E-Paper
Advertisement

ఎక్కువ కాలం యవ్వనంగా, ఆరోగ్యంగా జీవించేందుకు ప్రతి రోజు ఇవి తినండి..

ఎక్కువ కాలం యవ్వనంగా, ఆరోగ్యంగా జీవించేందుకు ప్రతి రోజు ఇవి తినండి..
Advertisement

ప్రతి ఒక్కరూ ఎక్కువ కాలం ఆరోగ్యంగా, యవ్వనంగా జీవించాలని కోరుకుంటారు. అందుకోసం సరైన ఆహారం తీసుకోవడం చాలా ముఖ్యం. ముఖ్యంగా ఫ్రూట్స్ (పండ్లు) శరీరానికి అవసరమైన విటమిన్లు, ఖనిజాలు, యాంటీఆక్సిడెంట్లను అందిస్తాయి. కొన్ని పండ్లు క్రమం తప్పకుండా తింటే ఆరోగ్యం మెరుగుపడటమే కాకుండా, జీవితకాలం కూడా పెరిగే అవకాశం ఉందని పరిశోధనలు సూచిస్తున్నాయి. అందులో ముఖ్యంగా బ్లూబెర్రీస్, యాపిల్స్, అరటిపండ్లు ప్రత్యేక స్థానం పొందాయి.

బ్లూబెర్రీస్ రక్తనాళాలను ఆరోగ్యంగా ఉంచుతాయి

బ్లూబెర్రీలు సైజులో చిన్నవిగా కనిపించినా వాటిలో ఉన్న పోషకాలు చాలా శక్తివంతమైనవి. ఇవి యాంటీఆక్సిడెంట్లకు మంచి వనరు. శరీరంలో కణాలను దెబ్బతీసే హానికరమైన ఫ్రీ రాడికల్స్‌ తగ్గించడంలో ఇవి సహాయపడతాయి. బ్లూబెర్రీస్ రక్తప్రసరణను మెరుగుపరచి గుండె ఆరోగ్యాన్ని కాపాడతాయి. అంతేకాకుండా మెదడు పనితీరును మెరుగుపరచి జ్ఞాపకశక్తిని పెంచుతాయి. ఉదయం టిఫిన్‌లో లేదా స్నాక్‌గా వీటిని తీసుకోవచ్చు. తాజా బ్లూబెర్రీస్ అందుబాటులో లేకపోతే ఫ్రోజెన్ బ్లూబెర్రీలను కూడా ఉపయోగించవచ్చు.

చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించేందుకు యాపిల్స్ 

Advertisement

యాపిల్స్‌లో అధికంగా ఉండే ఫైబర్ శరీరంలోని చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించడంలో సహాయపడుతుంది. దీంతో గుండె ఆరోగ్యంగా ఉంటుంది. యాపిల్స్‌లోని పోషకాలు శరీరంలో వాపును తగ్గిస్తాయి. జీర్ణక్రియను మెరుగుపరచడంలో కూడా ఇవి ఉపయోగపడతాయి. బరువును నియంత్రించుకోవాలనుకునేవారికి యాపిల్ మంచి ఆప్షన్. యాపిల్ తొక్కలో కూడా ఎన్నో పోషకాలు ఉండటంతో తొక్కతోనే తినడం మంచిది.

అరటిపండ్లు శక్తి, పొటాషియంను అందిస్తాయి

అరటిపండ్లు సులభంగా లభించే, తక్కువ ఖర్చుతో లభించే ఆరోగ్యకరమైన పండ్లలో ఒకటి. వీటిలో పొటాషియం అధికంగా ఉంటుంది. ఇది రక్తపోటును (బిపి) నియంత్రించడంలో సహాయపడుతుంది. అరటిపండ్లు శరీరానికి తక్షణ శక్తిని అందిస్తాయి. కండరాల పనితీరు, ఎముకల బలం, జీర్ణక్రియకు కూడా ఇవి ఉపయోగపడతాయి. అలాగే మానసిక ఉల్లాసాన్ని పెంచడంలో కూడా సహాయపడతాయి.

Advertisement

Also Read: పది మందిలో మీరు ప్రత్యేకంగా కనిపిస్తారు.. మీ మాటలకు అందురూ ప్రాధాన్యం ఇవ్వాలంటే ఇలా చేయండి

ఈ మూడు పండ్లను కలిపి తింటే మరిన్ని ప్రయోజనాలు

బ్లూబెర్రీలు, యాపిల్స్, అరటిపండ్లు కలిసి శరీరానికి అవసరమైన అనేక పోషకాలను అందిస్తాయి. వీటిని క్రమం తప్పకుండా తింటే గుండె జబ్బులు, మధుమేహం వంటి వ్యాధుల ప్రమాదం తగ్గవచ్చు. రోగనిరోధక శక్తి పెరిగి.. శరీరం చురుకుగా ఉంటుంది. ఉదయం స్మూతీగా లేదా ఓట్స్, పెరుగు, సలాడ్‌లలో కలిపి తీసుకోవచ్చు.

ఆరోగ్యకరమైన జీవనానికి ఈ అలవాటు ఎంతో ఉపయోగకరం

ఖరీదైన సప్లిమెంట్లపై ఆధారపడాల్సిన అవసరం లేదు. ప్రకృతి మనకు అందించే ఈ మూడు పండ్లను ప్రతిరోజూ ఆహారంలో చేర్చుకుంటే ఆరోగ్యం మెరుగుపడుతుంది. మంచి నిద్ర, క్రమం తప్పని వ్యాయామంతో పాటు ఈ పండ్లను తీసుకోవడం వల్ల శరీరానికి మరింత మేలు జరుగుతుంది.

Related News

దోసె పిండి కోసం టెన్షన్ పడాల్సిన అవసరమే లేదు.. 5 రకాల ఇన్‌స్టంట్ దోసె రెసిపీలు

ఆడవాళ్లకు డిప్రెషన్.. మగవాళ్లకు హార్ట్ఎటాక్ రిస్క్.. డయాబెటిస్ వెనుక ఇంత కథ ఉందా?

తప్పు జరిగితే సహించరు.. ఈ తేదీల్లో పుట్టినవారు సూటిగా మాట్లాడుతారు

30 దాటిన ప్రతి మహిళ సప్లిమెంట్లు వాడాలా? ఈ విషయంలో నిపుణులు ఏమంటున్నారంటే..

టిఫిన్‌ బాక్స్‌లో పిల్లలు రుచికరమైన ఆహారం కావాలంటున్నారా? 10 నిమిషాల్లో తయారు చేసే 5 టేస్టీ రెసిపీలు మీ కోసం

మొటిమలు వచ్చాయని ఆత్మవిశ్వాసం కోల్పోకండి.. పర్ఫెక్ట్ స్కిన్‌కు నిజమైన అర్థం ఇదే

ఇంట్లో చేసిన టీ రుచికరంగా లేదా? ఎక్కువ మసాలాలు లేకుండా కడక్ చాయ్ చేయడానికి సింపుల్ టిప్స్

వంట గిన్నెలు, తవాలపై జిడ్డు మొండిగా ఉందా? సింపుల్‌గా క్లీన్ చేసే చిట్కా ఇదిగో

Big Stories

Advertisement
×