E-Paper
Advertisement

అదుర్స్ అనిపించే అరటికాయ ఫ్రై..క్షణాల్లోనే రెడీ

అదుర్స్ అనిపించే అరటికాయ ఫ్రై..క్షణాల్లోనే రెడీ
Advertisement

Aratikaya vepudu: మన భోజనంలోకి పప్పు లేదా సాంబార్ ఉన్నప్పుడు పక్కన కరకరలాడే వేపుడు ఉంటే ఆ కిక్కే వేరు. అందులోనూ అరటికాయ వేపుడుకు ఉండే క్రేజ్ ప్రత్యేకం. అయితే.. చాలామంది ఇంట్లో వేపుడు చేసినప్పుడు అరటికాయ ముక్కలు నల్లబడటం లేదా ఉడికిన తర్వాత మెత్తగా ముద్దలా అయిపోవడం జరుగుతుంది. సరైన పద్ధతిలో కట్ చేసి, మంచి మసాలా కారం కలిపి వేయిస్తే.. మాత్రం అరటికాయ వేపుడు తిన్నవాళ్లంతా వావ్ అనాల్సిందే. ఒక్కసారి ఈ స్టైల్‌లో ట్రై చేశారంటే మీ ఇంట్లో ఎప్పుడూ ఇదే రెసిపీ చేయమని అడుగుతారు.

కావాల్సిన పదార్థాలు:

పచ్చి అరటికాయలు: 3

Advertisement

నూనె: 3 టేబుల్ స్పూన్లు

పోపు దినుసులు: ఆవాలు అర టీస్పూన్, జీలకర్ర అర టీస్పూన్, శనగపప్పు 1 టీస్పూన్, మినప్పప్పు 1 టీస్పూన్

Advertisement

ఎండుమిర్చి: 2

కరివేపాకు: 2 రెమ్మలు

వెల్లుల్లి రెబ్బలు: 6 నుంచి 8

పసుపు: పావు టీస్పూన్

ఉప్పు: రుచికి సరిపడా

స్పెషల్ మసాలా పొడి కోసం: వేయించిన శనగపప్పు (పుట్నాలు) 2 టేబుల్ స్పూన్లు, ఎండు కొబ్బరి పొడి 1 టేబుల్ స్పూన్, కారం 1.5 టీస్పూన్లు, ధనియాల పొడి 1 టీస్పూన్, జీల కర్ర పొడి అర టీస్పూన్

కొత్తి మీర తరుగు: కొద్దిగా

తయారీ విధానం:

1.ముందుగా అరటికాయల పైన ఉండే.. ఆకుపచ్చ తొక్కను పూర్తిగా కాకుండా, లైట్‌గా చెక్కు తీయాలి. ఇలా చేయడం వల్ల ముక్కలు వేయించేటప్పుడు విరిగిపోకుండా గట్టిగా ఉంటాయి. ఆ తర్వాత అరటికాయలను మీడియం సైజ్.. ముక్కలుగా కట్ చేసుకోవాలి. కట్ చేసిన వెంటనే.. ముక్కలు నల్ల బడకుండా ఉండాలంటే.. ఒక గిన్నెలో నీళ్లు పోసి అందులో కొద్దిగా ఉప్పు, చిటి కెడు పసుపు వేసి ఈ ముక్కలను ఐదు నిమిషాలు ఉంచాలి.ఆ తర్వాత నీళ్లు పూర్తిగా వంపేసి ముక్కలను పొడి క్లాత్‌తో తుడిస్తే తడి లేకుండా ఉంటాయి.

2.ఇప్పుడు ఈ ఫ్రైకి అసలైన రుచినిచ్చే స్పెషల్ కారంపొడి సిద్ధం చేసుకుందాం. మిక్సీ జార్‌లో వేయించిన శనగపప్పు, ఎండు కొబ్బరి పొడి, కారం, ధనియాల పొడి, జీలకర్ర పొడి వేసి మెత్తని పొడిలా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఈ పొడి వల్ల అరటికాయ ముక్కలకు మంచి కోటింగ్ రావడమే కాకుండా కమ్మని వాసన వస్తుంది.

