బియ్యం వడియాలు రెసిపీకి కావలసిన పదార్థాలు
బియ్యం – మూడు కప్పులు
నీరు – తొమ్మిది కప్పులు
వాము – ఒక స్పూను
జీలకర్ర – రెండు స్పూన్లు
నువ్వులు – పావు కప్పు
ఉప్పు – రుచికి సరిపడా
బియ్యం వడియాలు రెసిపీ
1. బియ్యం వడియాలు చేయడానికి ముందుగా ఒక గిన్నెలో ఒక కప్పు బియ్యానికి మూడు కప్పుల నీరు వేసి స్టవ్ మీద పెట్టి ఉడికించాలి.
2. అంటే ఇక్కడ మనం మూడు కప్పుల బియ్యం తీసుకున్నాము. కాబట్టి తొమ్మిది కప్పుల నీటిని వేసి ఉడికించాలి.
3. నీళ్లు బాగా మరిగాక అప్పుడు బియ్యాన్ని ఆ నీళ్లల్లో వేయాలి.
4. నీళ్లల్లో రుచికి సరిపడా ఉప్పును కూడా వేసుకోవాలి.
5. అలాగే వాము, జీలకర్ర, నువ్వులు కూడా వేసి బాగా కలుపుకోవాలి.
6. బియ్యము, నీళ్లు అన్ని కలిపి చిక్కగా, గట్టిగా, మందంగా అయ్యేవరకు ఉడికించుకోవాలి. తర్వాత స్టవ్ ఆఫ్ చేయాలి.7. ఇప్పుడు ఒక చీరను ఎండ తగిలే ప్రాంతంలో పరచాలి.
8. ఈ బియ్యం మిశ్రమాన్ని ఒడియాల్లాగా వేసుకోవాలి.
9. జంతికల గొట్టంలో ఈ మిశ్రమాన్ని వేసి జంతికల్లాగా ఆకారం వచ్చేలా ఎండబెట్టుకోవచ్చు. లేదా మీకు నచ్చిన ఆకారంలో వీటిని వడియాల్లా చేసి ఎండబెట్టుకోవచ్చు.
10. కొంతమంది పల్చగా అప్పడాల్లాగా కాటన్ క్లాత్ పై పరుస్తారు.
11. అలా చేసినా కూడా ఇవి టేస్టీ గానే ఉంటాయి. వీటిని ఎర్రటి ఎండలో రెండు రోజులు ఎండ పెడితే చాలు బాగా ఎండిపోతాయి.
12. ఒక గిన్నెలో వేస్తే ఈ ఎండిన వడియాలు గలగల శబ్దం వచ్చేలా ఉండాలి. అప్పుడే అవి బాగా ఎండినట్టు.
13. వీటిని గాలి చొరబడిన డబ్బాలో వేసి దాచుకుంటే ఎన్ని నెలలైనా తాజాగా ఉంటాయి.