Dornakal Station: మొంథా తుఫాన్ ప్రభావంతో తెలంగాణలోని పలు చోట్ల భారీ వర్షాలు కురుస్తున్నాయి. మహబూబాబాద్ జిల్లాలో రైలు పట్టాలపైకి వరద నీరు చేరింది. డోర్నకల్ రైల్వే స్టేషన్‌లో పట్టాల పైనుంచి వరద నీరు ప్రవహిస్తుండటంతో రైళ్ల రాక పోకలు నిలిచిపోయాయి. దీంతో జలదిగ్భందంలోనే డోర్నకల్ జంక్షన్ ఉండిపోయింది. డోర్నకల్ రైల్వే స్టేషన్‌లో గోల్కొండ ఎక్స్‌ప్రెస్, గుండ్రాతి మడుగు రైల్వేస్టేషన్‌లో కోణార్క్ ఎక్స్‌ప్రెస్ లను అధికారులు నిలిపివేశారు. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మరోవైపు స్టేషన్‌ను ఎస్పీ సుధీర్ రామ్‌నాథ్ కేకన్, కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్ సందర్శించి పరిశీలించారు.