E-Paper
Advertisement

చక్కెర,ప్రాసెస్డ్ ఫుడ్‌తో బ్రెస్ట్ క్యాన్సర్..ఇందులో నిజమెంత?

చక్కెర,ప్రాసెస్డ్ ఫుడ్‌తో బ్రెస్ట్ క్యాన్సర్..ఇందులో నిజమెంత?
Advertisement

Breast cancer risk factors: ఈ రోజుల్లో మన లైఫ్‌స్టైల్ పూర్తిగా మారిపోయింది. పని ఒత్తిడి, సమయానికి తినకపోవడం, దానికి తోడు ప్రాసెస్డ్ ఫుడ్, స్వీట్స్, ఫాస్ట్ ఫుడ్‌కి బాగా అలవాటు పడిపోయాం. అయితే.. మనం రోజు వారీగా తీసుకునే ఈ ఆహారపు అలవాట్లు మన ఆరోగ్యంపై తీవ్రమైన ప్రభావం చూపుతున్నాయి. ముఖ్యంగా మహిళల్లో ‘రొమ్ము క్యాన్సర్’ ప్రమాదం పెరగడానికి మనం తినే చక్కెర, జంక్ ఫుడ్ ప్రధాన కారణాలుగా మారుతున్నాయని పలు అధ్యయనాలు చెబుతున్నాయి. అసలు పంచదార, ఫాస్ట్ ఫుడ్స్ వల్ల రిస్క్ ఎంత వరకు ఉందో, వాటి నుంచి ఎలా సురక్షితంగా ఉండాలో ఇప్పుడు చూద్దాం.

చక్కెర, జంక్ ఫుడ్ వల్ల ప్రమాదం ఎలా పెరుగుతుంది?

ఇన్సులిన్ & ఐజీఎఫ్-1 పెరగడం:
మనం ఎక్కువగా పంచదార, రిఫైన్డ్ కార్బోహైడ్రేట్లు (మైదా, బేకరీ ఐటమ్స్) తిన్నప్పుడు రక్తం లో చక్కెర స్థాయిలు ఒక్కసారిగా పెరుగుతాయి. దీనివల్ల శరీరం ఇన్సులిన్‌ను ఎక్కువగా ఉత్పత్తి చేస్తుంది. అధిక ఇన్సులిన్ స్థాయిలు శరీరంలో ‘ఇన్సులిన్ లాంటి గ్రోత్ ఫ్యాక్టర్’ పెరగడానికి కారణమవుతాయి. ఇది క్యాన్సర్ కణాలు వేగంగా పెరగడానికి, విభజన చెందడానికి దోహదపడుతుంది.

Advertisement

అధిక బరువు, కొవ్వు :
జంక్ ఫుడ్‌లో క్యాలరీలు, చెడు కొవ్వులు ఎక్కువగా ఉంటాయి. ఇవి ఊబకాయానికి దారితీస్తాయి. ముఖ్యంగా మెనోపాజ్ దాటిన మహిళల్లో, కొవ్వు కణజాలం ఈస్ట్రోజెన్ అనే హార్మోన్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈస్ట్రోజెన్ స్థాయిలు పరిమితికి మించి పెరిగితే రొమ్ము క్యాన్సర్ కణాలు వేగంగా వృద్ధి చెందుతాయి.

ఇన్ఫ్లమేషన్ :
ప్రాసెస్డ్ ఫుడ్స్, డిప్ ఫ్రై చేసిన పదార్థాలు, నిల్వ ఉంచే కెమికల్స్ ఉన్న ఆహారం తినడం వల్ల శరీరంలో.. క్రానిక్ ఇన్ఫ్లమేషన్ (అంతర్గత వాపు) ఏర్పడుతుంది. ఇది డీఎన్‌ఏ దెబ్బతినడానికి, తద్వారా క్యాన్సర్ కణాలు ఏర్పడటానికి దారి తీస్తుంది.

