E-Paper
Advertisement

ఎప్పుడైనా అరటి ఆకులో చికెన్ రోస్ట్ చేసి తిన్నారా? ఈ సండే పక్కా ట్రై చేయండి బాస్!

ఎప్పుడైనా అరటి ఆకులో చికెన్ రోస్ట్ చేసి తిన్నారా? ఈ సండే పక్కా ట్రై చేయండి బాస్!
Advertisement

Chicken Banana Leaf Roast: సండే వచ్చిందంటే చాలు.. నాన్‌వెజ్ ప్రియుల ఇంట్లో చికెన్ లేదా మటన్ వంటకం ఉండాల్సిందే. అయితే ఎప్పుడూ తినే చికెన్ కర్రీలు, బిర్యానీలు కాకుండా ఈసారి కాస్త కొత్తగా, ప్రత్యేకమైన రుచితో ఏదైనా ట్రై చేయాలనుకుంటున్నారా? అయితే మీకోసమే ఈ నోరూరించే చికెన్ బనానా లీఫ్ రోస్ట్. అచ్చమైన పల్లెటూరి వంటకాల రుచిని గుర్తుచేసే ఈ వంటకాన్ని ఒక్కసారి రుచి చూస్తే మళ్లీ మళ్లీ తినాలనిపిస్తుంది. అరటి ఆకులో మసాలాలు పట్టించిన చికెన్‌ను చుట్టి నెమ్మదిగా కాల్చడం వల్ల ఆకులోని సహజమైన సువాసన చికెన్‌కు చక్కగా పడుతుంది. మసాలాలన్నీ లోపలే ఉడకడంతో చికెన్ ముక్కలు ఎంతో మెత్తగా, జ్యూసీగా తయారవుతాయి. బయటకు తీసినప్పుడు వచ్చే ఆ కమ్మటి వాసనకే నోట్లో నీళ్లూరుతాయి. వేడివేడి అన్నం, చపాతీ లేదా పరోటాతో కలిపి తింటే ఆ మజానే వేరు. రండి.. ఇప్పుడీ రెసిపీ తయారీ విధానం చూద్దాం.

కావలసిన పదార్థాలు:

చికెన్ – అరకిలో
అల్లం వెల్లుల్లి పేస్ట్ – ఒక స్పూన్
కారం – రెండు స్పూన్లు
ధనియాల పొడి – ఒక స్పూన్
గరం మసాలా – అర స్పూన్
పసుపు – చిటికెడు
ఉప్పు – రుచికి సరిపడా

Advertisement

Also Read: ఈవెనింగ్ స్నాక్ కోసం ఈ చికెన్ పెరి పెరి పాపర్స్ ట్రై చేయండి.. ఇంటిల్లిపాదీ శభాష్ అంటారు!
పెరుగు – రెండు స్పూన్లు
నిమ్మరసం – ఒక స్పూన్
పచ్చిమిర్చి – నాలుగు
ఉల్లిపాయలు – రెండు
టమోటాలు – రెండు
కొత్తిమీర తరుగు – కొద్దిగా
పుదీనా తరుగు – కొద్దిగా
నూనె – మూడు స్పూన్లు
అరటి ఆకు – ఒకటి (పెద్దది)

తయారీ విధానం:

శుభ్రంగా కడిగిన చికెన్‌లో ఒక గిన్నెలోకి తీసుకుని అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్, కారం, ధనియాల పొడి, గరం మసాలా, పసుపు, తగినంత ఉప్పు, పెరుగు, నిమ్మరసం వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని కనీసం అరగంట పాటు నానబెట్టడం వల్ల మసాలాలు ముక్కలకు బాగా పడతాయి. ఈ లోపు ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, టమోటాలను సన్నగా తరిగి పెట్టుకోవాలి.

Advertisement

ఇప్పుడు స్టవ్ మీద బాణలి పెట్టి నూనె పోసి వేడెక్కిన తర్వాత సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి వేసి బంగారు రంగు వచ్చే వరకు వేయించాలి. ఆ తర్వాత టమోటా ముక్కలు వేసి అవి మెత్తబడే వరకు ఉడికించాలి. దీనిలో ముందుగా నానబెట్టి ఉంచుకున్న చికెన్ మిశ్రమాన్ని వేసి బాగా కలపాలి. చికెన్‌లో నుంచి నీరు బయటకు వచ్చి దగ్గరగా ఉడికే వరకు మూత పెట్టి ఉడికించాలి. కూర పూర్తిగా ఉడికిన తర్వాత కొత్తిమీర, పుదీనా చల్లుకొని దింపేసుకోవాలి.

ఇప్పుడు ఒక పెద్ద అరటి ఆకును తీసుకొని కొద్దిగా మంటపై వేడి చేయాలి. అలా చేయడం వల్ల ఆకు మెత్తబడి చుట్టడానికి సులువుగా ఉంటుంది. ఆకు మధ్యలో ఉడికించి పెట్టుకున్న చికెన్ రోస్ట్ మిశ్రమాన్ని వేయాలి. ఆకును ఎక్కడా గాలిపోకుండా గట్టిగా మడిచి దారంతో గట్టిగా కట్టాలి. ఇప్పుడు ఒక పెనం మీద కొద్దిగా నూనె రాసి, ఈ అరటి ఆకు పొట్లం పెనం మీద పెట్టి సన్నటి మంటపై రెండు వైపులా చక్కగా కాల్చుకోవాలి. అరటి ఆకు కొద్దిగా మాడిన వాసన వచ్చే వరకు ఉంచితే చాలు, అద్భుతమైన సువాసన వెలువడుతుంది. చివరగా.. స్టవ్ ఆపి కొద్దిగా చల్లారిన తర్వాత ఆకు విప్పి వేడి వేడిగా తింటే రుచి అమృతంలా ఉంటుంది.

Also Read: క్యాప్సికమ్‌లో మటన్ ఖీమా స్టఫింగ్.. ఈ వెరైటీ రెసిపీని ఎప్పుడైనా ట్రై చేశారా?

Tags

Related News

సండే రోజు ‘బోన్ మారో మసాలా’ ఇలా చేశారంటే.. ఇంట్లో వాళ్లందరూ లొట్టలేసుకుంటూ తింటారు!

పడకగదిలో మంచానికి ఎదురుగా అద్దం ఉండకూడదంటారు ఎందుకు? వాస్తు శాస్త్రం ఏం చెబుతోంది?

బియ్యంతో..రెడీ చేసే ఈ పాయసం రుచి అద్భుతంగా ఉంటుంది

ప్రేమలో అందం, ఆకర్షణలు కాదు.. బంధం బలపడాలంటే ఇది ముఖ్యం

మీల్ మేకర్ పులావ్..బిర్యానీ కూడా దీని ముందు బలాదూర్

పుదీనా పచ్చడి ఇలా చేస్తే..అన్నం మొత్తం లాగించేస్తారు!

మీ బీపీ ఎప్పుడూ ఎక్కువగా ఉంటోందా? ముందు కిచెన్‌లో ఈ 5 ఫుడ్స్ తీసి పడేయండి

Big Stories

Advertisement
×