3. తర్వాత స్టవ్ మీద వెడల్పాటి కడాయి పెట్టి నూనె వేడి చేయాలి. నూనె కాగాక ఆవాలు, జీలకర్ర, శనగ పప్పు, మినప్పప్పు, ఎండుమిర్చి వేసి దోరగా వేయించాలి. పోపు వేగిన తర్వాత కరివేపాకు, కచ్చా పచ్చాగా దంచిన వెల్లుల్లి రెబ్బలు వేసి మంచి వాసన వచ్చేదాకా కలపాలి. ఇప్పుడు తడి లేకుండా సిద్ధం చేసుకున్న.. అరటికాయ ముక్కలు, పసుపు, కొద్దిగా ఉప్పు వేసి మీడియం ఫ్లేమ్‌లో బాగా కలపాలి.

Also Read: నోరూరించే పప్పురొయ్య వంకాయ కూర..పాతకాలపు రుచితో సింపుల్‌,టేస్టీగా!

4. అరటి కాయ వేపుడు చేసేటప్పుడు మూత పెట్టకుండా వేయిస్తేనే.. ముక్కలు క్రిస్పీగా వస్తాయి. మూత పెడితే ఆవిరి నీళ్లు పడి ముక్కలు మెత్తబడతాయి. మధ్య మధ్యలో కలుపుతూ ఎనిమిది నుంచి పది నిమిషాల పాటు ముక్కలు గోల్డెన్ కలర్‌లోకి మారి, మెత్తగా ఉడికే దాకా వేయించాలి. ముక్కలు చక్కగా వేగాక మంటను లో ఫ్లేమ్‌లో పెట్టి, ముందుగా గ్రైండ్ చేసుకున్న స్పెషల్ కారంపొడిని చల్లాలి.

5. పొడి ముక్కలన్నింటికీ బాగా పట్టేలా రెండు నిమిషాల పాటు నిదానంగా వేయించి, చివరగా సన్నగా తరిగిన కొత్తి మీర చల్లి స్టవ్ ఆఫ్ చేయాలి. అంతే.. బయట క్రిస్పీగా, లోపల సాఫ్ట్‌గా ఉండే సూపర్ టేస్టీ అరటి కాయ వేపుడు రెడీ అయిపోతుంది. వేడి వేడి అన్నంలోకి నెయ్యి, పప్పుతో.. పాటు ఈ ఫ్రై నంజుకుని తింటే ఆ రుచే వేరు.

Related News

రుచిలో అదుర్స్!చిక్కటి గ్రేవీతో గోబీ మసాలా కర్రీ

చలికాలంలో ఇమ్యూనిటీని పెంచే సూపర్ డ్రింక్.. ఇంట్లోనే రుచికరమైన మునక్కాయ సూప్ ఇలా చేసుకోండి!

చెరువు అవసరం లేదు? ఇంట్లోనే తామర పువ్వులు పెంచుకోవడానికి ఈజీ టిప్స్

ఆఫీస్ మీటింగ్స్, ఇంటర్వ్యూలలో తడబడుతున్నారా? మీ మాటతీరును మార్చే 5 సింపుల్ అలవాట్లు ఇవే!

కూరగాయలంటే పారిపోయే పిల్లలు కూడా.. ఈ 4 వెరైటీలు చేసి పెడితే మళ్లీ మళ్లీ అడిగి తింటారు!

మన తలరాతను మార్చే శక్తి మనలోనే ఉందా? భగవద్గీతలో శ్రీ కృష్ణుడు చెప్పిన అద్భుత సందేశం

చలికాలంలో స్వెటర్ వేసుకుంటే లావుగా కనిపిస్తున్నారా? స్లిమ్‌ అండ్ స్టైలిష్‌గా కనిపించడానికి టిప్స్

Big Stories

Advertisement
×