E-Paper
Advertisement
బిగ్ టీవీ ఇప్పుడు మలయాళంలో
ఓపెన్

పెంపుడు కుక్కలు, మనుషులే టార్గెట్.. వెలుగులోకి భయంకరమైన ఫాక్స్ టేప్‌వార్మ్!

పెంపుడు కుక్కలు, మనుషులే టార్గెట్.. వెలుగులోకి భయంకరమైన ఫాక్స్ టేప్‌వార్మ్!
Advertisement

Deadly parasite Pacific Northwest 2026: ప్రపంచాన్ని వణికించడానికి మరో భయంకరమైన పరాన్నజీవి (Parasite) వచ్చేసింది. అమెరికాలోని పసిఫిక్ నార్త్‌వెస్ట్ ప్రాంతంలో మనుషుల ప్రాణాలకే ముప్పు తెచ్చే ఒక వింత పురుగు వేగంగా విస్తరిస్తోందని యూనివర్సిటీ ఆఫ్ వాషింగ్టన్ శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. ఫాక్స్ టేప్‌వార్మ్ గా పిలిచే ఈ పరాన్నజీవి, మనుషుల శరీరంలోకి ప్రవేశిస్తే లివర్‌ను క్యాన్సర్‌లా మార్చేస్తుంది. అసలు ఈ పరాన్నజీవి ఏంటి? ఇది ఎలా వ్యాపిస్తుంది? దీనికి సంబందించిన మరిన్ని వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

కిల్లర్ పరాన్నజీవి ‘టేప్‌వార్మ్’ కలకలం:

కంటికి కనిపించని వైరస్‌లు, బ్యాక్టీరియాలు సృష్టించే అలజడి గురించి మనకు తెలుసు. కానీ.. ఇప్పుడు అమెరికాలో ‘ఎచినోకోకస్ మల్టిలోక్యులారిస్’ (Echinococcus multilocularis) అనే ఒక ప్రమాదకరమైన పరాన్నజీవి శాస్త్రవేత్తలను సైతం నిద్రపోనివ్వడం లేదు. వాషింగ్టన్ స్టేట్ యూనివర్సిటీ (WSU), యూనివర్సిటీ ఆఫ్ వాషింగ్టన్ పరిశోధకులు చేపట్టిన తాజా అధ్యయనంలో.. Puget Sound పరిసర ప్రాంతాల్లోని దాదాపు 37% అడవి తోడేళ్ళు (Coyotes), నక్కలలో ఈ కిల్లర్ పరాన్నజీవి ఉన్నట్లు తేలింది. ఇప్పటివరకు ఐరోపా, ఆసియా దేశాలకే పరిమితమైన ఈ యూరోపియన్ వేరియంట్, ఇప్పుడు అమెరికా పశ్చిమ తీరానికి చేరడం పబ్లిక్ హెల్త్ ఎమర్జెన్సీగా మారుతోంది.

ఇది ఎలా వ్యాపిస్తుంది?

Advertisement

ఈ పరాన్నజీవి చాలా తెలివైంది. ఇది నక్కలు, తోడేళ్ల పేగుల్లో జీవిస్తూ లక్షలాది సూక్ష్మ గుడ్లను వాటి మల విసర్జన ద్వారా బయటకు విడుదల చేస్తుంది. ఈ మలంతో కలుషితమైన మట్టి, నీరు లేదా పండ్లను ఎలుకలు, ఉడుతలు తిన్నప్పుడు అవి ఈ పరాన్నజీవి బారిన పడతాయి. అయితే.. పెంపుడు కుక్కలు ఈ ఎలుకలను వేటాడినప్పుడు లేదా కలుషితమైన మట్టిలో ఆడినప్పుడు వాటి ద్వారా మనుషులకు ఈ వ్యాధి సంక్రమిస్తుంది.

మనుషులలో ‘ఆల్వియోలార్ ఎచినోకోకోసిస్’:

మనుషులు పొరపాటున ఈ టేప్‌వార్మ్ గుడ్లను ఆహారం లేదా నీటి ద్వారా మింగినప్పుడు, అవి నేరుగా కాలేయం (Liver) లోకి ప్రవేశిస్తాయి. అక్కడ ఇవి నెమ్మదిగా కణితులుగా మారుతాయి. భయంకరమైన విషయం ఏమిటంటే.. ఈ వ్యాధి లక్షణాలు బయటపడటానికి 5 నుంచి 15 సంవత్సరాల సమయం పడుతుంది. ఇది కాలేయాన్ని పూర్తిగా నాశనం చేసి,క్రమంగా ఊపిరితిత్తులు,మెదడుకు కూడా వ్యాపిస్తుంది. అందుకే దీనిని ‘లివర్ క్యాన్సర్’ లాంటి వ్యాధిగా వైద్యులు పరిగణిస్తారు.

