర్థరాత్రి 1 గంట నుంచే థియేటర్ లోకి రాబోతుంది. ఇక నైజాం ఏరియాతో పాటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రేపు ఉదయం 4 గంటల నుంచి ఆడియన్స్ గేమ్ ఛేంజర్ మూవీని చూడబోతున్నారు.
దాదాపు 500 కోట్ల భారీ బడ్జెట్‌తో వస్తున్న ఈ సినిమా ఎలా ఉంటుంది అనే టెన్షన్ మెగా అభిమానులతో పాటు నార్మల్ సినీ లవర్స్ లోనూ ఉందని చెప్పొచ్చు. అందుకే… ఈ మూవీ బుకింగ్స్ ఓపెన్ అయ్యాకా కొన్ని గంటల్లోనే టికెట్లు హాట్ కేకుల్లా అమ్ముడుపోతున్నాయి.
రామ్ చరణ్‌ను చంపే కట్టప్ప
ఇక సినిమా కథకు సంబంధించి కోలీవుడ్ నుంచి అనేక వార్తలు వస్తున్నాయి. Bigtvlive.com కి వచ్చిన తాజా సమాచారం ప్రకారం మూవీలో ఓ కట్టప్ప ఉన్నాడట. కట్టప్ప అంటే… బాహుబలి సినిమాలో హీరో పక్కనే ఉండి… వెన్నుపోటు పొడిచి చంపిన వ్యక్తి. అచ్చం అలాంటి వ్యక్తి గేమ్ ఛేంజర్ మూవీలో ఉంటారట.
అప్పన్న చనిపోయే సీన్…
గేమ్ ఛేంజర్‌లో ఇప్పటి రామ్ చరణ్ డ్యూయల్ రోల్ చేస్తున్నాడు. అందులో ఒక పాత్ర అప్పన్న. ఆయన కుమారుడు రామ్ నందన్ పాత్రను కూడా రామ్ చరణే చేస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. అయితే ఫస్టాఫ్ మొత్తం రామ్ నందన్ ఎంరట్‌టైన్‌మెంట్, యాక్షన్, డ్యాన్స్ ఉంటుందట. ఇక సెకండాఫ్ లో ఫ్లాష్ బ్యాక్. ఆ ఫ్లాష్ బ్యాక్‌లో ఐఏఎస్ రామ్ నందన్ తండ్రి అప్పన్న (రాజకీయ నాయకుడు) పాత్ర ఉంటుందట.
అప్పన్న ఓ రాజకీయ పార్టీని పెడుతాడట. అది ప్రజాలకు చాలా దగ్గర అవుతుందట. ఆ టైంలో సీటు కోసం… అప్పన్నను చంపేయాలని ఓ క్యారెక్టర్ చూస్తుందట. అలా అనుకున్నట్టే… అప్పన్నను ఆ క్యారెక్టర్ చంపేస్తుందట. ఆ క్యారెక్టర్ ఎవరు అనేది సినిమాలో కనిపించే అతి పెద్ద ట్విస్ట్ అనేది సమచారం.
మూవీలో సెకండాఫ్‌లో వచ్చే ఈ ట్వీస్ట్ సినిమాకు పెద్ద హైలైట్ గా ఉంటుందట. ఆ ట్విస్ట్ తర్వాత క్లైమాక్స్ భారీ స్థాయిలో ఉంటుందట. క్లైమాక్స్ విషయంలో శంకర్ మార్క్ కనిపిస్తుందట. మెగా ఫ్యాన్స్ మాత్రమే కాదు.. థియేటర్ లో ఉన్న వాళ్లు అందరూ క్లైమాక్స్ కి ఫిదా అయిపోతారని టాక్.
ఆ ట్విస్ట్ ఏంటి..?
ఆ కట్టప్ప పాత్ర ఏంటి..?
క్లైమాక్స్‌ను శంకర్ ఎలా డిజైన్ చేశాడు..?
అనేవి తెలుసుకోవాలంటే… రేపు థియేటర్ లో సినిమాను చూడాల్సిందే.