Advertisement

ఈ లక్షణాలు ఉంటే అప్రమత్తంగా ఉండాలి:
రొమ్ములో లేదా అండర్ ఆర్మ్స్ (చంక భాగం) లో గడ్డలు రావడం

రొమ్ము ఆకారంలో లేదా పరిమాణంలో మార్పులు

చర్మంపై గుంటలు పడటం లేదా కణతులు ఏర్పడటం

నిపుల్స్ నుంచి అసాధారణ ద్రవాలు లేదా రక్తం కారడం

రొమ్ము క్యాన్సర్ రిస్క్ తగ్గించుకోవడానికి మార్గాలు:
షుగర్ క్రేవింగ్స్ తగ్గించుకోండి:
వైట్ షుగర్, ప్రాసెస్డ్ స్వీట్స్, ప్యాకేజ్డ్ జ్యూస్‌లకు దూరంగా ఉండండి. తీపి తినాలనిపిస్తే.. సహజసిద్ధమైన పండ్లు, ఈత ఖర్జూరం, పరిమితంగా బెల్లం తీసుకోవడం అలవాటు చేసుకోండి.

యాంటీ ఆక్సిడెంట్లు ఉండే ఆహారం తీసుకోండి:
తాజా కూరగాయలు, ఆకుకూరలు, బెర్రీలు, క్యారెట్లు, టమాటోలు మీ రోజూవారీ ఆహారంలో భాగం చేసుకోండి. వీటిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు క్యాన్సర్ కణాలతో పోరాడతాయి.

పప్పుధాన్యాలు & హోల్ గ్రెయిన్స్:
మైదాకు బదులుగా రాగులు, జొన్నలు, బ్రౌన్ రైస్, హోల్ వీట్ వాడండి. ఇవి రక్తంలో చక్కెర స్థాయిలను అదుపులో ఉంచుతాయి.

శారీరక శ్రమ తప్పనిసరి:
రోజుకు కనీసం 30 నుంచి 45 నిమిషాలు వాకింగ్, యోగా లేదా జిమ్ చేయడం వల్ల బరువు అదుపులో.. ఉంటుంది. ఇది హార్మోన్ల సమతుల్యతను కాపాడుతుంది.

రెగ్యులర్ స్క్రీనింగ్:
40 ఏళ్లు దాటిన మహిళలు క్రమం తప్పకుండా మమోగ్రామ్ పరీక్షలు చేయించుకోవడం మంచిది. అలాగే ..ప్రతి నెలా స్వయంగా రొమ్ము పరీక్ష చేసుకోవడం ద్వారా ప్రారంభ దశలోనే ఏవైనా మార్పులు ఉంటే గుర్తించవచ్చు.

క్యాన్సర్ ప్రమాదాన్ని పూర్తిగా నివారించలేకపోయినా.. మనం పాటించే ఆరోగ్యకరమైన అలవాట్ల వల్ల దాని రిస్క్‌ను చాలా వరకు తగ్గించుకోవచ్చు. ప్రాసెస్డ్ ఫుడ్స్, చక్కెరను వీలైనంత వరకు తగ్గిస్తూ.. పౌష్టికాహారం తీసుకోవడం, రోజూ వ్యాయామం చేయడం ద్వారా రొమ్ము క్యాన్సర్ ముప్పు నుంచి మనల్ని మనం కాపాడుకోవచ్చు.

Related News

రోజువారీ కాఫీతో లివర్ సేఫ్.. గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్ చెప్పిన షాకింగ్ విషయాలివే!

లంగ్ క్యాన్సర్ లక్షణాలు..ముందుగా గుర్తించే మార్గాలు ఇవే!

8 గంటలు నిద్రపోయినా అలసటగా అనిపిస్తోందా? మీ శరీరంలో ఈ 4 పోషకాల లోపమే కారణం

న్యూమరాలజీ.. రామ, రావణులది ఒకటే జన్మ సంఖ్య.. ఇద్దరి జీవిత కర్మలు వేరు ఎందుకు?

ప్రపంచం మొత్తం దూరమైనా.. చివరి వరకు నిలిచే నిజమైన బంధమే ‘స్నేహం’!

రోజుకు 6 గంటల కంటే తక్కువ నిద్రపోతున్నారా? బరువు పెరగడానికి ఇదే కారణం.. ఎలాగంటే

మీ జీవిత భాగస్వామికి నాలుగు లక్షణాలు తప్పదు, జీవితాంతం పశ్చాత్తాపం తప్పదా? చాణక్యుడి సలహాలు

Big Stories

Advertisement
×