BigTV English

Unique Bath Habits: దీన్ని కూడా స్నానం అంటారా? ఇవేం వింత పద్దతులు భయ్యా?

Unique Bath Habits: దీన్ని కూడా స్నానం అంటారా? ఇవేం వింత పద్దతులు భయ్యా?

Unique Bathing Habits: మనం ఒక్క రోజు స్నానం చేయకపోతే ఒళ్లంతా చెమట కంపు వస్తుంది. అదే, రెండు రోజులు చేయకపోతే పిచ్చెక్కిపోతుంది. కానీ, ప్రపంచంలో వింత వింత స్నాన పద్దతులు ఉన్నాయి. కొంత మంది వారానికి ఒకసారి స్నానం చేస్తే, మరికొంత మంది స్నానం చేయడమే అనవసరంగా భావిస్తారు. ఇంకొంత మంది స్నానం చేయడకుండా ఒంటికి బూడిద పూసుకుంటారు. వ్యక్తిగత పరిశుభ్రత పద్దతులు దేశాలు, సంస్కృతులను బట్టి మారుతూ ఉంటాయి. స్నానం చేయని ప్రజలు ఉన్న దేశాన్ని గుర్తించడం కష్టం అయినప్పటికీ, ప్రత్యేకమైన స్నానపు అలవాట్లు ఉన్న కొన్ని ప్రదేశాలు మాత్రం ఉన్నాయి. ప్రపంచ వ్యాప్తంగా ఉన్నవింత స్నానపు పద్దతుల గురించి ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం..


అరుదుగా స్నానం చేయడం

⦿ ఇథియోపియాలోని కొన్ని గ్రామీణ ప్రాంతాలల్లో నీటి కొరత కారణంగా వారానికి ఓసారి లేదంటే పది రోజులకు ఓసారి స్నానం చేస్తారు.


⦿ నేపాల్ లోని కొన్ని హిమాలయ ప్రాంతాలల్లో చల్లని వాతావరణం కారణంగా వారం లేదంటే 10 రోజులకు ఓసారి స్నానం చేస్తారు.

⦿ పుపువా న్యుగినియాలోని కొన్ని గిరిజన తెగలు సక్రమంగా స్నానం చేయరు. 10 లేదంటే  15 రోజులకు ఓసారి స్నానం చేస్తారు. ఇక్కడ నదీ ప్రవాహాలు ఉన్నప్పటికి స్నానం చేసేందుకు పెద్దగా ఆసక్తి చూపించరు.

ప్రత్యామ్నాయ పరిశుభ్రత పద్ధతులు

⦿ భారత్ లోని కొన్ని గ్రామీణ ప్రాంతాల్లో నీళ్లతో స్నానం చేసినప్పటికీ,  రోజూ స్నానం చేయాల్సిన అవసరం లేదని భావిస్తారు.

⦿ ఆఫ్రికాలోని కొన్ని సంచార తెగలు స్నానానికి బదులుగా, శరీరానికి ఇసుక లేదంటే బూడిదను పూసుకుంటారు.

⦿ కొన్ని అమెజోనియన్ కమ్యూనిటీలు స్నానం చేయకుండా మొక్కల ఆకుల ద్వారా శరీరాన్ని శుభ్రపరుచుకుంటారు.

సాంస్కృతిక, మతపరమైన స్నాన పద్దతులు  

⦿ టిబెటన్ బౌద్ధులు ఆధ్యాత్మిక స్వచ్ఛతకు ప్రాధాన్యతనిస్తూ స్నానం చేయడం అనవసరంగా భావిస్తారు.

⦿ కొన్ని ఆఫ్రికన్ సంస్కృతులు స్నానం చేయడాన్ని ప్రాశ్చాత్య సంస్కృతిగా భావిస్తారు. సంప్రదాయ పద్దతుల ద్వారా శరీరాన్ని శుభ్రపరుచుకుంటారు.

⦿ భారత్ లోని హిందూ సాధువులు ఆధ్యాత్మిక స్వచ్ఛతను పాటిస్తారు. రోజూ స్నానం చేయాలనేది అంత ముఖ్యమైన విషయంగా భావించరు.

Read Also: ఆ వయస్సు పిల్లలు మొబైల్ చూస్తే ఇక అంతే.. నార్వే సర్కార్ కీలక నిర్ణయం!

నీటి కొరతతో..   

⦿ సబ్ సహారా ఆఫ్రికాలోని కొన్ని ప్రాంతాల్లో నీటి లభ్యత తక్కువగా ఉన్న కారణంగా ప్రజలు రెగ్యులర్ గా స్నానం చేయరు.

⦿ మిడిల్ ఈస్ట్ లోని కొన్ని ఎడారి ప్రాంతాల ప్రజలు కూడా నీటి కొరత కారణంగా నిత్యం స్నానం చేయరు.

⦿ ఆస్ట్రేలియాలోని కొన్ని అవుట్‌ బ్యాక్ ప్రాంతాల్లో నీటి లభ్యత తక్కువగా ఉన్న నేపథ్యంలో అక్కడి ప్రజలు రోజూ స్నానం చేయరు.

ఈ పద్దతులు ఆయా దేశాలు, ప్రాంతాల్లోని ప్రజలందరికీ వర్తించవు. ప్రతి ప్రాంతంలో వ్యక్తిగత పరిశుభ్రత పద్ధతులు  మారుతూ ఉంటాయి. ఆయా దేశాల్లోని  ఆర్థిక, పర్యావరణ, సాంస్కృతిక అంశాలు స్నానపు అలవాట్లను ప్రభావితం చేస్తాయి.

Read Also: మాస్టర్ డేటింగ్ అంటే ఏమిటీ? ఇందులో ఇంత పిచ్చ హ్యాపీనెస్ ఉంటుందా మామా?

Tags

Related News

Weight Loss: ఈ యోగాసనాలతో.. 10 రోజుల్లోనే వెయిట్ లాస్

Sugar: చక్కెర తినడం 30 రోజులు ఆపేస్తే.. ఏం జరుగుతుందో తెలుసా ?

Hair Care Tips: వర్షంలో జుట్టు తడిస్తే..… వెంటనే ఇలా చేయండి?

Paneer Effects: దే…వుడా.. పన్నీరు తింటే ప్రమాదమా?

Hair Growth Tips: ఈ టిప్స్ పాటిస్తే.. వారం రోజుల్లోనే ఒత్తైన జుట్టు !

Gut Health: గట్ హెల్త్ కోసం.. ఎలాంటి ఆహారం తినాలి ?

Big Stories

×