E-Paper
Advertisement

బియ్యంతో..రెడీ చేసే ఈ పాయసం రుచి అద్భుతంగా ఉంటుంది

బియ్యంతో..రెడీ చేసే ఈ పాయసం రుచి అద్భుతంగా ఉంటుంది
Advertisement

Rice kheer recipe: మన సంప్రదాయంలో ఏ పండగ వచ్చినా, ఏ శుభకార్యం జరిగినా ముందుగా దేవునికి నైవేద్యం సమర్పించడం ఆనవాయితీ.అలా నైవేద్యం అనగానే మనకు టక్కున గుర్తు వచ్చేది పరమాన్నం లేదా పాయసం. బియ్యం, బెల్లం, ఆవు నెయ్యితో చేసే ఈ అద్భుతమైన వంటకం కేవలం దేవుడి ప్రసాదంగానే కాకుండా..మన ఇళ్లలో అందరికీ ఇష్టమైన హెల్తీ స్వీట్‌గా మారుతుంది. చాలా మంది ఇళ్లలో పాయసం చేస్తుంటారు కానీ.. అది సరైన కన్సిస్టెన్సీతో రావడానికి కొన్ని చిన్న చిన్న చిట్కాలు పాటించాలి.వచ్చే పండగకు ఈ స్టైల్‌లో పరమాన్నం చేశారంటే.. ఇంట్లోని వాళ్లందరూ “వావ్” అనాల్సిందే!

కావలసిన పదార్థాలు:

బియ్యం – 1 కప్పు (శుభ్రంగా కడిగినవి)

Advertisement

పాలు – 2 కప్పులు (కాచి చల్లార్చినవి)

బెల్లం తురుము – 1 నుండి 1.5 కప్పులు

Advertisement

నెయ్యి – 3 స్పూన్లు

జీడిపప్పు మరియు కిస్‌మిస్ – గుప్పెడు

యాలకుల పొడి – అర స్పూన్

పచ్చ కర్పూరం – చిటికెడు (ఆప్షనల్)

తయారీ విధానం:

1. ముందుగా ఒక గిన్నెలో బియ్యాన్ని.. తీసుకుని శుభ్రంగా కడగాలి. ఆ తర్వాత తగినన్ని.. నీళ్లు పోసి బియ్యాన్ని మెత్తగా ఉడికించుకోవాలి. బియ్యం పూర్తిగా ఉడికిన తర్వాతే అందులో.. పాలు పోయాలి.అప్పుడే పాయసం మంచి టెక్చర్‌తో వస్తుంది.

2. బియ్యం ఉడికిన తర్వాత, మంటను మీడియంలో.. పెట్టి కాచి చల్లార్చిన పాలను పోయాలి. పాలు బియ్యంతో పాటు బాగా.. కలిసిపోయే.. వరకు కొన్ని నిమిషాలు ఉడికించాలి. పాయసం కొద్దిగా చిక్కబడే వరకు గరిటెతో తిప్పుతూ ఉండాలి.

Also Read: పాలు,పంచదార ఉంటే చాలు..ఇంట్లోనే దూది లాంటి రసగుల్లా రెడీ!

3. పరమాన్నం చేసేటప్పుడు నేరుగా బెల్లం వేస్తే కొన్నిసార్లు పాలు విరిగిపోయే అవకాశం ఉంటుంది. అందుకే.. ముందుగా కొద్దిగా నీళ్లు పోసి బెల్లాన్ని కరిగించి పాకం లాగా చేసుకోవాలి. ఆ బెల్లం నీటిని పూర్తిగా చల్లార్చిన తర్వాతే ఉడికించిన అన్నం మిశ్రమంలో కలపాలి. ఇలా చేయడం వల్ల పాలు విరిగి పోవు. పాయసం కూడా చాలా మృదువుగా వస్తుంది.

4. చివరగా స్టవ్ మీద చిన్న పాన్ పెట్టి నెయ్యి వేయాలి. నెయ్యి వేడెక్కిన తర్వాత జీడిపప్పు, కిస్‌మిస్ వేసి బంగారు రంగు వచ్చే వరకు వేయించుకోవాలి. వీటిని పాయసంలో వేయాలి. అలాగే.. సువాసన కోసం యాలకుల పొడి, చిటికెడు పచ్చ కర్పూరం వేసి బాగా కలిపితే.. గుమ గుమలాడే కమ్మని పరమాన్నం రెడీ అవుతుంది!

పండగ , వేడుక.. ఏదైనా ఇలాంటి కమ్మని బియ్యం పరమాన్నం ఉంటే.. ఆ రోజు భోజనమే పరిపూర్ణం అవుతుంది. హెల్తీ, ట్రెండీగా ఇంట్లోనే ఈజీగా తయారు చేసుకోగల ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేయండి.

Related News

పడకగదిలో మంచానికి ఎదురుగా అద్దం ఉండకూడదంటారు ఎందుకు? వాస్తు శాస్త్రం ఏం చెబుతోంది?

ప్రేమలో అందం, ఆకర్షణలు కాదు.. బంధం బలపడాలంటే ఇది ముఖ్యం

మీల్ మేకర్ పులావ్..బిర్యానీ కూడా దీని ముందు బలాదూర్

పుదీనా పచ్చడి ఇలా చేస్తే..అన్నం మొత్తం లాగించేస్తారు!

మీ బీపీ ఎప్పుడూ ఎక్కువగా ఉంటోందా? ముందు కిచెన్‌లో ఈ 5 ఫుడ్స్ తీసి పడేయండి

ఇన్వర్టర్ బ్యాటరీ త్వరగా పాడవుతోందా? నీరు పోసేటప్పుడు ఈ తప్పులు అస్సలు చేయకండి

తగ్గేదెలే.. ఈ 5 రాశుల్లో పుట్టినవారు చివరి నిమిషం దాకా పోరాడుతారు

Big Stories

Advertisement
×