BigTV English
Advertisement

Thalavara OTT: బొల్లి వ్యాధితో బాధపడే హీరో.. అవమానాలు.. ఛీత్కారాలు.. కట్ చేస్తే!

Thalavara OTT: బొల్లి వ్యాధితో బాధపడే హీరో.. అవమానాలు.. ఛీత్కారాలు.. కట్ చేస్తే!

Thalavara OTT: అర్జున్ అశోకన్ నటించిన మలయాళ డ్రామా సినిమా తళవర థియేటర్లలో విడుదలైన రెండు నెలల తర్వాత ఓటీటిలో స్ట్రీమింగ్ కి వచ్చేసింది. ఈ సినిమాకి ప్రేక్షకుల నుండి మంచి స్పందన వచ్చినప్పటికీ బాక్సాఫీస్ వద్ద కలెక్షన్స్ సాధించలేకపోయింది. అలా ఆగస్టు 22న థియేటర్లలోకి వచ్చిన ఫీల్ గుడ్ డ్రామా మూవీ తళవర.. ఈరోజు నుండి అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీలో ప్రసారం అవుతోంది.ఇక తళవర మూవీని ప్రముఖ సినీ నిర్మాత మహేష్ నారాయణన్ సమర్పించగా.. ఈ మూవీకి అఖిల్ అనిల్ కుమార్ దర్శకత్వం వహించారు. హీరో అర్జున్ అశోకన్ బొల్లి వ్యాధితో బాధపడుతున్న వ్యక్తిగా కనిపించారు.


బొల్లి వ్యాధితో బాధపడుతున్న వ్యక్తి పాత్రలో..

అలా ఈ సినిమాలో బొల్లి వ్యాధితో బాధపడుతున్న అర్జున్ అశోకన్ చుట్టే స్టోరీ మొత్తం తిరుగుతుంది. బొల్లి వ్యాధితో సమాజంలో ఎన్నో అవమానాలను ఎదుర్కొన్నప్పటికీ చాలా ధైర్యంగా నిలబడతాడు హీరో. అలా ఈ సినిమా మొత్తం జ్యోతిష్ పాత్రలో నటించిన నటుడు అర్జున్ అశోకన్ చుట్టే తిరుగుతుంది..

ఆ సినిమా వల్లే ఈ సినిమా కలెక్షన్లకు గండి..

అయితే ఈ సినిమా విడుదలైన సమయంలో మలయాళంలో బ్లాక్ బస్టర్ హిట్ అయినటువంటి కళ్యాణి ప్రియదర్శన్ (Kalyani Priyadarshan) నటించిన ‘కొత్త లోక’ మూవీ ఆడుతుండడంతో ఈ సినిమా కలెక్షన్లకు గండి పడింది.ఒకవేళ కొత్త లోక మూవీ విడుదలకు కొన్ని రోజులు ముందుగానీ లేక విడుదలైన కొన్ని రోజుల తర్వాత గానీ తళవర మూవీని విడుదల చేసింటే కచ్చితంగా బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్స్ వచ్చేవి అని ఈ సినిమా చూసిన ప్రేక్షకులు అభిప్రాయపడుతున్నారు. అలా కొత్తలోక మూవీ వల్ల ఈ సినిమా కలెక్షన్లకు గండి పడినట్లు తెలుస్తోంది. మరి థియేటర్లలో పాజిటివ్ టాక్ వచ్చినా పెద్దగా హిట్ కాని ఈ సినిమాని ఓటీటీలో ప్రేక్షకులు ఏ విధంగా ఆదరిస్తారు అనేది చూడాలి.


also read:Chiranjeevi: మళ్లీ పోలీసులను ఆశ్రయించిన చిరంజీవి.. సామాన్యుల పరిస్థితేంటో ?

విమర్శకుల ప్రశంసలు అందుకున్న తళవర..

తళవర మూవీలో అర్జున్ అశోకన్ తో పాటు రేవతి శర్మ, షబిన్ బెన్సన్, సామ్ మోహన్, శరత్ సభా, అభిరామి రాధాకృష్ణన్, దేవదర్శిని, సోహన్ సీనూలాల్ లు కీలక పాత్రల్లో నటించారు. ఇక సినిమాకి విజయానంద్ మ్యూజిక్ అందించారు. అయితే ఈ సినిమాకి కలెక్షన్లు ఎక్కువగా రాకపోయినప్పటికీ విమర్శకుల ప్రశంసలు అందుకుంది.

తళవర మూవీపై ప్రముఖ హీరోయిన్ ప్రశంసలు..

ముఖ్యంగా ఈ సినిమా చూసిన మలయాళ నటి మమతా మోహన్ దాస్ సినిమా గురించి ఓ ఇంట్రెస్టింగ్ పోస్ట్ పెట్టింది.. అందులో ఏముందంటే..” రియల్ లైఫ్ లో సూపర్ హీరోలను ప్రతిబింబించే స్క్రిప్ట్ ని ఎంచుకున్న హీరో, డైరెక్టర్ ని ప్రశంసించాలి అనుకుంటున్నాను.. ఇలాంటి వ్యాధులతో ప్రతిరోజు ఎంతోమంది యుద్ధం చేస్తున్నారు. అలాగే ఈ సినిమాలో అర్జున్ అశోకన్ ధైర్యవంతమైన నటనను, డైరెక్టర్ అఖిల్ అనిల్ కుమార్ దర్శకత్వ ప్రతిభను కూడా ప్రశంసించాలి” అంటూ ఓ ఇంట్రెస్టింగ్ పోస్ట్ పెట్టింది. ఇక ఈ సినిమా స్టోరీ విషయానికి వస్తే బొల్లి వ్యాధితో బాధపడుతున్న హీరో.. సమాజం నుండి ఎన్నో ఛీత్కారాలు.. అవమానాలు ఎదుర్కొంటాడు. అయితే వాటన్నింటినీ ఎదుర్కొని సమాజానికి ఎలా బుద్ధి చెప్పాడు అనేదే ఈ సినిమా స్టోరీ.

Related News

OTT Movie : ఐఎండీబీలో 5.9 రేటింగే… కలెక్షన్లు మాత్రం 7000 కోట్లు… థియేటర్లలో దుమ్మురేపిన హాలీవుడ్ మూవీ ఓటీటీలోకి

OTT Movie : ఒంటరి పిల్ల ఒంటిపై చెయ్యేసి పాడు పని… ట్విస్టులతో మతిపోగొట్టే మలయాళ మూవీ

OTT Movie : పొలిటీషియన్ కూతురి మర్డర్ కు స్కెచ్… క్రైమ్ – కామెడీ కలగలిసిన ఇంట్రెస్టింగ్ డార్క్ కామెడీ థ్రిల్లర్

Kantara 1 OTT: థియేటర్లలో ఉండగానే ఓటీటీకి కాంతార 1.. కారణం చెప్పిన నిర్మాత

OTT Movie : చిన్న పిల్ల అని కూడా చూడకుండా దారుణం… 13 ఏళ్ల తరువాత రివేంజ్… క్లైమాక్స్ కాటేరమ్మ జాతర

OTT Movie : ప్రెగ్నెంట్ వైఫ్ తో ఇదేం పాడు పనిరా అయ్యా… కేక పెట్టించే సీన్లు… మెంటల్ మాస్ క్లైమాక్స్

OTT Movie : ఊరికి మిస్టీరియస్ శాపం… స్కిన్ లేకుండా పుట్టే పిల్లలు… హార్ట్ వీక్ గా ఉన్నవాళ్లు అస్సలు చూడకూడని హర్రర్ మూవీ

Big Stories

×