చికిత్స :

Advertisement

ఈ వ్యాధిని ముందే గుర్తిస్తే మందులతో నయం చేయవచ్చు. ముదిరిపోతే మాత్రం సర్జరీ తప్పనిసరి.

యాంటీ-పారాసిటిక్ టాబ్లెట్స్: ప్రాథమిక దశలో వాడే అల్బెండజోల్ వంటి టాబ్లెట్ల ధర మన దేశంలో ఒక స్ట్రిప్ రూ.50 నుంచి రూ.200 వరకు ఉంటుంది. కానీ.. అమెరికా వంటి దేశాల్లో దీని నెలకు అయ్యే ఖర్చు చాలా ఎక్కువ. తీవ్రతను బట్టి ఈ మందులను కొన్ని ఏళ్ల పాటు వాడాల్సి రావచ్చు.

సర్జరీ , మెడికల్ మేనేజ్‌మెంట్: కాలేయంలోని కణితులను తొలగించే సర్జరీల కోసం కార్పొరేట్ హాస్పిటల్స్‌లో రూ.2,00,000 నుంచి రూ.5,00,000 వరకు ఖర్చవుతుంది. అమెరికాలో అయితే హెల్త్ ఇన్సూరెన్స్ లేకపోతే వేల డాలర్లు ఖర్చు పెట్టాల్సి వస్తుంది.

ఎలా జాగ్రత్తగా ఉండాలి?

చేతులు శుభ్రం చేసుకోవడం : తోటపని చేసిన తర్వాత లేదా మట్టిని తాకినప్పుడు చేతులను శానిటైజ్ చేసుకోవాలి.

కూరగాయలు,పండ్లు: అడవి ప్రాంతాల నుంచి తెచ్చే బెర్రీలు, కూరగాయలను బాగా కడిగిన తర్వాతే తినాలి.

పెంపుడు జంతువుల సంరక్షణ: మీ కుక్కలకు క్రమం తప్పకుండా డీవార్మింగ్ మందులు ఇప్పించాలి.

ఈ పరాన్నజీవి మనుషులకు సోకడం చాలా అరుదైనప్పటికీ.. పసిఫిక్ నార్త్‌వెస్ట్ వాతావరణ మార్పుల వల్ల ఇది వేగంగా వ్యాపిస్తోంది.ఈ హెల్త్ అలర్ట్‌ను నిర్లక్ష్యం చేయకుండా ప్రాథమిక పరిశుభ్రత పాటించడం ద్వారా మనల్ని మనం కాపాడుకోవచ్చు.

Tags

Related News

వీళ్లకు జీవితం ఒక చదరంగం.. ఈ తేదీల్లో పుట్టినవారికి మాస్టర్‌మైండ్ తెలివి ఓడించడం చాలా కష్టం

చాణక్య నీతి.. జీవితంలో ఈ 4 రహస్యాలు ఎవరికీ చెప్పకూడదు.. చెబితే తీవ్ర నష్టం

చూడగానే వావ్ అనిపిస్తుంది.. తక్కువ ఖర్చు, చిన్న మార్పులతో మీ కిచెన్‌కు మోడ్రన్, లగ్జరీ లుక్

పురుషుల కంటే మహిళల్లో థైరాయిడ్ సమస్యలు ఎందుకు ఎక్కువ? దీనికి కారణాలు ఇవే

టీనేజ్ అమ్మాయిలతో పీరియడ్స్,సెక్స్ ఎడ్యుకేషన్ గురించి ఎలా మాట్లాడాలి?

న్యూమరాలజీ.. ఈ తేదీల్లో పుట్టిన వారి వైవాహిక జీవితంలో ఎప్పుడూ కష్టాలే

పిల్లలను ప్రయోజకులుగా చేయాలంటే ఈ మంచి అలవాట్లు నేర్పించండి.. ఇవే బలమైన వ్యక్తిత్వానికి పునాది

Big Stories

×