E-Paper
Advertisement

కోపం వస్తే దాన్ని అణుచుకోకూడదు.. మన:శాంతి కోసం ఓషో చెప్పిన ఈ 4 విషయాలు పాటించండి

కోపం వస్తే దాన్ని అణుచుకోకూడదు.. మన:శాంతి కోసం ఓషో చెప్పిన ఈ 4 విషయాలు పాటించండి
Advertisement

How to control anger| కోపం వచ్చినప్పుడు మనం ఏం చేస్తున్నామో ఒక్కోసారి మనకే అర్థం కాదు. ఆ సమయంలో ఎదుటివారితో కఠినంగా మాట్లాడతాం. కొన్ని సందర్భాల్లో మన మాటలు ఇతరుల మనసును గాయపరుస్తాయి. కోపం తగ్గిన తర్వాత మాత్రం అలా ఎందుకు మాట్లాడానని బాధపడతాం. మరి కోపాన్ని ఎలా నియంత్రించుకోవాలి? కోపం వచ్చినప్పుడు వెంటనే స్పందించకుండా ఉండటం ఎలా? కోపాన్ని అణచివేయడం మంచిదేనా? ఈ ప్రశ్నలకు ఓషో బోధనలు ఒక ప్రత్యేకమైన దృక్పథాన్ని అందిస్తాయి. కోపాన్ని అణచుకోవడం కాకుండా, దాన్ని అర్థం చేసుకోవడం ముఖ్యమని ఆయన సూచించారు.

కోపం వచ్చినప్పుడు వెంటనే స్పందించకుండా కాసేపు ఆగాలి

కోపం వచ్చిన వెంటనే ఎదుటివారికి సమాధానం చెప్పడం లేదా వాదించడం చాలామందికి అలవాటు. అయితే ఆ సమయంలో మాట్లాడే మాటలు సంబంధాలను దెబ్బతీసే అవకాశం ఉంది. అందుకే కోపం వచ్చినప్పుడు కొన్ని క్షణాలు మౌనంగా ఉండాలి. ముందు నెమ్మదిగా గాలి పీల్చుకుని వదలాలి. మీ శరీరంలో వస్తున్న మార్పులను గమనించాలి. గుండె వేగంగా కొట్టుకుంటుందా? ముఖం వేడిగా అనిపిస్తోందా? కండరాలు బిగుసుకుపోతున్నాయా? ఇలాంటి లక్షణాలను గమనించడం వల్ల మీ భావోద్వేగాలను అర్థం చేసుకోవచ్చు. ఈ చిన్న విరామం ఆవేశంగా మాట్లాడకుండా ఆలోచించి స్పందించడానికి సహాయపడుతుంది. కోపం మీ ప్రవర్తనను నియంత్రించకుండా జాగ్రత్త పడాలి.

కోపాన్ని అణచుకోకూడదు

Advertisement

కోపం వచ్చినప్పుడు దాన్ని బయటకు చూపించకుండా అణచుకోవడం మాత్రమే పరిష్కారం కాదు. అసలు ఎందుకు కోపం వచ్చిందో తెలుసుకోవడానికి ప్రయత్నించాలి. కొన్నిసార్లు బాధ, అవమానం, భయం లేదా ఆశించింది జరగకపోవడం కోపానికి కారణమవుతాయి. ఈ భావాల వెనుక ఉన్న అసలు సమస్యను గుర్తిస్తే కోపాన్ని అదుపు చేసుకోవడం సులభమవుతుంది. కోపం రావడం తప్పు కాదు. కానీ ఆ కోపంతో ఎదుటివారిని అవమానించడం, బెదిరించడం లేదా బాధపెట్టడం తప్పు. మీ భావాలను అంగీకరిస్తూనే ఇతరులతో గౌరవంగా మాట్లాడాలి.

Also Read: రాత్రి మీకు సరిగా నిద్రపట్టడం లేదా? టెన్షన్‌గా ఉందా? ఇలా చేస్తే ప్రశాంతమైన నిద్ర మీ సొంతం

కోపాన్ని మంచి పనుల వైపు మళ్లించాలి

Advertisement

కొన్నిసార్లు కోపం తీవ్రంగా ఉంటుంది. అలాంటి సమయంలో వెంటనే సమస్యను పరిష్కరించడానికి ప్రయత్నించకూడదు. కొంతసేపు ఆ పరిస్థితికి దూరంగా ఉండటం మంచిది. కాసేపు నడవండి లేదా తేలికపాటి వ్యాయామం చేయండి. ప్రశాంతమైన ప్రదేశంలో కూర్చొని శ్వాసపై దృష్టి పెట్టండి. ఇలా చేయడం వల్ల మనసులోని ఒత్తిడి తగ్గవచ్చు. కోపంలో ఉన్నప్పుడు వాదనలు కొనసాగించకుండా కొంత సమయం తీసుకోవాలి. మనసు ప్రశాంతంగా మారిన తర్వాతే సమస్య గురించి మాట్లాడాలి. కోపాన్ని వ్యక్తం చేసే పేరుతో ఎవరినీ, దేన్నీ గాయపరచకూడదు.

Also Read: బ్రేకప్ తరువాత ఒంటరితనం.. ఆ బలహీన క్షణంలో అందరూ చేసే తప్పులు ఇవే..

భావోద్వేగాలను అర్థం చేసుకుంటే కోపాన్ని నియంత్రించుకోవచ్చు

కోపం రాకుండా పూర్తిగా అడ్డుకోవడం ఎప్పుడూ సాధ్యం కాకపోవచ్చు. కానీ కోపం వచ్చిన తర్వాత ఎలా ప్రవర్తించాలో మనం నిర్ణయించుకోవాలి. ఓషో ఆలోచనలు కూడా భావోద్వేగాల పట్ల అవగాహన పెంచుకోవాలని సూచిస్తాయి.

కోపానికి కారణాలను గుర్తించడం, వెంటనే స్పందించకుండా ఉండటం, ప్రశాంతంగా ఆలోచించడం అలవాటు చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల సంబంధాలు మెరుగుపడటంతో పాటు మానసిక ప్రశాంతత కూడా లభిస్తుంది.

Related News

ప్రెగ్నెన్సీ తొమ్మిదో నెలలో వెయిటెడ్ స్క్వాట్స్ చేస్తున్న సమంత.. ఆ సమయంలో చేయడం తల్లి, బిడ్డకు మంచిదేనా?

ఎంత కష్టపడి పనిచేసినా ఆర్థిక ఇబ్బందులు పీడిస్తున్నాయా? దీనికి కారణం వాస్తు దోషమేనా?

ఎప్పుడైనా అరటి ఆకులో చికెన్ రోస్ట్ చేసి తిన్నారా? ఈ సండే పక్కా ట్రై చేయండి బాస్!

సండే రోజు ‘బోన్ మారో మసాలా’ ఇలా చేశారంటే.. ఇంట్లో వాళ్లందరూ లొట్టలేసుకుంటూ తింటారు!

పడకగదిలో మంచానికి ఎదురుగా అద్దం ఉండకూడదంటారు ఎందుకు? వాస్తు శాస్త్రం ఏం చెబుతోంది?

బియ్యంతో..రెడీ చేసే ఈ పాయసం రుచి అద్భుతంగా ఉంటుంది

ప్రేమలో అందం, ఆకర్షణలు కాదు.. బంధం బలపడాలంటే ఇది ముఖ్యం

Big Stories

Advertisement
×