Ap Local Body election Polling: ఏపీ వ్యాప్తంగా స్థానిక సంస్థల ఎన్నికల పోలింగ్ మొదలైంది. కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లో ఆదివారం ఉదయం ఎన్నికల పోలింగ్ మొదలైంది. ఉదయం నుంచి ఓటర్లు తమతమ పోలింగ్ కేంద్రాల వద్ద బారులు తీరారు. ఎలాంటి సమస్య తలెత్తకుండా ఉండేందుకు పోలీసులు భారీగా మోహరించారు.
ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల పోలింగ్ మొదలైంది. ఆదివారం ఉదయం 7 గంటల నుంచి పోలింగ్ మొదలైంది. సాయంత్రం 5 గంటల వరకు జరగనుంది. మొత్తం 99. 36 లక్షల మంది తమ ఓటు హక్కు వినియోగించు కోనున్నారు. ఓటు వేసేందుకు వెళ్లినవారు ఎన్నికల సంఘం జారీ చేసిన 12 రకాల కు సంబంధించిన గుర్తింపు కార్డుల్లో ఏదైనా ఒకదానిని తప్పనిసరిగా తీసుకెళ్లి ఓటు హక్కును వినియోగించుకోవాలని రాష్ట్ర ఎన్నికల సంఘం తెలిపింది. మంగళవారం పోలింగ్ జరగనుంది.
ఏపీలో మొత్తం 13 మున్సిపల్ కార్పొరేషన్లలో ఎన్నికలు జరుగుతున్నాయి. అందులో 117 డివిజన్లు ఏకగ్రీవమయ్యాయి. టీడీపీకి-111 బీజేపీ-3, జనసేన- 3 ఉన్నాయి. ఇక 87 మున్సిపాలిటీలకు సంబంధించి 17 మున్సిపల్ ఛైర్‌పర్సన్ స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. 70 మున్సిపాలిటీల్లో ఎన్నికల పోలింగ్ జరుగుతోంది. ఎనిమిది మున్సిపాలిటీల్లో ఛైర్‌పర్సన్‌తోపాటు అన్నివార్డులు ఏకగ్రీవమయ్యాయి. అందులో పిడుగురాళ్ల, దాచేపల్లి, గురజాల, దర్శి, ప్రొద్దుటూరు, కమలాపురం, రాయచోటి, ఆళ్లగడ్డలో ఏకగ్రీవాలు జరిగాయి.
ఏకగ్రీవమైన 17 ఛైర్‌పర్సన్ స్థానాల్లో టీడీపీకి-15, జనసేన, బీజేపీకి ఒక్కొక్కటి ఉన్నాయి. 637 వార్డుల్లో కౌన్సిలర్ అభ్యర్థుల ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అందులో టీడీపీకి 550 స్థానాలు, జనసేనకు 36, బీజేపీకి 27, వైసీపీకి 18 వార్డులు ఏకగ్రీవమయ్యాయి. మొత్తం 11,378 పోలింగ్ కేంద్రాల్లో సుమారు 1.03 కోట్ల మంది ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా మున్సిపల్ ఎన్నికలకు దాదాపు 85 వేలకుపైగా సిబ్బంది ఉన్నారు.
ALSO READ: స్థానిక సంస్థల ఎన్నికల పోలింగ్.. పులివెందులలో హింస మొదలు, వాహనాలకు నిప్పుపెట్టిన దుండగులు
వివిధ జిల్లాల్లో 671 పోలింగ్ కేంద్రాలను అత్యంత సున్నితమైనవిగా గుర్తించారు. 1,233 సున్నిత కేంద్రాల కోసం అదనంగా మరో 4,943 మంది సిబ్బందిని రంగంలోకి దించింది రాష్ట్ర ఎన్నికల సంఘం.