Skin Care Routine: మృదువైన మెరిసే చర్మం ఉండాలని ఎవరు కోరుకోరు చెప్పండి. గ్లోయింగ్ స్కిర్ కోసం అమ్మాయిలు, అబ్బాయిలనే తేడా లేకుండా మార్కెట్‌లో దొరికే రకరకాల స్కిన్ కేర్ ప్రొడక్ట్స్ కొని వాడుతుంటారు. కానీ వీటిలోని రసాయనాలు చర్మానికి సైడ్ ఎఫెక్ట్స్ కలిగిస్తాయి. కొన్ని సార్లు ఎన్ని ప్రొడక్ట్స్ వాడినా ఫలితం మాత్రం అంతంత మాత్రంగానే ఉంటుంది. అలాంటి సమయంలోనే నేచురల్ టిప్స్ ట్రై చేయడం మంచిది.
ప్రతి రోజు మీ ముఖాన్ని శుభ్రం చేసుకోండి :
మీ చర్మం మెరిసేలా ఉండాలంటే ప్రతి రోజు మీరు హెర్బల్ లేదా కెమికల్స్ లేని షాంపూ సహాయంతో మీ ముఖాన్ని వాష్ చేసుకోండి. ఇలా చేయడం ద్వారా మీ స్కిన్ పై ఉన్న మురికితో పాటు నూనెలు, చెమట సులభంగా తొలగిపోతాయి. అంతే కాకుండా మీ ముఖం కూడా మృదువుగా మారుతుంది.
మాయిశ్చరైజర్:
కాంతివంతమైన ముఖం కోసం తప్పకుండా మాయిశ్చరైజర్ వాడండి. మాయిశ్చరైజర్ అప్లై చేయడం వల్ల చర్మం లోపలి నుండి తేమగా తయారవుతుంది. ఎల్లప్పుడూ సహజంగా తయారు చేసిన మాయిశ్చరైజర్ మాత్రమే వాడాలి. ఇది మీ చర్మాన్ని సహజంగా మృదువుగా మార్చడంలో సహాయపడుతుంది.
హైడ్రేషన్ తో చర్మాన్ని మెరిసేలా చేయండి:
ఆరోగ్యంగా ఉండటానికి నీరు చాలా ముఖ్యం. నీరు తగినంత త్రాగితే చర్మం కూడా మెరుగ్గా ఉంటుంది. చర్మం ఆరోగ్యంగా మెరుస్తూ ఉండాలంటు రోజులో 7- 10 గ్లాసుల నీరు త్రాగాలి. నీరు మాత్రమే కాకుండా శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచే ఆహారాలు కూడా మీరు తీసుకోవచ్చు.
చలికాలం చర్మానికి అనేక రకాల సవాళ్లను తెస్తుంది. చల్లని గాలులతో పాటు పొడి వాతావరణం చర్మాన్ని నిర్జీవంగా చేస్తుంది. మీ చర్మానికి పోషణతో పాటు తేమ అందించడానికి ఇంట్లో తయారు చేసిన ఫేస్ మాస్కులు అవసరం. వీటిని వాడటం వల్ల మంచి ఫలితం ఉంటుంది.
Also Read: చలికాలంలో ఈ టిప్స్ పాటిస్తే.. గ్లోయింగ్ స్కిన్
బొప్పాయి, తేనె, పాలతో ఫేస్ ప్యాక్:
పండిన బొప్పాయి పేస్టు 1 టేబుల్ స్పూన్ తీసుకుని అందులో 1 టీ స్పూన్ తేనె కలిపి పాలు కూడా వేసి మిక్స్ చేయాలి. తర్వాత ఈ మిశ్రమాన్ని ముఖానికి పట్టించి 15 నిమిషాల పాటు అలాగే ఉంచాలి. ఇలా తరుచుగా చేయడం వల్ల ముఖం కాంతివంతంగా మారుతుంది. అంతే కాకుండా ఇది మొటిమలను తగ్గించడంలో ఉపయోగపడుతుంది.
గమనిక: వీటిని పాటించే ముందు తప్పకుండా నిపుణుల సలహా తీసుకోవాలి. ఈ వివరాలు కేవలం మీ అవగాహనకు మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘బిగ్ టీవీ’ బాధ్యత వహించదని గమనించగలరు.