E-Paper
Advertisement

ఓటీటీలోకి రాబోతున్న ‘హృదయం మురళి’.. స్ట్రీమింగ్ ఎప్పుడు? ఎక్కడంటే?

ఓటీటీలోకి రాబోతున్న ‘హృదయం మురళి’.. స్ట్రీమింగ్ ఎప్పుడు? ఎక్కడంటే?
Advertisement

Hrudayam Murali OTT:థియేటర్లలో సందడి చేసిన ప్రతి చిత్రం దాదాపు డిజిటల్ స్ట్రీమింగ్ కి అందుబాటులోకి వస్తున్న విషయం తెలిసిందే. తమిళ్, తెలుగు, కన్నడ ,మలయాళం, హిందీ అంటూ భాషతో సంబంధం లేకుండా అటు హాలీవుడ్ చిత్రాలు కూడా ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. ఈ మధ్యకాలంలో డిజిటల్ స్ట్రీమింగ్ ప్లాట్ ఫామ్స్ అందుబాటులోకి వచ్చిన తర్వాత.. కథ ఓరియంటెడ్ చిత్రాలకు విపరీతమైన ఆదరణ లభిస్తున్న విషయం తెలిసిందే. అలా తమిళంలో వచ్చిన ఒక చిత్రం తమిళ్ ఆడియన్స్ ను ఆకట్టుకోవడమే కాకుండా తెలుగు ప్రేక్షకులను సైతం మెప్పించింది. అలాంటి ఒక సినిమా ఇప్పుడు ఓటీటీ స్ట్రీమింగ్ కి రాబోతోంది. అదేదో కాదు ఇదయం మురళి. తెలుగులో ‘హృదయం మురళి’ పేరుతో డబ్బింగ్ చేసి రిలీజ్ చేసిన విషయం తెలిసిందే.

ఓటీటీ స్ట్రీమింగ్ కి రాబోతున్న హృదయం మురళి..

అథర్వ (Atharva Murali), ప్రీతి ముకుందన్( Priety mukundhan), కయాదు లోహర్ (Kayadu lohar) ప్రధాన పాత్రల్లో జూలై 10వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తమిళ్, తెలుగు భాషలలో థియేటర్లలో విడుదలైన ఈ సినిమాకి ప్రేక్షకుల నుంచి ప్రశంసలు లభించాయి. ఇప్పుడు ఈ సినిమా ఓటీటీ స్ట్రీమింగ్ సిద్ధమైంది. ఈ సినిమా డిజిటల్ హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ ఫ్లిక్స్ సొంతం చేసుకుంది. ఈ నేపథ్యంలోని ఆగస్టు 7 నుంచి ఈ సినిమాను నెట్ ఫ్లిక్స్ వేదికగా స్ట్రీమింగ్ చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించింది. థియేటర్లలో మంచి స్పందన సొంతం చేసుకున్న ఈ చిత్రం ప్రేక్షకులను ఏ మేరకు ఆకట్టుకుంటుందో చూడాలి.

Advertisement

also read:సైలెంట్ గా ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ లాక్ చేసుకున్న రష్మిక ‘కాక్ టెయిల్ 2’ మూవీ!

హృదయం మురళి సినిమా విశేషాలు..

ఆకాష్ భాస్కరన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి ఎస్. తమన్ సంగీతాన్ని అందించారు. ఫహద్ ఫాజిల్, ఎస్. తమన్, నిహారిక ఎన్. ఎమ్, ద్రవిడ్ సెల్వం తదితరులు కీలక పాత్రలు పోషించారు. డాన్ పిక్చర్స్ బ్యానర్ పై ఆకాష్ భాస్కరన్ ఈ చిత్రానికి దర్శకత్వంతో పాటు నిర్మాతగా కూడా వ్యవహరించారు.

హృదయం మురళి సినిమా స్టోరీ..

Advertisement

చిన్నప్పుడే తల్లిదండ్రులను కోల్పోయిన హృదయ (అథర్వ)ను తన మామయ్య (నట్టి సుబ్రహ్మణ్యం) అన్ని తానై చూసుకుంటూ ఉంటాడు. చిన్నప్పుడు స్కూల్లో తన ఇంగ్లీష్ టీచర్ గీత (జోనీత గాంధీ) పై పుట్టిన అమాయకపు క్రష్ నుంచి ట్యూషన్ లో సమంత (ప్రీతి ముకుందన్), కాలేజ్ రోజుల్లో అముద (కయాదు) ఇలా హృదయ జీవితంలో వివిధ దశలలో పలు ప్రేమ కథలు ఉంటాయి. ప్రతి ఒక్కరిని గాఢంగా ప్రేమించినా.. మనసులోని ప్రేమను వ్యక్తపరచలేక పోతాడు. అయితే అదితి (మాళవిక మోహనన్) తో పెళ్లి పీటలు ఎక్కడానికి సరిగ్గా 10 రోజుల సమయం ఉండగా అతని మనసులో దాగి ఉండిపోయిన ప్రేమను బయట పెట్టడానికి ఫ్రెండ్స్ తో కలిసి న్యూయార్క్ కి బయలుదేరుతాడు. ఆ తర్వాత ఏమైంది? సరిగా పెళ్లికి ముందే తన గత ప్రేమ జ్ఞాపకాలను వెతుక్కుంటూ హృదయ ముందుగా ఎవరి దగ్గరకు వెళ్తాడు? ఈ ప్రయాణంలో తాను కోరుకుంటున్నట్లుగా నిజమైన ప్రేమను దక్కించుకున్నాడా ? సమంత, అముద, అదితిలలో ఎవరిని పెళ్లి చేసుకున్నాడు? అనేది మిగతా కథ. మొత్తానికి అయితే థియేటర్లలో మెప్పించిన ఈ సినిమా ఇప్పుడు ఓటీటీలలో ఎలాంటి ఆదరణ సొంతం చేసుకుంటుందో చూడాలి.

Related News

సైలెంట్ గా ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ లాక్ చేసుకున్న రష్మిక ‘కాక్ టెయిల్ 2’ మూవీ!

Weekend OTT Movies : ఈ వీకెండ్ ఓటీటీ మూవీస్..ఆ రెండు మస్ట్ వాచ్..

1775 నుంచి 2050 వరకు వెంటాడిన శాపం… ఓటీటీలో ఈ హారర్ మూవీ చూశారా?

గతం మర్చిపోయిన ఫైటర్… నెట్‌ఫ్లిక్స్‌లో అదిరిపోయే యాక్షన్ సిరీస్

విద్యార్థులను రాక్షసులుగా మార్చే శాపం… నెట్‌ఫ్లిక్స్‌లో ఈ హారర్ సిరీస్ చూశారా?

నవ్వుతో చంపే వైరస్… బ్యాట్‌మ్యాన్‌కు జోకర్ షాక్… క్లైమాక్స్ చూస్తే గూస్‌బంప్స్

దేశం కోసం కుటుంబాన్నే రిస్క్‌లో పెట్టిన మహిళ… సీజన్ 3లో షాకింగ్ ట్విస్టులు

Big Stories

Advertisement
×