ప్రతి రోజు ప్రపంచ వ్యాప్తంగా లక్షలాది మంది విమానం ప్రయాణం చేస్తారు. అయితే.. ఏ విమాన సంస్థకు చెందిన ఫ్లైట్స్ అయినా, ఎక్కి దిగేందుకు ఎడమవైపు మాత్రమే దారి ఉంటుంది. ఫుడ్ క్యాటరింగ్, లగేజీని విమానం కుడివైపు లోడ్ చేస్తారు. ఈ పద్దతి దశాబ్దాలుగా కొనసాగుతుంది. ఎందుకు ప్రయాణీకులు ఎడమవైపు నుంచే ఎక్కి దిగుతారు? కుడివైపు డోర్ ఎందుకు ఉండదు? అని చాలా మందికి అనుమానం కలిగి ఉంటుంది. ఇలాంటి అనుమానం ఉన్న వారికి క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు ఏవియేషన్ నిపుణులు. ఇంతకీ వారు ఏం చెప్పారో ఇప్పుడు తెలుసుకుందాం..
సాధారణంగా విమాన పరిభాషలో రాడార్, కాక్ పిట్, క్యాబిన్, బల్క్ హెడ్, నాట్స్ అనే పదాలు తరచుగా వినిపిస్తాయి. సాధారణంగా ఓడ రేవుకు ఎదురుగా ఓడలు ఉన్నట్లుగానే విమానాశ్రయంలో ప్రయాణీకులు వచ్చే దారికి ఎదురుగా విమానాలు నిలబడి ఉంటాయి. అయితే, 1930లలో యునైటెడ్ ఎయిర్ లైన్స్ వారి విమానాల కుడి వైపు నుంచి ప్రయాణీకులను ఎక్కించడం మొదలు పెట్టింది. కుడి వైపుతో పోల్చితే, ఎడమవైపు చాలా ఈజీగా, అనుకూలంగా ఉందని నిపుణులు చెప్పడంతో చివరికి ఎడమ వైపు నుంచి బోర్డింగ్ ను ప్రారంభించింది. ‘పైలట్ ఎడమ వైపున కూర్చున్నందున, విమానాశ్రయాలు ఎడమ వైపున డోర్లతో నిర్మించడం ప్రారంభించాయి. ఈ విధానం ద్వారా పైలట్ గేట్ కు టాక్సీ చేస్తున్నప్పుడు దూరాన్ని కరెక్ట్ గా అంచనావేసే అవకాశం ఉంటుంది. విమానాశ్రయాలు అభివృద్ధి చేయబడిన తర్వాత, ప్రయాణీకులు టెర్మినల్ నుంచి నేరుగా విమానంలోకి నడవడానికి జెట్ వేలను ఉపయోగించడంతో, ప్రతి విమానం ఒకే దిశలో ప్రయాణీకుల రాకపోకలకు అనుగుణంగా డోర్లు ఏర్పాటు చేశారు. ఈ విధానం ద్వారా గ్రౌండ్ ఆపరేషన్లు చాలా సులభం అయ్యాయి’ అని వాషింగ్టన్ మ్యూజియం ఆఫ్ ఫ్లైట్ మాథ్యూ బర్చెట్ వెల్లడించారు.
Read Also: రైలులో లోయర్ బెర్త్ కావాలా? మారిన ఈ రూల్స్ గురించి ముందుగా తెలుసుకోవల్సిందే!
ప్రస్తుతం కొనసాగుతున్న ఈ సెటప్.. ప్రయాణీకులు గ్రౌండ్ సిబ్బందికి ఆటంకం కలిగించకుండా విమానం ఎక్కడంతో పాటు దిగే అవకాశం కల్పిస్తోంది. విమానంలో ప్యూయెల్ నింపారా? లగేజీ విమానంలో లోడ్ చేశారా? లేదా అనేది కూడా ఈజీగా తెలుసుకునే అవకాశం ఉంటుంది. మొత్తంగా గ్రౌండ్ ఆపరేషన్స్ ఈజీ కావడంతో పాటు పైలెట్ అన్ని విషయాలను నిషితంగా గమనించేందుక అనుగుణంగా ఉండేలా విమానానికి ఎడమవైపు మాత్రమే దారిని ఏర్పాటు చేశారు. ఇలా చేయడం వల్ల ప్రయాణీకులు సైతం సులభంగా ఎక్కడం, దిగడం చేసే అవకాశం ఉంటుంది. సమయం ఎక్కువగా ఆదా అవుతుంది. ఒకవేళ కుడివైపు డోర్ ఉంటే, ప్రయాణీకులు ఎక్కి దిగేందుకు అంతగా అనుకూలంగా ఉండదు. సమయం ఎక్కువగా వృథా అవుతుంది. అందుకే ఏవియేషన్ అధికారులు విమానాలకు ఎడమవైపు డోర్ ఉండాలని నిర్ణయించారు.
Read Also: హైదరాబాద్ నుంచి మదీనాకు నేరుగా విమానాలు, గుడ్ న్యూస్ చెప్పిన ఇండిగో!