trinayani serial today Episode: ఎవరైనా కుక్కులు పెంచుతారు కానీ మీరేంటండి పాములు పెంచుతున్నామని అంటున్నారు అంటూ ముక్కోటి భయంతో మీ అమ్మను పిలవవే ఇక్కడి నుంచి వెళ్లిపోదాం అంటాడు. వైకుంఠం గట్టిగా అమ్మా అంటూ పిలుస్తుంది. ఇంతలో రత్నాంభ ఏడుస్తుంటే.. నయని, విక్రాంత్ ఆమెను ఓదారుస్తూ తీసుకొస్తారు. నయని ఏమైంది బామ్మ ఏడుస్తుంది అని అడుగుతాడు. త్రినేత్రి ఉక్రోషంతో వెళ్లిపోయిందంట బాబుగారు అని చెప్పగానే మా మేన కోడలు వెళ్లిపోయిందా..? ఎక్కడికి అని ముక్కోటి అడుగుతాడు.
అవునని ఎక్కడికో తెలియదని చెప్తుంది నయని. ఇంతలో తిలొత్తమ్మ కోపంగా నాటకాలు ఆడుతున్నావా..? నయని అంటూ తిడుతుంది. దీంతో అమ్మా త్రినేత్రి బామ్మ గారిని నయని వదిన దగ్గరకు తీసుకెళ్లింది. అని చెప్పగానే అదేంటి అచ్చం నాలాగే ఉందని మా అక్క అవాక్కయి ఉంటుంది అని సుమన అనగానే మీ అక్క ఏంటమ్మా నేను అవాక్కయ్యాను అని రత్నాంభ చెప్తుంది. ఏమ్మా నీ మనవరాలిని నయనిని దగ్గరగా చూశావా అని తిలొత్తమ్మ అడుగుతుంది. ఇలా ఎదురెదురుగా పెట్టుకుని చూశాను.
ఆ అమ్మ వారి లీల ఏంటో తెలియదు కానీ ఇద్దరినీ ఒకేలాగా పుట్టించింది అని రత్నాంభ చెప్తుంది. దీంతో విశాల్ అది సరే బామ్మ నేత్రి ఎక్కడ ఉంది అని అడుగుతాడు. అయిందేదో అయింది కానీ పెళ్లి కొడుకుగా విశాల్ బాబుగారినే అనుకున్నాను. నేను మీతో రానని చెప్పింది.. దీంతో నేను దాని మీద కోప్పడ్డాను.. దీతో ఏడుస్తూ ఇల్లు వదిలిపెట్టి వదిలిపోయిందే అంటూ రత్నాంభ ఏడుస్తుంది. రత్నాంభను నయని, విక్రాంత్ ఓదారుస్తుంటారు. మీరు ఓదారుస్తారేంటండి అని సుమన, విక్రాంత్‌ను అడుగుతుంది.
నా కళ్ల ముందే త్రినేత్రి వెళ్లిపోయింది. గార్డెన్‌లో ఉందేమోనని చూశాను. కానీ అక్కడ లేదు అని విక్రాంత్ చెప్తాడు. దీంతో మనం వెళ్లి త్రినేత్రిని వెతుకుదాం అని వల్లభను అడగ్గానే నువ్వు వెళ్లి వెతుకు నేను రాను.. నిన్ను చూసైనా నీతో పాటు వస్తుందేమో అంటాడు వల్లభ. ఇంతలో తిలొత్తమ్మ ఒక్క నిమిషం త్రినేత్రి నిన్నా మొన్న ఇంట్లో లేదు కదా..? అంటూ డౌట్ క్రియేట్ చేస్తుంది. ఇంట్లో ఎందుకు లేదు.. ఉంది కదా అంటాడు విక్రాంత్.. నువ్వు చూశావా విక్రాంత్ అని విశాల్ అడగ్గానే ఇద్దరిని పక్కపక్కనే చూశాను అని చెప్తాడు విక్రాంత్. అయితే త్రినేత్రిని తీసుకు వచ్చే బాధ్యత నాది అంటాడు విశాల్. అయితే మా త్రినేత్రి వచ్చే వరకు నీలోనే నా మనవరాలిని చూసుకుంటాను నయని అంటుంది రత్నాంభ. అలాగే బామ్మ అని చెప్తుంది నయని.
గార్డెన్ లో నయని అటూ ఇటూ తిరుగుతూ ఏదో ఆలోచిస్తుంటే.. నేను ఆలోచించాలి కానీ నువ్వు ఆలోచిస్తున్నావేంటి చెల్లి అని అడుగుతుంది హాసిని. ఏం ఆలోచించాలి అక్కా అంటుంది నయని.. నేను కూడా ఇన్ని రోజులు నువ్వే త్రినేత్రిలా నటిస్తున్నావు అనుకున్నాను కానీ మీరు ఇద్దరూ ఇంట్లో ఉన్నా నేను కనిపెట్టలేకపోయాను అంటుంది. ఇంతలో తిలొత్తమ్మ, వల్లభ వచ్చి ఏం నయని నా కొడలిని కూడా ఆలోచనలో పడేశావా..? అంటూ అడుగుతుంది.
దీంతో వాళ్ల మాటలు పట్టించుకోవద్దు అక్కా.. పాపం బామ్మగారు తన మనవరాలిని ఇక్కడే ఉండమని ఎంత బతిమాలినా ఇక్కడ ఉండకుండా వెళ్లిపోయింది అని నయని చెప్తుంది. అప్పుడు మమ్మల్ని కూడా పిలవాల్సింది కదా అంటుంది హాసిని. ఎలాగూ విశాల్ బాబుగారు త్రినేత్రిని తీసుకొస్తాడు కదా అప్పుడు అందరూ చూద్దురే అని చెప్తూ.. నయని.. హాసినిని తీసుకుని వెళ్లిపోతుంది.
సుమన ఆలోచిస్తూ కూర్చుని విక్రాంత్ రాగానే ఇన్నాళ్లు మా నయని అక్క చెబితే గంగిరెద్దులా తలూపడమే వచ్చు అనుకున్నాను కానీ ఆ త్రినేత్రి చెప్పింది కూడా మీరు వినే ఉంటారు కదా..? అని సుమన అడగ్గానే.. త్రినేత్రా..? అంటూ ప్రశ్నించడంతో మీరు ఆ త్రినేత్రి చెప్పినట్టు విన్నావా..? అని అడుగుతుంది. వినొచ్చు.. ఎందుకంటే మా వదినే అనుకుని విన్నాను అని విక్రాంత్ చెప్పగానే ఇద్దరూ ఉన్నారా..? లేక ఒక్కరే ఇద్దరిలా నటిస్తున్నారా..? అని డౌటు వస్తుంది.
ఓకే పోలికతో ఉన్న త్రినేత్రిని మీరు మచ్చిక చేసుకుని మా అక్కకు చెక్ పెట్టి ఉంటే ఎలా ఉండేది త్రినేత్రికి ఎంతో కొంత కమీషన్ ఇచ్చి ఉంటే మీరు చక్రవర్తి అయ్యేవారు కదా..? అంటుంది. నీకు ఇంత దుర్మార్గపు బుద్ది ఉంది కాబట్టే నీకు భగవంతుడు ఏమీ ఇవ్వలేదు అని తిడుతూ విక్రాంత్ వెళ్లిపోతాడు. ఇంతటితో త్రినయని సీరియల్ ఈరోజు ఏపిసోడ్ అయిపోతుంది.
ALSO READ: సకల బాధలను దూరం చేసే షణ్ముఖి రుద్రాక్ష ధారణ ఎవరు చేయాలి..?