Vijay Devarakonda: ప్రముఖ టాలీవుడ్ నటుడు విజయ్ దేవరకొండ(Vijay Devarakonda) గత రెండు రోజులుగా పెద్ద ఎత్తున వార్తలలో నిలుస్తున్న సంగతి తెలిసిందే. విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న(Rashmika Mandanna)తో నిశ్చితార్థం జరుపుకున్నట్లు సోషల్ మీడియాలో వార్తలు వచ్చాయి. ఈ వార్తలకు అనుగుణంగానే వీరిద్దరూ కూడా కుటుంబ సభ్యుల సమక్షంలో అక్టోబర్ 4వ తేదీ ఎంతో ఘనంగా నిశ్చితార్థం జరుపుకున్నట్టు విజయ్ దేవరకొండ టీం కూడా వెల్లడించారు. ఇలా వీరిని నిశ్చితార్థం(Engagment) కి సంబంధించిన ఫోటోలు ఇప్పటివరకు బయటకు రాకపోవడంతో వీరి నుంచి ఎప్పుడు ఎలాంటి అప్డేట్ వస్తుందోనని అభిమానులు కూడా ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు.
ఇకపోతే ఎంగేజ్మెంట్ తర్వాత రష్మిక మీరందరూ దేనికోసం ఎదురు చూస్తున్నారో నాకు తెలుసు అంటూ ఆమె తన సినిమా విడుదల తేదీని ప్రకటించడంతో అభిమానులు కొంత నిరుత్సాహం వ్యక్తం చేశారు.. ఇక తాజాగా విజయ్ దేవరకొండ సైతం ఎంగేజ్మెంట్ తర్వాత మొదటిసారి తనకి ఎంతో ఇష్టమైన ప్రదేశానికి వెళ్లడంతో ఇందుకు సంబంధించిన వీడియోలు ఫోటోలు కాస్త సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. నిశ్చితార్థం తర్వాత విజయ్ దేవరకొండ తన కుటుంబంతో కలిసి శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తి(Puttaparthi)లోని ప్రశాంతి నిలయానికి వచ్చారు.
ఇలా ఈయన తన కుటుంబ సభ్యులతో కలిసి ప్రశాంతి నిలయానికి రావడంతో సత్యసాయి ట్రస్ట్ సభ్యులు విజయ్ దేవరకొండకు ఘనస్వాగతం పలకడమే కాకుండా… నిశ్చితార్థం జరిగినందుకు శుభాకాంక్షలు కూడా తెలియజేశారు. ఇక నేడు సాయంత్రం విజయ్ దేవరకొండ సత్యసాయి మహా సమాధిని దర్శించుకోనున్నారు. విజయ్ దేవరకొండ విద్యాభ్యాసం మొత్తం పుట్టపర్తిలోని సత్యసాయి విద్యాసంస్థల్లో చదువుకున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే పుట్టపర్తితో విజయ్ దేవరకొండకు ప్రత్యేకమైన అనుబంధం ఏర్పడింది. విజయ్ దేవరకొండ తరచూ పుట్టపర్తికి వచ్చి సత్యసాయి మహాసమాధిని దర్శించుకుంటూ ఉంటారు.
డెస్టినేషన్ వెడ్డింగ్..
ఇక నిశ్చితార్థం తర్వాత ఈయన మొదటిసారి రావడంతో ఈయన రాక ప్రాధాన్యతను సంతరించుకుంది. ఇక సాయంత్రం సత్యసాయి మహాసమాధి దర్శనం అనంతరం తిరిగి విజయ దేవరకొండ హైదరాబాద్ బయలుదేరనున్నట్లు సమాచారం. ఇక విజయ్ దేవరకొండ కెరియర్ విషయానికి వస్తే ఇటీవల కింగ్డమ్ సినిమా ద్వారా మంచి హిట్ అందుకున్న ఈయన తదుపరి సినిమా పనులలో బిజీగా ఉన్నారు. అయితే ఈయన వివాహం తర్వాతనే తదుపరి సినిమా షూటింగ్స్ లో పాల్గొంటారని తెలుస్తోంది. అక్టోబర్ 4వ తేదీ నిశ్చితార్థం జరుపుకున్న ఈ జంట 2026 ఫిబ్రవరిలో పెళ్లి చేసుకోబోతున్నట్టు తెలుస్తోంది. అయితే ఇప్పటివరకు వీరి పెళ్లికి సంబంధించిన ఏ వివరాలను ఎక్కడ వెల్లడించలేదు. అయితే ఈ జంట మాత్రం డెస్టినేషన్ వెడ్డింగ్ ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం. రష్మిక విజయ్ దేవరకొండ రెండు సినిమాలలో కలిసిన నటించారు. ఈ సినిమాల సమయంలోనే ప్రేమలో పడినట్లు తెలుస్తోంది. గత కొంతకాలంగా రిలేషన్ లో ఉన్న ఈ జంట త్వరలోనే పెళ్లి బంధంతో ఒకటి కానున్నారు.
Also Read: Vijay Devarakonda visit puttaparthi Sai Baba mandir after engagement