AR Rahman: ఆస్కార్ అవార్డు విన్నర్ ఏఆర్ రెహమాన్, తన భార్య సైరా భాను విడాకులు ప్రకటించిన విషయం తెల్సిందే. 1995లో సైరా భాను, ఏఆర్ రెహమాన్ పెళ్లి చేసుకున్నారు. తమ 29 ఏళ్ల వైవాహిక జీవితం తరువాత ఈ జంట విడాకులు ప్రకటించారు. త్వరలోనే తమ 30 ఏళ్ల వివాహ బంధ వేడుకులు గ్రాండ్‌గా జరుపుకోవాల్సి ఉంది. కానీ.. అనూహ్యంగా విడాకులు తీసుకోవాల్సి వచ్చిందని వారు తెలిపారు.
ఇక అనుకోకుండా జరిగిందో.. కావాలని చేశారో తెలియదు కానీ.. రెహమాన్ విడాకులు ప్రకటించిన మరుసటి రోజే.. ఆయన దగ్గర పనిచేస్తున్న మ్యూజీషియన్ మోహిని డే కూడా తన భర్తతో విడాకులు ప్రకటించింది. దీంతో వీరిద్దరి విడాకులు ఇండస్ట్రీలో సంచలనం సృష్టించాయి. ఇద్దరూ ఒకేసారి డైవర్స్ ప్రకటించడం తో.. వీరిద్దరి మధ్య ఏదైనా వివాహేతర సంబంధం నడుస్తుందేమో అని, త్వరలోనే వీరు పెళ్లి చేసుకుంటారేమో అని రకరకాలుగా మాట్లాడుకుంటున్నారు.
Mahesh Babu: నిన్ను చూసి గర్వపడుతున్నా.. మేనల్లుడుకి మామ ఆశీస్సులు
అయితే వీరి మధ్య రిలేషన్ గురించి కానీ, వారు ఒకేసారి విడాకులు ప్రకటించడం గురించి కానీ, అటు రెహమాన్ కానీ, ఇటు మోహిని కానీ క్లారిటీ ఇచ్చింది లేదు. అయితే తాజాగా ఈ పుకార్లపై రెహమాన్ కొడుకు అమీన్ స్పందించాడు. తన తండ్రి గురించి ఇలాంటి మాటలు వినడం చాలా బాధగా ఉందని తెలిపాడు. సోషల్ మీడియాలో వస్తున్న వార్తలన్నీ అబద్ధాలని చెప్పుకొచ్చాడు.
” నా తండ్రి ఒక లెజెండ్. కేవలం అద్భుతమైన మ్యూజిక్ ను అందించడంలోనే కాదు.. విలువలు, గౌరవం, ప్రేమ అన్నింటిని ఆయన సంపాదించుకున్నారు. అలాంటి ఆయన మీద ఎలాంటి ఆధారాలు లేకుండా రూమర్స్ స్ప్రెడ్ చేయడం చూస్తుంటే బాధగా అనిపిస్తుంది.
Sreeleela: అందం అమ్మాయైతే.. నీలా ఉందా అన్నట్టుందే
ఒక వ్యక్తి గురించి, ఆయన జీవితం గురించి మాట్లాడేటప్పుడు అసలు నిజానిజాలేంటి అనేవి కూడా తెలుసుకోవాలి. దయచేసి ఇలాంటి పుకార్లను వ్యాప్తి చేయకండి. ఆయనను, వృత్తిని గౌరవిద్దాం” అని రాసుకొచ్చాడు. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట వైరల్ గా మారింది.
అయితే రెహమాన్ – సైరా అసలు ఎందుకు విడాకులు తీసుకున్నారు అనేది ఇప్పటివరకు తెలియదు. ఏదిఏమైనా ఇది వారి వ్యక్తిగతమైన విషయం.. దీన్ని ఇలా ట్రోల్ చేయడం వలన వారి బిడ్డలు చాలా సఫర్ అవుతున్నారు.. ఇకనైనా ఆపండి అని నెటిజన్స్ కామెంట్స్ పెడుతున్నారు.